OTT Telugu Sci Fi: ఓటీటీలోకి తెలుగు టైమ్ ట్రావెల్ సిరీస్- చిటికేస్తే ఆగిపోయే మనుషులు, గతంలోకి తీసుకెళ్లే లిఫ్ట్- ఎక్కడ?

OTT Telugu Sci Fi Series Pushpaka Vimanam OTT Streaming: తెలుగులో సినిమాలతో అలరించిన హీరో సాయి రోనక్ నటించిన లేటెస్ట్ తెలుగు సైన్స్ ఫిక్షన్ టైమ్ ట్రావెల్ వెబ్ సిరీస్ పుష్పక విమానం. గతంలోకి తీసుకెళ్లే లిఫ్ట్ కథతో తెరకెక్కిన పుష్పక విమానం ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Oct 26, 2026, 15:21:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

OTT Telugu Sci Fi Series Pushpaka Vimanam OTT Release: సరికొత్త సైన్స్ ఫిక్షన్ కాన్సెప్టుతో ఓటీటీ ఎంట్రీ ఇస్తున్నాడు తెలుగు హీరో సాయి రోనక్. 'ప్రెషర్ కుక్కర్', 'ఓదెల రైల్వే స్టేషన్', 'పాప్‌కార్న్', 'లగ్గం' వంటి సినిమాలతో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో సాయి రోనక్.

ఓటీటీలోకి తెలుగు టైమ్ ట్రావెల్ సిరీస్- చిటికేస్తే ఆగిపోయే మనుషులు, గతంలోకి తీసుకెళ్లే లిఫ్ట్- ఎక్కడ?
ఓటీటీలోకి తెలుగు టైమ్ ట్రావెల్ సిరీస్- చిటికేస్తే ఆగిపోయే మనుషులు, గతంలోకి తీసుకెళ్లే లిఫ్ట్- ఎక్కడ?

ఓటీటీ బాట పట్టిన సాయి రోనక్

ఇలా వెండితెరపై వరుస ప్రాజెక్ట్‌లతో సత్తా చాటిన ఈ హీరో సాయి రోనక్ ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు ఒక ఎక్స్‌క్లూజివ్ సైన్స్ ఫిక్షన్ టైమ్ ట్రావెల్ యాక్షన్ డ్రామాతో రెడీ అయ్యాడు. సాయి రోనక్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ లేటెస్ట్ ఓటీటీ సిరీస్ పేరు 'పుష్పక విమానం'.

ఈ సైన్స్ ఫిక్షన్ టైమ్ ట్రావెల్ థ్రిల్లర్ పుష్పక విమానం వెబ్ సిరీస్‌లో సాయి రోనక్‌తోపాటు మధు దామరాజు, వడ్లమాని శ్రీనివాస్, భరణి, రఘు కుమార్ కారుమంచి, శ్రీధర్ రెడ్డి నల్లా, బిందు తదితరులు కీలక పాత్రలు పోషించారు. సతీష్ రెడ్డి మల్లిడి ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు.

గతం మారితే వర్తమానంలో ప్రమాదం.. కథేంటంటే?

'పుష్పక్' (సాయి రోనక్) ఓ ఇన్సూరెన్స్ ఏజెంట్. డబ్బు సంపాదించాలనే కలలు, ఆశల చుట్టూ అతని జీవితం సాగుతుంటుంది. అయితే, ఓ రోజు కొంతమంది వ్యక్తులు అతనివెంట పడుతుంటారు. వారి నుంచి తప్పించుకుంటూ గతంలో జరిగిన విషయాలను గుర్తు చేసుకుంటాడు పుష్పక్.

చిన్నప్పుడు స్కూల్‌లో మార్కులను సరిచేసుకోలేక తండ్రితో తిట్లు తిన్నది, కాలేజ్‌లో ప్రేమను సరిచేసుకోలేక ప్రియురాలు దూరమైందని చెబుతాడు. అయితే, ఒక్కసారి గతంలోకి వెళ్లి చేసిన తప్పులను సరిచేస్తే బాగుంటుంది కదా అని, అలాంటి ఒక్క అవకాశం వస్తే చాలనుకుంటాడు పుష్పక్.

