...
...
Next Story

కొన్ని నిర్ణయాలు బలిసి తీసుకున్నాను.. వార్ 2తో నష్టం తక్కువే.. ఈ సినిమా ప్రతి సీన్‌కూ నవ్వుతారు: ప్రొడ్యూసర్ నాగవంశీ

ప్రొడ్యూసర్ నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. వార్ 2 సినిమా నష్టాలపై తొలిసారి ఓపెన్ అవడంతోపాటు తాను కొన్ని నిర్ణయాలను బలిసి తీసుకున్నానని అనడం గమనార్హం. ఇక అనగనగా ఒక రాజు మూవీ గురించి కూడా స్పందించాడు.

Published on: Dec 25, 2025, 20:07:19 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

టాలీవుడ్‌లో మీడియా ముందు కూడా ఓపెన్ గా మాట్లాడే ప్రొడ్యూసర్లలో నాగవంశీ కూడా ఒకరు. అతడు నిర్మిస్తున్న అనగనగా ఒక రాజు మూవీ సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా గ్రేట్ ఆంధ్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మరి అవేంటో చూడండి.

కొన్ని నిర్ణయాలు బలిసి తీసుకున్నాను

కొన్ని నిర్ణయాలు బలిసి తీసుకున్నాను.. వార్ 2తో నష్టం తక్కువే.. ఈ సినిమా ప్రతి సీన్‌కూ నవ్వుతారు: ప్రొడ్యూసర్ నాగవంశీ
కొన్ని నిర్ణయాలు బలిసి తీసుకున్నాను.. వార్ 2తో నష్టం తక్కువే.. ఈ సినిమా ప్రతి సీన్‌కూ నవ్వుతారు: ప్రొడ్యూసర్ నాగవంశీ

ఇంటర్వ్యూ మొదట్లోనే నాగవంశీ ఈ ఏడాది త్వరగా వెళ్లిపోతే బాగుండు అన్నట్లుగా మాట్లాడాడు. ఎందుకు అని అడిగితే.. తాను కొన్ని నిర్ణయాలను బలిసి తీసుకున్నానని, అవన్నీ మిస్ ఫైర్ అయ్యాయని చెప్పాడు.

“ఈ ఏడాది అంతగా కలిసి రాలేదు. అందుకే ఈ ఫేజ్ త్వరగా వెళ్లిపోతే బాగుండు అనిపిస్తోంది. కొన్ని కొన్ని నిర్ణయాలు బలిసి తీసుకున్నాను. అవన్నీ మిస్ ఫైర్ అయ్యాయి. ఎప్పుడైనా అంతే కదా దేవుడు వీడికి ఎక్కువైందో గాల్లో ఉన్నాడు కింద పడేస్తే కానీ తెలియదంటారు కదా.. కొన్ని నెత్తికెక్కి నిర్ణయాలు తీసుకున్నాను. ఏదీ గ్రాంటెడ్ గా తీసుకోకూడదని అర్థమైంది. అందుకే మళ్లీ ఎక్కడ మొదలుపెట్టానో అక్కడి నుంచే స్టార్ట్ చేశాను” అని నాగవంశీ అన్నాడు.

అతడు చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆ నిర్ణయాలు ఏవి? ఎవరి కోసం తీసుకున్నాడనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతున్నాయి.

వార్ 2 నష్టాలు పెద్దగా లేవు

ఇక వార్ 2 నష్టాల గురించి వస్తున్న వార్తలపైనా నాగవంశీ స్పందించాడు. అసలు ఆ సినిమాను కొన్నదే రూ.68 కోట్లకు అని, అందులో రూ.40 కోట్ల షేర్ వచ్చిందని.. ఇక యశ్ రాజ్ ఫిల్మ్స్ తనను పిలిచి రూ.18 కోట్లు తిరిగి ఇచ్చిందని అతడు చెప్పాడు. అందువల్ల వార్ 2 విషయంలో పెద్దగా నష్టాలేవీ లేవని స్పష్టం చేశాడు. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారమే.. వాళ్లు కార్పొరేట్ అయినా కూడా తాను అడగ్గానే పిలిచి రూ.18 కోట్లు ఇచ్చినట్లు నాగవంశీ తెలిపాడు.

అనగనగా ఒక రాజు మూవీ గురించి..

గతంలో మ్యాడ్ మూవీ గురించి కూడా అదే చెప్పానని, ఈ సినిమా కూడా అంతేనని తెలిపాడు. సంక్రాంతి సినిమాల్లో తమదే చిన్న మూవీ అని మరోసారి చెప్పాడు. నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి నటించిన అనగనగా ఒక రాజు సినిమా జనవరి 14న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe