వాళ్ల అమ్మ చేతి భోజనం చేశా.. విష్వక్ సేన్ ఫంకీ మూవీ బాగా ఆడాలి.. మాకు సెట్ కాలేదు అంతే: అర్జున్

సీనియర్ హీరో అర్జున్ సర్జా, యంగ్ హీరో విష్వక్ సేన్ మధ్య విభేధాలు వచ్చిన సంగతి తెలిసిందే. అర్జున్ మూవీ నుంచి విష్వక్ తప్పుకొన్నాడు కూడా. అయితే ఇప్పుడు విష్వక్ మూవీ ఫంకీ, అర్జున్ డైరెక్ట్ చేసిన సీతా పయనం ఒక రోజు తేడాతో రిలీజ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అర్జున్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 

Published on: Feb 08, 2026 8:53 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సీనియర్ హీరో అర్జున్ సర్జా దర్శకత్వం వహించిన మూవీ ‘సీతా పయనం’. ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ కూడా అతనే. తన కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా తెలుగులో చేస్తున్న ఫస్ట్ మూవీ ఇది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా యాక్షన్ కింగ్ అర్జున్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. విష్వక్ సేన్ ఫంకీ మూవీ గురించి మాట్లాడాడు.

అర్జున్ సర్జా (instagram-Arjun Sarja)
అర్జున్ సర్జా (instagram-Arjun Sarja)

సీతా పయనం వర్సెస్ ఫంకీ

అర్జున్ సర్జా దర్శకత్వం వహించిన మూవీ సీతా పయనం. ఈ చిత్రం వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. మరోవైపు విష్వక్ సేన్ హీరోగా నటించిన కామెడీ ఎంటర్ టైనర్ ఫంకీ ఫిబ్రవరి 13న రిలీజ్ కానుంది. బాక్సాఫీస్ దగ్గర ఈ రెండు సినిమాలు క్లాష్ కానున్నాయి.

అర్జున్ కామెంట్లు

ఫంకీ సినిమాతో తన సినిమా సీతా పయనం పోటీ పడటం పట్ల అర్జున్ సర్జా ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. సీతా పయనం సినిమాలో ముందు హీరోగా విష్వక్ సేన్ అనుకున్నారు. షూటింగ్ కూడా చేశారు. కానీ మధ్యలో గొడవల కారణంగా విష్వక్ తప్పుకున్నాడు.

ఇంటర్వ్యూలో అర్జున్ కు ఈ సినిమాలో ముందు అనుకున్న హీరో విష్వక్ సేన్ ఫంకీ సినిమా ఫిబ్రవరి 13న రిలీజ్ అవుతుంది, మీ సినిమా 14 నాడు వస్తుందనే ప్రశ్న ఎదురైంది.

వాళ్ల ఇంట్లో భోజనం

‘‘ఆ సినిమా కూడా చాలా బాగా ఆడాలి. అతనో యంగ్ బాయ్. వాళ్ల సినిమా బాగా ఆడాలి. ఏదో మనకు కుదరలేదు. మేం సినిమా చేయలేదు. వాళ్ల అమ్మ చేతి భోజనం చేశా. వాళ్లు బాగుండాలి. అందరూ బాగుండాలి. ఆ సినిమా బాగా ఆడాలి. మా సినిమా బాగా ఆడాలి. ఎవరి మీద కోపం లేదు. లైఫ్ మూవ్ అవుతూ ఉండాలి. అందరూ హ్యాపీగా ఉండాలి’’ అని అర్జున్ అన్నాడు.

తండ్రి డైరెక్షన్

తండ్రి అర్జున్ దర్శకత్వంలో కూతురు ఐశ్వర్య హీరోయిన్ గా చేసిన సినిమా సీతా పయనం. ఫిబ్రవరి 14న ఈ రొమాంటిక్ డ్రామా రిలీజ్ కానుంది. అర్జున్ ఇప్పటికే డైరెక్టర్ గా 11 సినిమాలు చేశాడు. సీతా పయనం మూవీలో అర్జున్ కూడా నటించాడు. ఈ సినిమా స్టోరీ కూడా అర్జున్ దే.

ఐశ్వర్య అర్జున్ సినిమాలు

అర్జున్ కూతురిగా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఐశ్వర్య. 2013లో తమిళ సినిమా పట్టతు యానై మూవీతో కెరీర్ స్టార్ట్ చేసింది ఐశ్వర్య. 2018లో కన్నడలో ప్రేమ బరహ మూవీ చేసింది. అదే ఏడాది తమిళంలో సొల్లివిడవ చిత్రంలో యాక్ట్ చేసింది. ఇప్పుడు తెలుగులో సీతా పయనంతో అడుగుపెడుతోంది ఐశ్వర్య.