...
...
Next Story

Impure: సమంత మా ఇంటి బంగారం స్ఫూర్తితో ఇంప్యూర్- చెల్లి పెళ్లి డబ్బుతో సినిమా: నిర్మాత, నటి, రచయిత్రి వారాహి మల్లిపాముల

Producer Varahi Mallipamula About Impure: అమెరికాలో స్థిరపడిన తెలుగు అమ్మాయి వారాహి మల్లిపాముల నిర్మాత, నటి, రచయిత్రిగా మారిన లేటెస్ట్ మూవీ ఇంప్యూర్. సమంత, నందినీరెడ్డి మా ఇంటి బంగారం సినిమా స్ఫూర్తితోనే ఇంప్యూర్ మూవీని తెరకెక్కించినట్లు వారాహి మల్లిపాముల ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.

Published on: Oct 1, 2026, 09:21:42 IST
Advertisement

Producer Varahi Mallipamula About Impure: ‘ఇంప్యూర్’ చిత్రంతో ఇండస్ట్రీలోకి నిర్మాతగా, నటిగా, రచయిత్రిగా అరంగేట్రం చేస్తున్న తెలుగు అమ్మాయి వారాహి మల్లిపాముల. కాకినాడలో పుట్టిన వారాహి అమెరికాలోని పెన్సిల్వేనియాలో పెరిగారు. ప్రస్తుతం న్యూయార్క్‌లో నివసిస్తున్నారు.

ఆరేళ్ల క్రితం

సమంత మా ఇంటి బంగారం స్ఫూర్తితో ఇంప్యూర్- చెల్లి పెళ్లి డబ్బుతో సినిమా: నిర్మాత, నటి, రచయిత్రి వారాహి మల్లిపాముల
సమంత మా ఇంటి బంగారం స్ఫూర్తితో ఇంప్యూర్- చెల్లి పెళ్లి డబ్బుతో సినిమా: నిర్మాత, నటి, రచయిత్రి వారాహి మల్లిపాముల

పెన్ స్టేట్ నుంచి ఇంజనీరింగ్, జర్నలిజంలో డబుల్ మేజర్ పూర్తి చేశారు వారాహి మల్లిపాముల. న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, లండన్ వంటి నగరాల్లో జీవనోపాధి కోసం ఆమె టెక్ రంగంలో పనిచేశారు. కానీ తన సినిమా కలలను మాత్రం ఎప్పుడూ వదులుకోలేదు. అందుకే ఆరు సంవత్సరాల క్రితం, పగలు ఉద్యోగం చేస్తూ, రాత్రులు, వీకెండ్స్‌లో స్క్రిప్ట్ రాస్తూ ఉండేవారు.

సమంత నటించిన 'మా ఇంటి బంగారం' సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో పని చేసిన నిశాంతి ఎవాని ‘ఇంప్యూర్’తో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఒక మహిళ కన్య కాదని ఆమె అత్తమామలకు తెలియడంతో ఆ పెళ్లిని రద్దు చేసే కథాంశంతో ‘ఇంప్యూర్’ సినిమాని తెరకెక్కించారు.

అందుకే తెలుగు మహిళను తీసుకున్నాం

తెలుగు చిత్ర పరిశ్రమ తరచుగా తెలుగు పాత్రలకు ఉత్తర భారత మహిళలనే తీసుకుంటుంది. మహిళా ప్రాధాన్య చిత్రాలను అమ్మడం చాలా కష్టం. అందుకే వారాహి ప్రధాన పాత్రలో తెలుగు మహిళ అయిన యషా ముత్తులూరిని తీసుకున్నారు. ఇక ‘ఇంప్యూర్’ చిత్ర విశేషాల గురించి వారాహి మల్లిపాముల పలు విషయాలు పంచుకున్నారు.

"నేను ఎన్నో ఏళ్లుగా సినిమా ప్రయత్నాలు చేస్తూ ఉండటం.. దగ్గరకు వచ్చి అవకాశాలు దూరం అవ్వడం వంటి సంఘటనల్ని అమ్మ చూశారు. మా చెల్లి పెళ్లికి మా అమ్మ చాలా ఖర్చు పెట్టారు. అందుకే ఆ డబ్బును సినిమాలో పెట్టాలనుకుంటే ఇస్తానని చెప్పారు. నేను ఆ ప్రతిపాదనను అంగీకరించాను. కానీ ఆ డబ్బుతో ఒక పూర్తి సినిమా తీయలేకపోయాను. మేము ఇంకా చాలా అప్పు చేశాం. నటీనటులు, సాంకేతిక నిపుణులను నియమించుకోవడానికి నేను న్యూయార్క్ నుంచి వచ్చాను" అని ఆమె తెలిపారు.

వారే నాకు స్ఫూర్తి

"థియేటర్లలో 'ఇంప్యూర్' చిత్రాన్ని నేనే స్వయంగా పంపిణీ చేయడానికి వారే నాకు స్ఫూర్తినిచ్చారు. మా సినిమా కోసం రాజ కుమారి, కరణ్ పాండవ్‌లతో కలిసి పాటలు స్వరపరిచారు. వారిద్దరూ గ్రామీ అవార్డుకు నామినేట్ అయిన కళాకారులు. 'ఓఎమ్‌జి' పాటలోని హుక్ స్టెప్‌ను ప్రజలు నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. అది బాగా ప్రాచుర్యం పొందుతుందని ఆశిస్తున్నాను" అని వారాహి పేర్కొన్నారు.

స్త్రీ, పురుషుల సమస్యలపై

"సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ వి.ఎస్. మా సినిమా స్థాయిని పెంచారు. రక్తపాతంతో నిండిపోయిన చిత్రాల నుంచి మా ఇండిపెండెంట్ చిత్రాన్ని కాస్త భిన్నంగా చూడమని ప్రజలను కోరుతున్నాను. మా చిత్రం స్త్రీ, పురుషుల సమస్యలపై ఒక కొత్త దృక్కోణాన్ని అందిస్తుంది" వారాహి మల్లిపాముల వెల్లడించారు.

"సాయి కృష్ణ అద్భుతంగా నటించాడు. 'ఇంప్యూర్' అందరికీ నచ్చుతుందని నేను నమ్ముతున్నాను. ‘మా ఇంటి బంగారం’ చిత్రంలానే 'ఇంప్యూర్' సినిమాని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను" అని నిర్మాత, రచయిత్రి, నటి వారాహి మల్లిపాముల కోరారు.

అక్టోబర్ 2న ఇంప్యూర్ రిలీజ్

'ఇంప్యూర్' వరల్డ్ ప్రీమియర్ లాస్ ఏంజిల్స్‌లోని ప్రతిష్టాత్మక టిసిఎల్ చైనీస్ థియేటర్‌లో జరిగింది. ఆ తర్వాత న్యూయార్క్‌లోని చారిత్రాత్మక సినిమా విలేజ్‌లో ఈస్ట్ కోస్ట్ ప్రీమియర్ జరిగింది. ఇక అక్టోబర్ 2న పాన్-ఇండియా వ్యాప్తంగా పరిమిత థియేటర్లలో ఇంప్యూర్ సినిమా విడుదల కానుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks