Pithapuramlo Ala Modalaindi: ఇరుముడి, మా ఇంటి బంగారం తరహాలో పిఠాపురంలో అలా మొదలైంది- బ్రహ్మానందం వాయిస్ ఓవర్- రిలీజ్?
Pithapuramlo Ala Modalaindi Release Date Announced: 'ప్రేయసి రావే' ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన 'పిఠాపురంలో.. అలా మొదలైంది' చిత్రం రిలీజ్ డేట్‌ను మూవీ యూనిట్ తాజాగా ప్రకటించింది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ విడుదల చేస్తోన్న ఈ సినిమాకు బ్రహ్మానందం వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం.
Pithapuramlo Ala Modalaindi Release Date Announced: టాలీవుడ్‌లో కంటెంట్ ఆధారిత కుటుంబ కథా చిత్రాలకు ఎప్పుడూ ప్రత్యేక ఆదరణ ఉంటుంది. అదే బాటలో మన చుట్టూ ఉండే సహజమైన పాత్రలు, హృదయానికి హత్తుకునే భావోద్వేగాలతో వస్తున్న కొత్త చిత్రం 'పిఠాపురంలో.. అలా మొదలైంది'.

ప్రేయసి రావే డైరెక్టర్
'ప్రేయసి రావే' వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌తో ఆకట్టుకున్న సీనియర్ డైరెక్టర్ మహేష్ చంద్ర ఈ పిఠాపురంలో అలా మొదలైంది చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది.
ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ చేతికి డిస్ట్రిబ్యూషన్
'హనుమాన్' వంటి పాన్-ఇండియా విజయాన్ని అందుకున్న ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ 'ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్' ఈ పిఠాపురంలో అలా మొదలైంది సినిమాను థియేటర్లలోకి తీసుకువస్తుండటం విశేషం. మహేష్ చంద్ర సినిమా టీమ్, ఎవర్ గ్రీన్ ఎపిక్ సినిమా సంయుక్త నిర్మాణంలో దుండిగళ్ల బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళి (గోదారి కిట్టయ్య) ఈ చిత్రాన్ని నిర్మించారు.
తండ్రీకూతుళ్ల అనుబంధం!
ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ పిఠాపురంలో అలా మొదలైంది సినిమాపై పరిశ్రమ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ మంచి ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో ప్రేమ, సునిశితమైన హాస్యం, కుటుంబ సెంటిమెంట్‌తో పాటు తండ్రీకూతుళ్ల మధ్య ఉండే ఆప్యాయతలను ఎంతో అద్భుతంగా చూపించారు. నేటి యువతకు అవసరమైన ఒక మంచి సందేశాన్ని కూడా కథలో భాగంగా చేర్చారు.
బ్రహ్మానందం వాయిస్ ఓవర్
"మన సమాజంలో మన కళ్లముందే తిరిగే పాత్రలు, రోజూ జరిగే సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గారు అందించిన వాయిస్ ఓవర్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది" అని దర్శకుడు మహేష్ చంద్ర తెలిపారు.
ట్రైలర్, రెండు పాటలకు మంచి రెస్పాన్స్
ఇప్పటికే విడుదలైన పిఠాపురంలో అలా మొదలైంది సినిమా ట్రైలర్, రెండు పాటలకు సోషల్ మీడియాలో ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించిందని ఆయన వెల్లడించారు. సినిమా మొత్తం లైవ్ కెమెరా పెట్టి షూట్ చేసినట్లు ఎంతో సహజంగా ఉంటుందని చెప్పారు.
ఇరుముడి, మా ఇంటి బంగారం లాంటి సినిమా
'ఇరుముడి', 'విశ్వనాథం అండ్ సన్స్', 'మా ఇంటి బంగారం' వంటి క్లీన్ ఫ్యామిలీ సినిమాల వరుసలో ఇది కూడా నిలుస్తుందని డైరెక్టర్ మహేష్ చంద్ర ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
పిఠాపురంలో అలా మొదలైందిలో నటించినవారు
ఆయనతో పాటు 30 ఇయర్స్ పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ, ప్రముఖ శిల్పి రాజ్ కుమార్ వడయార్, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా, జబర్దస్త్ శేషు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
పిఠాపురంలో అలా మొదలైంది టెక్నిషియన్స్
ఈ చిత్రానికి శ్రీరామ్ ఏదోటి కథాభివృద్ధి, సంభాషణలు అందించగా, జి.సి. క్రిష్ సంగీతాన్ని సమకూర్చారు. బి. సత్యనారాయణ ఎడిటర్‌గా వ్యవహరించారు. సెప్టెంబర్ 18న వస్తున్న ఈ ఫ్యామిలీ డ్రామా ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో వేచి చూడాలి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


