Mugguru Kothulu Song: ముగ్గురు కోతులు నుంచి మెలోడీ లవ్ సాంగ్.. రిలీజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్

Mugguru Kothulu Thiduthunna Koduthunna Song Release: యువ నటీనటులు తేజ కొండపల్లి, వర్షిక పాశం కాంబినేషన్‌లో వస్తున్న ముగ్గురు కోతులు సినిమా నుంచి తిడుతున్నా కొడుతున్నా లవ్ సాంగ్‌ను ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ విడుదల చేశారు. యూత్‌ను ఆకట్టుకునేలా ఉన్న ఈ పాట సామాజిక మాధ్యమాల్లో ఆకట్టుకుంటోంది.

Published on: Sep 6, 2026, 08:02:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Mugguru Kothulu Thiduthunna Koduthunna Song Release: టాలీవుడ్‌లో వైవిధ్యమైన శీర్షికలతో వచ్చే చిన్న సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. అదే బాటలో జీఎస్ఆర్ క్రియేషన్స్ సమర్పణలో, స్కై ఫ్లేర్ నెట్‌వర్క్స్ సహ సమర్పణలో రూపుదిద్దుకుంటున్న ఆసక్తికర చిత్రం 'ముగ్గురు కోతులు'.

ముగ్గురు కోతులు నుంచి మెలోడీ లవ్ సాంగ్.. రిలీజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్
ముగ్గురు కోతులు నుంచి మెలోడీ లవ్ సాంగ్.. రిలీజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్

ముగ్గురు కోతులు హీరో హీరోయిన్లు

ఈ ముగ్గురు కోతులు సినిమాలో తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, వర్షిక పాశం హీరోయిన్‌గా అలరించనుంది. ముగ్గురు కోతులు సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టైటిల్ సాంగ్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మెలోడీ లవ్ సాంగ్

ఆ జోష్‌ను మరింతగా కొనసాగిస్తూ చిత్ర బృందం తాజాగా ముగ్గురు కోతులు చిత్రం నుంచి ఒక మెలోడీ లవ్ సాంగ్‌ను బయటకు వదిలింది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్‌గా మారింది.

ఆకట్టుకుంటున్న 'తిడుతున్నా కొడుతున్నా' సాంగ్

ముగ్గురు కోతులు సినిమా నుంచి 'తిడుతున్నా కొడుతున్నా' అంటూ సాగే అందమైన ప్రేమ గీతాన్ని విడుదల చేశారు. ఈ సాంగ్‌ను ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ తిడుతున్నా కొడుతున్నా పాటను వీక్షించిన అనంతరం ఆయన చిత్ర బృందానికి అభినందనలు తెలిపి సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకున్నారు.

యూత్‌ను మెప్పించే లవ్ ట్రాక్

సంగీత దర్శకుడు ఎస్. సుహాస్ అందించిన బాణీకి తగ్గట్టుగా జగదీష్ అందించిన సాహిత్యం ఆకట్టుకుంది. గాయకులు చైతన్య, లాస్య కలసి పాడటంతో ఈ పాట సంగీత ప్రియులను అలరిస్తోంది. కథానాయకుడు తేజ కొండపల్లి, కథానాయిక వర్షిక పాశం మధ్య సాగే లవ్ ట్రాక్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని లిరికల్ వీడియో చూస్తుంటే అర్థమవుతోంది.

వేగంగా షూటింగ్.. త్వరలోనే మరిన్ని అప్‌డేట్లు

ఇదిలా ఉంటే, ముగ్గురు కోతులు సినిమాకు కార్తీక్ గరిమెల్ల దర్శకత్వం వహిస్తున్నారు. శోభారాణి గరిమెల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే మరిన్ని ఆసక్తికరమైన ప్రమోషనల్ అంశాలతో ప్రేక్షకుల ముందుకు వస్తామని ముగ్గురు కోతులు మేకర్స్ వెల్లడించారు.

రిలీజ్ తర్వాత ముగ్గురు కోతుల రెస్పాన్స్

ఇకపోతే ముగ్గురు కోతులు చిత్రానికి రాజ్ నోముల ఛాయాగ్రహణం అందించారు. జమీర్ షేక్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సాయి సతీష్ పీఆర్‌ఓగా వ్యవహరిస్తున్నారు. రిలీజ్ అనంతరం ముగ్గురు కోతులు ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో వేచి చూడాలి.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. 'ముగ్గురు కోతులు' సినిమా నుంచి కొత్త పాటను ఎవరు విడుదల చేశారు?

ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ 'తిడుతున్నా కొడుతున్నా' అనే లవ్ సాంగ్‌ను విడుదల చేశారు.

2. ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో ఎవరు నటించారు?

తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్, వర్షిక పాశం కథానాయక కథానాయకులుగా నటించారు.

3. 'ముగ్గురు కోతులు' చిత్రానికి దర్శకుడు, సంగీత దర్శకుడు ఎవరు?

కార్తీక్ గరిమెల్ల దర్శకత్వం వహించగా, ఎస్. సుహాస్ సంగీతం అందించారు.

4. ఈ చిత్రానికి పాటలు, గాత్రం ఎవరు అందించారు?

జగదీష్ సాహిత్యం అందించగా, చైతన్య, లాస్య ఈ పాటను ఆలపించారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More