Ram Charan Surgery: ఆస్పత్రిలో రామ్ చరణ్- మరోసారి చేతికి సర్జరీ, షూటింగ్‌లకు బ్రేక్- మళ్లీ ఏం జరిగిందంటే?

Ram Charan Surgery Again In Coimbatore: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తమిళనాడులోని కోయంబత్తూరు ఆసుపత్రికి మరోసారి వెళ్లారు. రామ్ చరణ్ మణికట్టుకు మళ్లీ చిన్నపాటి సర్జరీ చేశారు. అనంతరం రామ్ చరణ్ సంపూర్ణంగా కోలుకునేందుకు మరో రెండు నెలలకు పైగా సమయం పడే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.

Published on: Sep 24, 2026, 20:30:27 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Ram Charan Surgery Again In Coimbatore: ఆర్ఆర్ఆర్ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆరోగ్యానికి సంబంధించి ఇటీవల ఇంట్రెస్టింగ్‌గా మారింది. తాజాగా రామ్ చరణ్ మరోసారి ఆస్పత్రిలో కనిపించడం ఇప్పుటు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ఆస్పత్రిలో రామ్ చరణ్- మరోసారి చేతికి సర్జరీ, షూటింగ్‌లకు బ్రేక్- మళ్లీ ఏం జరిగిందంటే?
ఆస్పత్రిలో రామ్ చరణ్- మరోసారి చేతికి సర్జరీ, షూటింగ్‌లకు బ్రేక్- మళ్లీ ఏం జరిగిందంటే?

కోయంబత్తూరుకు వెళ్లిన రామ్ చరణ్

కొన్ని నెలల క్రితం చేతి మణికట్టు గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న రామ్ చరణ్, తాజాగా మరోసారి తమిళనాడులోని కోయంబత్తూరుకు వెళ్లారు. అక్కడ ప్రసిద్ధ గంగా ఆసుపత్రిలో వైద్యులు ఆయన చేతికి అమర్చిన రాడ్లను విజయవంతంగా తొలగించారు.

ఆసుపత్రిలో ఏం జరిగింది?

ఈ ఏడాది జులై నెలలో రామ్ చరణ్ కుడి చేతి మణికట్టుకు తీవ్ర గాయమైంది. ఆ సమయంలో కోయంబత్తూరులోని గంగా హాస్పిటల్ ఆర్థోపెడిక్ విభాగం హెడ్ డాక్టర్ ఎస్. రాజశేఖరన్, అంతర్జాతీయ నిపుణులు డాక్టర్ అలెహాండ్రో బాడియా, డాక్టర్ ప్రవీణ్ భరద్వాజ్‌ల నేతృత్వంలోని బృందం ఆయనకు తొలి శస్త్రచికిత్స నిర్వహించింది.

రాడ్లను తొలగించిన వైద్యులు

ఎముక సరిగ్గా అతుక్కునేందుకు వీలుగా రామ్ చరణ్ మణికట్టు భాగంలో లోహపు రాడ్లను అమర్చారు. తాజాగా ఎముక పూర్తిగా కోలుకోవడంతో, ఆ రాడ్లను తొలగించేందుకు వైద్యులు చిన్న పాటి సర్జరీ పూర్తి చేశారు.

'పెద్ది' షూటింగ్‌లోనే గాయం.. కానీ అప్పుడే ఎందుకు సర్జరీ వద్దనుకున్నారు?

రామ్ చరణ్ నటించిన 'పెద్ది' సినిమా షూటింగ్ సమయంలోనే ఆయన మణికట్టుకు దెబ్బ తగిలింది. అయితే చిత్రీకరణ, ప్రమోషన్ల షెడ్యూల్స్ పాడవకూడదనే ఉద్దేశంతో ఆయన నొప్పులను తట్టుకుంటూనే పనిచేశారు. సినిమా పనులు పూర్తయిన తర్వాతే వైద్యుల సలహా మేరకు జులైలో ఆస్పత్రిలో చేరారు. హీరోగా ఎంతటి అంకితభావం చూపిస్తారో ఈ సంఘటన నిరూపిస్తోంది.

2 నెలల పాటు ఫిజియోథెరపీ.. షూటింగ్‌లకు తాత్కాలిక బ్రేక్

రాడ్లు తొలగించిన అనంతరం వైద్యులు రామ్ చరణ్‌కు కీలక సూచనలు చేశారు. మణికట్టు పూర్వపు బలాన్ని పుంజుకోవడానికి కనీసం 8 నుంచి 10 వారాల పాటు తీవ్రస్థాయి ఫిజియోథెరపీ అవసరమని స్పష్టం చేశారు. దీంతో రాబోయే రెండు రెండున్నర నెలల పాటు రామ్ చరణ్ పూర్తి స్థాయిలో విశ్రాంతి తీసుకోనున్నారు. ఈ సమయం పూర్తయ్యే వరకు ఆయన ఎలాంటి రిస్కీ యాక్షన్ సీన్లలో గానీ, డాన్స్ ప్రాక్టీస్‌లో గానీ పాల్గొనే అవకాశం లేదు.

సుకుమార్ ప్రాజెక్ట్‌పై ప్రభావం ఎంత?

'రంగస్థలం' లాంటి పరిశ్రమ రికార్డును తిరగరాసిన ఘన విజయం తర్వాత రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో మరో భారీ చిత్రం తెరకెక్కాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆలస్యంగా రెగ్యులర్ షూటింగ్

అయితే రామ్ చరణ్ కోలుకోవడానికి సమయం పడుతుండటంతో, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కాస్త ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కథానాయకుడు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి సెట్స్‌పైకి రావడమే ప్రాధాన్యమని చిత్రబృందం భావిస్తోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More