OTT Today: ఒక రోజు ముందుగానే ఓటీటీలోకి సైక్ సిద్ధార్థ‌-వాళ్ల‌కు స్పెష‌ల్ స్క్రీనింగ్‌- నందు సినిమాకు 9.3 ఐఎండీబీ రేటింగ్

ఓటీటీలోకి సైక్ సిద్ధార్థ వచ్చేసింది. ఒక రోజు ముందుగానే స్ట్రీమింగ్ అవుతోంది. స్పెషల్ గా వాళ్ల కోసం ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈ సినిమాను స్క్రీనింగ్ చేస్తోంది. ఈ మూవీకి ఐఎండీబీలో 9.3 రేటింగ్ ఉండటం విశేషం. 

Published on: Feb 3, 2026, 08:56:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మూడేళ్ల గ్యాప్ తర్వాత నందు హీరోగా వచ్చిన సినిమా ‘సైక్ సిద్ధార్థ’. ఓ వైపు సినిమాల్లో క్యారెక్టర్లు చేస్తూనే, మరోవైపు హీరోగా తన కెరీర్ నిర్మించుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు నందు. ఈటీవీలో వస్తున్న ఢీషోలో యాంకర్ గానూ ఆడియన్స్ కు చేరువయేందుకు ట్రై చేస్తున్నాడు. అతని లేటెస్ట్ మూవీ సైక్ సిద్ధార్థ ఒక రోజు ముందే ఓటీటీలోకి వచ్చేసింది.

ఓటీటీలోకి సైక్ సిద్ధార్థ (x/ahavideoIN)
ఓటీటీలోకి సైక్ సిద్ధార్థ (x/ahavideoIN)

సైక్ సిద్ధార్థ ఓటీటీ

నందు, యామిని భాస్కర్, ప్రియాంక రెబకా తదితరులు నటించిన మూవీ సైక్ సిద్ధార్థ. న్యూ ఇయర్ స్పెషల్ గా జనవరి 1, 2026న థియేటర్లలో రిలీజైంది ఈ మూవీ. సురేష్ ప్రొడక్షన్ సంస్థ రిలీజ్ చేయడంతో కాస్త హైప్ వచ్చినా రిజల్ట్ మాత్రం పాజిటివ్ గా లేదు. ఇప్పుడీ మూవీ ఆహా వీడియో ఓటీటీలోకి ఇవాళ (ఫిబ్రవరి 3) వచ్చేసింది.

ఒక రోజు ముందుగానే

నిజానికి సైక్ సిద్ధార్థ ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిబ్రవరి 4 అని మేకర్స్ ముందే అనౌన్స్ చేశారు. అయితే ఒక రోజు ముందు నుంచే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. కానీ ఈ స్పెషల్ స్ట్రీమింగ్ ఆహా గోల్డ్ సబ్ స్క్రైబర్లకు మాత్రమే. ఈ రోజు ఆ సబ్ స్క్రైబర్లు మాత్రమే ఓటీటీలో సైక్ సిద్ధార్థ సినిమాను చూసే అవకాశం ఉంటుంది. బుధవారం నుంచి ఈ ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ఉన్న అందరూ సైక్ సిద్ధార్థను చూడొచ్చు.

9.3 ఐఎండీబీ

సైక్ సిద్ధార్థ సినిమాకు 9.3 ఐఎండీబీ రేటింగ్ ఉండటం విశేషం. ఈ చిత్రంలో నందు, యామిని భాస్కర్, ప్రియాంక రెబకా, సింహా, సుఖేష్ రెడ్డి తదితరులు నటించారు. ఈ మూవీకి వరుణ్ రెడ్డి డైరెక్టర్. నందు, రానా దగ్గుబాటి కలిసి నిర్మించారు. సురేష్ ప్రొడక్షన్ రిలీజ్ చేసింది.

సైక్ సిద్ధార్థ స్టోరీ

వనవీర, దండోరా లాంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూనే మరోవైపు హీరోగానూ మూవీస్ చేస్తున్నాడు నందు. అయితే 2022లో వచ్చిన బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత నందు హీరోగా చేసిన సినిమా సైక్ సిద్ధార్థ. మోసపోయిన ఓ యువకుడి క్యారెక్టర్ ఎలా ఉంటుందనేది ఇందులో ఎక్స్ ట్రీమ్ గా చూపించారు.

త్రిష (ప్రియాంక)ను ప్రేమిస్తాడు సిద్ధార్థ. త్రిష, సిద్ధార్థ.. మన్సూర్ (సుఖేష్ రెడ్డి)తో కలిసి ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ స్టార్ట్ చేస్తారు. ఇందులో రూ.2 కోట్ల ఇన్వెస్ట్ మెంట్ పూర్తిగా సిద్ధార్థనే పెడతాడు. అయితే మన్సూర్, త్రిష లవ్ చేసుకుని సిద్ధార్థను మోసం చేస్తారు.

కోట్లు కోల్పోయిన సిద్ధార్థ ఓ బస్తీలో చిన్న రూమ్ లో రెంట్ కు ఉంటూ సైక్ సైక్ చేస్తుంటాడు. అప్పుడే భర్త టార్చర్ భరించలేక అదే బిల్డింగ్ లోకి కొడుకుతో కలిసి రెంట్ కు వచ్చిన శ్రావ్య (యామిని భాస్కర్) సిద్ధార్థకు పరిచయమవుతుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందన్నది సైక్ సిద్ధార్థ మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More