Pujitha Ponnada: నన్ను దారుణంగా మోసం చేశారు.. షూటింగ్ అయిన తర్వాత మరో నటిని తీసుకున్నారు: ఆదర్శ కుటుంబం టీమ్‌పై పూజిత

Pujitha Ponnada: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన 'ఆదర్శ కుటుంబం' టీమ్ పై తెలుగు నటి పూజిత పొన్నాడ సంచలన ఆరోపణలు చేశారు. సినిమా ప్రారంభం నుంచి క్లైమాక్స్ వరకు పూర్తిస్థాయి పాత్ర అని చెప్పి, తర్వాత మోసం చేశారని ఆమె ఆరోపించడం గమనార్హం.

Published on: Nov 25, 2026, 16:20:03 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Pujitha Ponnada: టాలీవుడ్‌లో తెలుగమ్మాయిలకు సరైన అవకాశాలు దక్కడం లేదనే చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఒకవేళ మంచి ప్రాజెక్టుల్లో అవకాశం వచ్చినా, ఎడిటింగ్ పేరుతో పాత్రలకు కత్తెర వేయడం, చివరి నిమిషంలో మార్పులు చేయడం వంటి చేదు అనుభవాలు చాలామంది నటీనటులకు ఎదురవుతుంటాయి.

Pujitha Ponnada: నన్ను దారుణంగా మోసం చేశారు.. షూటింగ్ అయిన తర్వాత మరో నటిని తీసుకున్నారు: ఆదర్శ కుటుంబం టీమ్‌పై పూజిత
Pujitha Ponnada: నన్ను దారుణంగా మోసం చేశారు.. షూటింగ్ అయిన తర్వాత మరో నటిని తీసుకున్నారు: ఆదర్శ కుటుంబం టీమ్‌పై పూజిత

తాజాగా వెంకటేష్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో విడుదలైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఆదర్శ కుటుంబం' (Aadarsha Kutumbam) చిత్రబృందంపై ప్రముఖ తెలుగు నటి పూజిత పొన్నాడ సంచలన ఆరోపణలు చేశారు.

భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన ఈ సినిమా విషయంలో తనకు తీవ్ర అన్యాయం జరిగిందని, చిత్రబృందం తనను నమ్మించి మోసం చేసిందని ఆమె బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేశారు.

"త్రివిక్రమ్ స్వయంగా లుక్ టెస్ట్ చేసి ఎంపిక చేశారు.. కానీ!"

'రంగస్థలం', 'కల్కి', 'ఓదెల రైల్వే స్టేషన్' వంటి చిత్రాలతో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పూజిత పొన్నాడ.. 'ఆదర్శ కుటుంబం' సినిమాలో తన పాత్ర గురించి షాకింగ్ విషయాలను బయటపెట్టారు.

“ఈ సినిమా రచయిత నాకు పూర్తి కథను వివరించారు. సినిమా ప్రారంభం నుంచి క్లైమాక్స్ వరకు సాగే కీలక పాత్ర నాదని, ముఖ్యంగా నారా రోహిత్ సరసన ముఖ్యమైన సన్నివేశాలతో పాటు యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా ఉంటాయని చెప్పారు.” అని వివరించారు.

“దర్శకుడు త్రివిక్రమ్ గారే స్వయంగా లుక్ టెస్ట్ నిర్వహించి నన్ను ఈ పాత్రకు ఫైనల్ చేశారు. ఆ తర్వాత నేను అగ్రిమెంట్‌పై సంతకం చేశాను, నాకు అడ్వాన్స్ కూడా ఇచ్చారు” అని పూజిత తెలిపారు.

మూడు నెలల మౌనం.. సీనియర్ నటితో రీప్లేస్‌మెంట్

కొన్ని రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొన్న తర్వాత అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయని పూజిత పొన్నాడ పేర్కొన్నారు. “కొన్ని రోజులు షూట్ చేశాక, దాదాపు మూడు నెలల పాటు టీమ్ నుంచి నాకు ఎలాంటి అప్‌డేట్ రాలేదు. నా పాత్రను తగ్గించడం లేదని వారు నాకు భరోసా ఇచ్చినప్పటికీ, ఆ తర్వాత నాకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా నా స్థానంలో ఒక సీనియర్ నటిని తీసుకున్నారని తెలిసింది” అంటూ ఆమె అసహనం వ్యక్తం చేశారు.

థియేటర్లో ఒక్క సీన్.. కనీసం పేరు కూడా వేయలేదు

సినిమా విడుదలయ్యాక తెరపై తన పాత్రను చూసి షాక్ అయ్యానని పూజిత ఆవేదన చెందారు. “మళ్లీ రీ-షూట్ చేసే సమయం లేకపోవడంతో, నేను నటించిన ఒక్క సన్నివేశాన్ని మాత్రమే సినిమాలో ఉంచారు. అంతేకాకుండా సినిమా టైటిల్స్‌లో కనీసం నా పేరు కూడా వేయలేదు. ఇంత ముఖ్యమైన పాత్ర అని హామీ ఇచ్చి, చివరికి నన్ను కేవలం ఒక్క సీన్‌కు మాత్రమే వాడుకోవడం ముమ్మాటికీ నమ్మకద్రోహమే. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు?” అని పూజిత పొన్నాడ సూటిగా ప్రశ్నించారు.

ఒక అగ్ర దర్శకుడు, స్టార్ హీరో నటించిన సినిమా విషయంలో తెలుగమ్మాయి అయిన పూజిత పొన్నాడ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. మరి ఈ వివాదంపై 'ఆదర్శ కుటుంబం' చిత్రబృందం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

ABOUT THE AUTHOR

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.