హిందీ చిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న వివాదాల్లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన ‘షూబైట్’ (Shoebite) సినిమా ఒకటి. షూటింగ్ పూర్తయినా ఇప్పటికీ చిత్రం విడుదల అవ్వకపోడానికి వెనుక ఉన్న అసలు కారణాలను ప్రముఖ నిర్మాత శైలేంద్ర సింగ్ తాజాగా బయటపెట్టారు. 'పేజ్ 3', 'ట్రాఫిక్ సిగ్నల్' వంటి జాతీయ అవార్డు చిత్రాలను నిర్మించిన ఆయన.. అమితాబ్ బచ్చన్, దర్శకుడు షూజిత్ సర్కార్‌లపై సంచలన ఆరోపణలు చేశారు.
రూ. 4 కోట్ల ఒప్పందం.. కానీ!

ఒక ఇంటర్వ్యూలో శైలేంద్ర సింగ్ మాట్లాడుతూ, "నిజానికి నేను షూజిత్ సర్కార్‌తో కలిసి ‘జానీ వాకర్’ (షూబైట్ ఫస్ట్ టైటిల్) అనే కథను డెవలప్ చేశాను. ఈ కథను అమితాబ్ బచ్చన్‌కు వినిపించి, ఆయన్నే హీరోగా ఖరారు చేశాం. ఇందుకోసం బిగ్ బికి అడ్వాన్స్‌గా రూ. 4 కోట్లు చెల్లించాను. అగ్రిమెంట్ కూడా పూర్తయింది. షూజిత్‌ను స్వయంగా నేనే జల్సాకు తీసుకెళ్లి అమితాబ్‌కు పరిచయం చేశాను" అని వివరించారు.
అయితే, ఆ తర్వాత ఏబీ కార్పొరేషన్ (AB Corp) ఈ సినిమాను తామే నిర్మిస్తామని ప్రతిపాదించిందని, కానీ తాను కేవలం అమితాబ్‌ను నటుడిగానే కోరుకున్నానని, నిర్మాణ భాగస్వామ్యం ఇవ్వడానికి నిరాకరించానని శైలేంద్ర సింగ్ తెలిపారు.
దర్శకుడిని, సినిమాను కోల్పోయాను..
ఆ వివాదం తర్వాత షూజిత్ సర్కార్ తనతో కాకుండా అమితాబ్ బచ్చన్‌తో సన్నిహితమయ్యారని శైలేంద్ర సింగ్ ఆరోపించారు. "ఆ రోజు నుంచి షూజిత్ నా చేయి జారిపోయారు. ఇప్పటికీ అమితాబ్ నటించే యాడ్స్ అన్నీ ఆయనే డైరెక్ట్ చేస్తున్నారు" అని శైలేంద్ర సింగ్ తెలిపారు.
"చివరికి నా కథను ‘జానీ మస్తానా’ పేరుతో రోనీ స్క్రూవాలా నిర్మించారు. అదే తర్వాత ‘షూబైట్’గా మారింది. కానీ న్యాయపరమైన చిక్కుల వల్ల ఆ సినిమా ఇప్పటికీ విడుదల కాలేదు. షూజిత్, అమితాబ్, దియా మీర్జాలు నటించిన ఈ సినిమా ఎందుకు ఆగిపోయిందో అందరికీ తెలుసు" అని శైలేంద్ర సింగ్ పేర్కొన్నారు.
విమానంలో ఎదురుపడ్డ బిగ్ బి..
ఈ వివాదంపై కోర్టులో కేసులు నడుస్తున్న సమయంలోనే ఒకసారి విమానంలో తనకు అమితాబ్ బచ్చన్ ఎదురయ్యారని శైలేంద్ర సింగ్ గుర్తుచేసుకున్నారు. "నేను ఆయన్ని కలిసి ‘సార్, ఏంటి ఇదంతా?’ అని అడిగాను. దానికి ఆయన ఏమీ సమాధానం చెప్పలేదు, కేవలం చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు. ఆయన హుందాతనం అలాంటిది, ఏమీ మాట్లాడలేకపోయారు" అని శైలేంద్ర సింగ్ అన్నారు.
{{/usCountry}}ఈ వివాదంపై కోర్టులో కేసులు నడుస్తున్న సమయంలోనే ఒకసారి విమానంలో తనకు అమితాబ్ బచ్చన్ ఎదురయ్యారని శైలేంద్ర సింగ్ గుర్తుచేసుకున్నారు. "నేను ఆయన్ని కలిసి ‘సార్, ఏంటి ఇదంతా?’ అని అడిగాను. దానికి ఆయన ఏమీ సమాధానం చెప్పలేదు, కేవలం చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు. ఆయన హుందాతనం అలాంటిది, ఏమీ మాట్లాడలేకపోయారు" అని శైలేంద్ర సింగ్ అన్నారు.
{{/usCountry}}కాగా, న్యాయపరమైన వివాదాల కారణంగా 2012లో కోర్టు స్టే ఇవ్వడంతో 'షూబైట్' ల్యాబ్‌కే పరిమితమైంది. అనంతరం షూజిత్ సర్కార్, అమితాబ్ బచ్చన్ కాంబినేషన్‌లో 'పికు', 'గులాబో సితాబో' వంటి విజయవంతమైన చిత్రాలు రావడం గమనార్హం.