విశ్వక్సేన్ నటించిన లేటెస్ట్ మూవీ ఫంకీ (Funky). ఈ సినిమా శుక్రవారం (ఫిబ్రవరి 13) థియేటర్లలో రిలీజైంది. అయితే దీనికి చాలా వరకు నెగటివ్ రివ్యూలు వస్తుండటంపై తాజాగా మూవీ ప్రొడ్యూసర్ నాగవంశీ స్పందించాడు. తాము ఓ సిల్లీ ఫిల్మ్, ఓ కామెడీ మూవీయే తీశామని మొదటి నుంచీ చెబుతూ వస్తున్నానని అన్నాడు.
సాగర సంగమం తీశానని చెప్పలేదు

ఫంకీ సినిమా రిలీజైన రోజే మూవీ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు మేకర్స్. దీనికి చాలా వరకు పాజిటివ్ రివ్యూలేమీ రాలేదు. పైగా మూవీలో కథేమీ లేదని, కొన్ని సీన్లను అలా అతికించి తీసేశారని ఎక్స్ లో పలువురు ప్రేక్షకులు రివ్యూలు ఇచ్చారు. దీనిపై నాగవంశీ సెటైరిక్ గా స్పందించాడు. మూవీకి వస్తున్న రివ్యూల గురించి మీడియా ప్రశ్నించగా.. అతడు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
“నేను ముందే చెప్పాను కదా. ఈ సినిమాకు ప్రెస్ మీట్ కు వచ్చిన ప్రతీసారీ ఇదే చెప్పాను. ఇవాళ మార్నింగ్ ఫస్ట్ షో చూసిన వాళ్లు చాలా మంది అసలు ఫ్లో లేదు, అతుకులు అతుకులుగా ఉంది.. సీన్ల కోసం కథ రాసినట్లుగా ఉందని అన్నారు. అది నేను చెప్పాను కదా.. అదేదో పెద్ద సైంటిస్టుల్లాగా మీరు కనిపెట్టినట్లు చెబుతారేంటి? నేనేదో అద్భుతమైన సాగర సంగమంలాంటి సినిమా తీశానని చెప్పలేదు. ఓ కామెడీ మూవీ, ఓ సిల్లీ సినిమానే తీశానని చెప్పాను” అని నాగవంశీ అనడం విశేషం.
రివ్యూయర్లకు నచ్చదని తెలుసు.. ఇందులో గ్రామర్ లేదు
ఈ సినిమాకు మీరు అనుకున్న ఫలితమే వచ్చిందా అని కూడా రిపోర్టర్లు నాగవంశీని ప్రశ్నించారు. దీనికి అతడు స్పందిస్తూ.. “కొంచెం డివైడ్ ఉంటది. రివ్యూయర్లకు నచ్చే సినిమా తీస్తానని కచ్చితంగా అనుకోలేదు. ఎందుకంటే ఓ సినిమాకు కావాల్సిన గ్రామర్ అయితే లేదు. లేదని తెలిసే తీశాము. కానీ సాధారణ ప్రేక్షకులు కూడా ఎడిట్ ప్యాచీగా ఉందంటున్నారు. అసలు తీసుకున్నదే బ్లాకులు బ్లాకులుగా తీసుకున్నాం. ఒక కథను ఫ్లోగా తీయలేదు. అంత డీప్ గా, టెక్నికల్ గా చూశారు. వచ్చి నవ్వుకుంటూ వెళ్లండనే మొదటి నుంచీ చెబుతున్నాను” అని నాగవంశీ చెప్పాడు.
అనుదీప్‌తో సినిమా అంటే అంతే కదా
{{/usCountry}}ఈ సినిమాకు మీరు అనుకున్న ఫలితమే వచ్చిందా అని కూడా రిపోర్టర్లు నాగవంశీని ప్రశ్నించారు. దీనికి అతడు స్పందిస్తూ.. “కొంచెం డివైడ్ ఉంటది. రివ్యూయర్లకు నచ్చే సినిమా తీస్తానని కచ్చితంగా అనుకోలేదు. ఎందుకంటే ఓ సినిమాకు కావాల్సిన గ్రామర్ అయితే లేదు. లేదని తెలిసే తీశాము. కానీ సాధారణ ప్రేక్షకులు కూడా ఎడిట్ ప్యాచీగా ఉందంటున్నారు. అసలు తీసుకున్నదే బ్లాకులు బ్లాకులుగా తీసుకున్నాం. ఒక కథను ఫ్లోగా తీయలేదు. అంత డీప్ గా, టెక్నికల్ గా చూశారు. వచ్చి నవ్వుకుంటూ వెళ్లండనే మొదటి నుంచీ చెబుతున్నాను” అని నాగవంశీ చెప్పాడు.
అనుదీప్‌తో సినిమా అంటే అంతే కదా
{{/usCountry}}ఇక డైరెక్టర్ అనుదీప్ గురించి నాగవంశీ స్పందిస్తూ.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అనుదీప్ లాంటి వ్యక్తితో సినిమా అంటే రిస్కే కదా.. కొన్నిసార్లు పెద్ద హిట్ వస్తది.. మరోసారి తప్పుతుంది.. ఏది ఎలా వచ్చినా అలా తీసుకోవాలి కదా అని నాగవంశీ అన్నాడు. అయితే అతడు ఈ మూవీని చాలా తక్కువ బడ్జెట్ తో తీయడం మాత్రం నిర్మాతగా తనకు సంతోషకరమైన విషయం అని స్పష్టం చేశాడు.