చిటికేస్తే ఆగిపోయే మనుషులు

ఇంతలో ఓ వ్యక్తి (భరణి) తారసపడి ఒక్క చిటికేస్తాడు. దాంతో అతనివెంట పడుతున్నవాళ్లంతా ఒక్కసారిగా ఎటు కదలకుండా విగ్రహాల్లా ఆగిపోతారు. అంటే చిటిక వేయగానే లోకం ఆగిపోతుంది. గతాన్ని మార్చాలని అందరూ అనుకుంటారు కానీ అది మారాక పశ్చాత్తాపపడతారు అని ఆ వ్యక్తి చెప్పి ఓ పాత బిల్డింగ్‌లోకి పుష్పక్‌ని తీసుకెళ్తాడు.

అక్కడ ఓ లిఫ్ట్ ఉంటుంది. అది ఓ టైమ్ మేషిన్. ఆ లిఫ్ట్‌లో 2026 నుంచి 2016లోకి వెళ్తాడు. అప్పుడు తన మార్కులు, ప్రేమ విషయంలో జరిగిన తప్పులను సరిచేసుకుని సంతోషంగా తిరిగి వస్తాడు పుష్పక్. గతాన్ని మారిస్తే లైఫ్ అలాగే ఉంటుందనుకున్నావా.. లైఫ్‌లో కాన్‌సీక్వెన్స్ లేకుండా ఏది రాదు పుష్పక్ అని ఆ వ్యక్తి వారిస్తాడు.

నలుగురికి బదులు 40 మంది

కానీ, అదేం పట్టించుకోకుండా పుష్పక్ వెళ్లిపోతాడు. బయట ఎవరు కనిపించరు. దాంతో పుష్పక్ సంతోషిస్తాడు. కానీ, ఆ వెంటనే అప్పటివరకు నలుగురు వెంటపడితే అప్పుడు 40 మంది వెంటపడతారు. దాంతో మరింత భయపడి పారిపోతాడు పుష్పక్. గతంలో పుష్పక్ చేసిన తప్పు వల్లే అలా జరుగుతుందని తెలుస్తుంది.

చిన్న పొరపాటు తెచ్చిన పెద్ద ముప్పు!

అసలు పుష్పక్ గతాన్ని ఎందుకు మార్చాలనుకున్నాడు? అతనికి భూమికి, కాలానికి అతీతమైన ఆ లిఫ్ట్ ఎలా దొరికింది? అతడు గతంలో చేసిన ఆ ఒక్క చిన్న మార్పు వల్ల వర్తమానంలో తన చుట్టూ ఉన్న ప్రపంచం, అతని ఆత్మీయులు ఎలాంటి ప్రమాదంలో పడ్డారనేది ఈ ఓటీటీ సిరీస్ సస్పెన్స్ ఎలిమెంట్.

తెలుగు డిజిటల్ స్పేస్‌లో టైమ్ ట్రావెల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న కథలు చాలా తక్కువ. హాలీవుడ్, కొరియన్ డ్రామాలలో ప్రజాదరణ పొందిన 'బటర్ ఫ్లై ఎఫెక్ట్' (గతంలో చేసే చిన్న మార్పు వర్తమానాన్ని పూర్తిగా మార్చేయడం) కాన్సెప్ట్‌ను మన నేటివిటీకి తగినట్లుగా దర్శకుడు సతీష్ రెడ్డి మల్లిడి తెరకెక్కించారు.

పుష్పక విమానం ఓటీటీ స్ట్రీమింగ్

ఈ సరికొత్త టైమ్ ట్రావెల్ అనుభూతిని పొందాలంటే నవంబర్ 12 వరకు వేచి చూడాల్సిందే. ఎందుకంటే నవంబర్ 12 నుంచే పుష్పక విమానం ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్‌లో పుష్పక విమానం ఓటీటీ రిలీజ్ కానుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More