మోడ్రన్ రిలేషన్‌షిప్స్ డ్రామాగా ఇంప్యూర్- నిర్మాతలుగా తల్లీకూతుళ్లు- సంగీత దర్శకురాలిగా మారిన ర్యాపర్ రాజ కుమారి

Varahi Mallipamula Raja Kumari Impure Movie: అమెరికాలో స్థిరపడిన తెలుగు అమ్మాయి వారాహి మల్లిపాముల నిర్మించి, కథ అందించి నటించిన చిత్రం 'ఇంప్యూర్'. అంతర్జాతీయ ర్యాపర్ రాజా కుమారి సంగీత సారథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా అక్టోబర్ 2న థియేటర్లలో విడుదల కానుంది.

Published on: Sep 28, 2026, 15:41:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Varahi Mallipamula Raja Kumari Impure Movie: తెలుగు చిత్ర పరిశ్రమకు విదేశీ వేదికల నుంచి సరికొత్త ఆలోచనలు, వినూత్నమైన ప్రతిభ వచ్చి చేరుతున్నాయి. అమెరికాలో స్థిరపడినప్పటికీ, మాతృభూమిపై, సినిమా రంగానిపై ఉన్న మమకారంతో ఎంతోమంది ఎన్నారైలు టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు.

మోడ్రన్ రిలేషన్‌షిప్స్ డ్రామాగా ఇంప్యూర్- నిర్మాతలుగా తల్లీకూతుళ్లు- సంగీత దర్శకురాలిగా మారిన ర్యాపర్ రాజ కుమారి
మోడ్రన్ రిలేషన్‌షిప్స్ డ్రామాగా ఇంప్యూర్- నిర్మాతలుగా తల్లీకూతుళ్లు- సంగీత దర్శకురాలిగా మారిన ర్యాపర్ రాజ కుమారి

మోడ్రన్ రిలేషన్‌షిప్స్ డ్రామాగా

అదే బాటలో రచయితగా, నటిగా, నిర్మాతగా తన మల్టీ టాలెంట్‌ను చాటుకునేందుకు సిద్ధమయ్యారు వారాహి మల్లిపాముల. ఆమె కథను అందిస్తూ ప్రధాన పాత్రలో నటించిన ఇంటర్నేషనల్ తెలుగు చిత్రం 'ఇంప్యూర్'. మోడ్రన్ రిలేషన్‌షిప్స్ డ్రామాగా తెరకెక్కిన ఇంప్యూర్ అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ఎన్నారై ప్రతిభకు పట్టం.. 'ఇంప్యూర్' ప్రయాణం

తల్లికూతుళ్లు శ్రీదేవి మల్లిపాముల, వారాహి మల్లిపాముల సంయుక్తంగా నిర్మించిన ఇంప్యూర్ చిత్రానికి నిశాంతి ఇవని దర్శకత్వం వహించారు. యష్న, వారాహి, సాయి కృష్ణ ప్రధాన తారాగణంగా నటించిన ఇంప్యూర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్రముఖ మహిళా దర్శకురాలు నందినీ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఆధునిక భావాలను తెలుగు తెరకు

అనంతరం చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. విదేశాల్లో ఉంటున్నా మన మూలాలను మర్చిపోకుండా, ఆధునిక భావాలను తెలుగు తెరకు పరిచయం చేయాలనే తపనతో ఈ ప్రాజెక్ట్ రూపొందించినట్లు మేకర్స్ వెల్లడించారు.

రాజా కుమారి సంగీత ధమాకా.. 'ఓఎంజీ' ట్రెండింగ్

అంతేకాకుండా ఇంప్యూర్ సినిమాకు ప్రధాన ఆకర్షణల్లో ఒకటి అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఇండియన్-అమెరికన్ ర్యాపర్ రాజ కుమారి. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ 'జవాన్' టైటిల్ ట్రాక్, రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'లోని 'ధోప్', పవన్ కల్యాణ్ 'ఓజీ'లోని 'ఫైర్ స్ట్రోమ్' పాటలతో యూత్‌లో భారీ క్రేజ్ సంపాదించుకున్న రాజా కుమారి, ఈ చిత్రంతో సంగీత దర్శకురాలిగా మారడం విశేషం.

అతిథి పాత్రలో రాజ కుమారి

ఈ సినిమాలో రాజ కుమారి పాడిన 'ఓఎంజీ' (OMG) పాటకు కడలి సత్యనారాయణ సాహిత్యం అందించగా, ప్రస్తుతం ఇది డిజిటల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో మరొక పాటను పాడటంతో పాటు రాజ కుమారి ఒక ప్రత్యేక అతిథి పాత్రలో అలరించనున్నారు.

తరం మారినా తరగని అనుబంధం.. కథా నేపథ్యం

ఇంప్యూర్ సినిమాలో ఉన్న అంతర్గత సందేశం గురించి నిర్మాత శ్రీదేవి మల్లిపాముల వివరాలు వెల్లడించారు. "సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మోడ్రన్ రిలేషన్షిప్స్ ఆధారంగా ఈ కథను మలిచాం. మహిళల పట్ల సమాజ వైఖరిని సున్నితంగా ప్రశ్నిస్తూనే, జెన్-జీ తరం, అంతకుముందు తరం మధ్య అనుబంధం ఎలా ఉండాలో ఇందులో ఆవిష్కరించాం" అని శ్రీదేవి పేర్కొన్నారు.

ఇంప్యూర్ నటీనటులు

అన్ని వర్గాలు, అన్ని వయసుల ప్రేక్షకులను అలరించే కథాంశంతో ఇంప్యూర్ సినిమా రానున్నట్లు తెలిపారు. ఇంప్యూర్ చిత్రంలో అభిజీత్, కిరీటి దామరాజు, ఆర్జే కాజల్, శ్రీవాణి తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

అక్టోబర్ 2న విడుదల

జ్ఞానశేఖర్ వీఎస్ ఛాయాగ్రహణం సమకూర్చగా, అశుతోష్ మతేల, రామకృష్ణ ఆరమ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. కరణ్ పాండవ్, నిర్వాణ్ ఆత్రేయ నేపథ్య సంగీతాన్ని అందించారు. సాంకేతికంగానూ ఎంతో సమృద్ధిగా రూపుదిద్దుకున్న 'ఇంప్యూర్' చిత్రం అక్టోబర్ 2న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More