TG Govt Overseas Scheme : విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు బిగ్ ఆఫర్.. రూ.20 లక్షల ఆర్థిక సాయం! అర్హతలివే

Telangana Oversees Vidya Nidhi : తెలంగాణ మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యానిధి పథకానికి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అర్హులైన బీసీ, ఈబీసీ విద్యార్థులు సెప్టెంబర్ 30 వరకు తెలంగాణ ఈ-పాస్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Published on: Aug 29, 2026, 13:54:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Telangana Oversees Vidya Nidhi : విదేశీ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యను అభ్యసించాలని కలలు కంటున్న బీసీ, ఈబీసీ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని "మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి" పథకానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది. 2026 ఆగస్టు/సెప్టెంబర్ ఫాల్ సెషన్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు బిగ్ ఆఫర్
విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు బిగ్ ఆఫర్

ఈ విడతలో ప్రభుత్వం మొత్తం 350 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. ఇందులో 250 సీట్లను బీసీ వర్గాలకు, 100 సీట్లను ఈబీసీ విద్యార్థులకు కేటాయించారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా వంటి ప్రముఖ దేశాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీహెచ్‌డీ వంటి కోర్సులు చదవాలనుకునే విద్యార్థులకు ఈ పథకం ద్వారా ప్రభుత్వం భారీగా ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందిస్తుంది. ఎంపికైన ప్రతి విద్యార్థికి రూ. 20 లక్షల వరకు స్కాలర్‌షిప్‌తో పాటు ఒక వైపు విమాన ఛార్జీలు లభిస్తాయి.

ఎవరు అర్హులు...? ఉండాల్సిన అర్హతలు ఇవే…

  • విదేశీ విద్యానిధికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు కొన్ని నిర్దిష్ట ప్రమాణాలను కలిగి ఉండాలని బీసీ సంక్షేమ శాఖ స్పష్టం చేసింది.
  • కుటుంబ వార్షిక ఆదాయం అన్ని వనరుల నుంచి రూ. 5 లక్షలకు మించకూడదు.
  • దరఖాస్తు చేసుకునే నాటికి అభ్యర్థి వయస్సు 35 సంవత్సరాల లోపు ఉండాలి.
  • డిగ్రీ లేదా గ్రాడ్యుయేషన్ కోర్సులో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి.
  • అభ్యర్థులు GRE పరీక్షలో కనీసం 260 స్కోర్ లేదా GMAT లో 500 స్కోర్ సాధించి ఉండాలి.
  • ఆంగ్ల భాషా నైపుణ్య పరీక్షల్లో TOEFL లో 60 మార్కులు, లేదా IELTS లో 6.0 బ్యాండ్, లేదా PTE లో 50 మార్కుల స్కోర్ తప్పనిసరి.

దరఖాస్తు విధానం ఇలా...

ఈ పథకానికి అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 1, 2026 నుంచి సెప్టెంబర్ 30, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత గడువు దాటిన తర్వాత వచ్చిన దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణించబోమని అధికారులు స్పష్టం చేశారు.

విదేశాల్లో చదువుకోవాలనే ఆకాంక్ష ఉండి… ఆర్థిక స్థోమత లేని పేద విద్యార్థులు ఈ అవకాశాన్ని తక్షణమే సద్వినియోగం చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ సూచించింది. పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం, మార్గదర్శకాలు, ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కోసం తెలంగాణ ఈ-పాస్ అధికారిక వెబ్‌సైట్ telanganaepass.cgg.gov.inను సందర్శించవచ్చు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More