...
...
Next Story

Raakaasa Ticket Rates: తెలుగు ఆడియెన్స్‌కు సర్‌ప్రైజ్- రాకాస టికెట్ రేట్స్ తగ్గించిన మేకర్స్- ఎంతో తెలుసా?

Raakaasa Ticket Rates Reduced In Single Theaters: నిహారిక కొణిదెల నిర్మించిన లేటెస్ట్ తెలుగు హారర్ ఫాంటసీ కామెడీ మూవీ రాకాస. సంగీత్ శోభన్, నయన్ సారిక హీరో హీరోయిన్లుగా నటించిన రాకాస మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. అయితే, తెలుగు ఆడియెన్స్‌కు సర్‌ప్రైజ్ ఇస్తూ రాకాస టికెట్ రేట్లను మేకర్స్ తగ్గించారు.

Published on: Apr 10, 2026, 11:44:04 IST
Advertisement

Raakaasa Ticket Prices Reduced: నిర్మాతగా వరుస సినిమాలతో దూసుకుపోతోంది మెగా డాటర్ నిహారిక కొణిదెల. నిర్మించడమే కాకుండా వాటితో మంచి హిట్లు అందుకుంటోంది. ఇదివరకు ఓటీటీ సిరీస్‌లతో సక్సెస్ అందుకున్న నిహారిక కొణిదెల ప్రొడ్యూస్ చేసిన తొలి వెండితెర చిత్రం కమిటీ కుర్రోళ్లు కూడా హిట్ అయింది.

హారర్ కామెడీ ఫాంటసీ చిత్రంగా

తెలుగు ఆడియెన్స్‌కు సర్‌ప్రైజ్- రాకాస టికెట్ రేట్స్ తగ్గించిన మేకర్స్- ఎంతో తెలుసా?
తెలుగు ఆడియెన్స్‌కు సర్‌ప్రైజ్- రాకాస టికెట్ రేట్స్ తగ్గించిన మేకర్స్- ఎంతో తెలుసా?

అంతేకాకుండా కమిటీ కుర్రోళ్లు సినిమాకు అవార్డులు సైతం దక్కాయి. ఇక తాజాగా నిహారిక కొణిదెల నిర్మించిన మరో లేటెస్ట్ ఫిల్మ్ రాకాస. హారర్ కామెడీ ఫాంటసీ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు లేడీ డైరెక్టర్ మానస శర్మ దర్శకత్వం వహించారు.

రిలీజ్ రోజు నుంచే

జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి రాకాస చిత్రాన్ని నిహారిక కొణిదెల నిర్మించారు. గ్లింప్స్, టీజర్, ట్రైలర్‌తో మెప్పించిన రాకాస థియేటర్లలో ఏప్రిల్ 3న విడుదల అయింది. రిలీజ్ తొలి రోజు నుంచే మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది ఈ సినిమా.

డిఫరెంట్ ప్రమోషనల్ స్ట్రాటజీతో

డిఫ‌రెంట్ ప్రమోష‌నల్ స్ట్రాట‌జీతో రాకాస సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని.. తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఓవర్‌సీస్‌లోనూ దూసుకెళ్తోంది. ఏపీ, తెలంగాణ‌లో శ్రీల‌క్ష్మీ న‌ర‌సింహా మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై విడుద‌లైన చిత్రం ఇప్ప‌టికే మంచి క‌లెక్ష‌న్స్‌ను రాబ‌డుతూ ఫ‌న్‌టాస్టిక్ బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్‌తో ఆకట్టుకుంటోంది.

సింగిల్ స్క్రీన్స్‌లో తగ్గిన ధర

అయితే, సాధారణంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరలు రూ. 150 నుంచి 175 వరకు ఉంటాయి. ఇప్పుడు అందులో రూ. 50 నుంచి 75 వరకు తగ్గిస్తూ 100 రూపాయలకే రాకాస టికెట్ అందేలా మూవీ మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మరింత మధ్యతరగతి ఆడియెన్స్ రాకాస సినిమాను థియేటర్‌లో చూసేలా వెసులుబాటు కల్పించారు.

వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్

కాగా, చ‌క్క‌టి అర్థ‌వంత‌మైన కామెడీతో ఈ సినిమా అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తోంది. సంగీత్‌, గెట‌ప్ శీను ట్రాక్ ప్రేక్ష‌కుల‌కు చాలా బాగా క‌నెక్ట్ అయ్యింది. దీంతో పాటు వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్‌, న‌ట‌న‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌స్తోంది. దీంతో ప్రేక్ష‌కులు ఈ స‌మ్మ‌ర్‌లో కుటుంబంతో కలిసి ఈ సినిమాను చూడ‌టానికి ప్రాధాన్య‌త‌ను ఇస్తున్నారు.

డైరెక్టర్ మానస శర్మ టేకింగ్

జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి నిహారిక కొణిదెల సినిమాను రూపొందించిన తీరు, డైరెక్ట‌క‌ర్ మానస శర్మ టేకింగ్ స‌హా ఇత‌ర న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ పని తీరుని అంద‌రూ మెచ్చుకుంటున్నారు. నిర్మాత‌గా నిహారిక తన తొలి చిత్రం ‘క‌మిటీ కుర్రోళ్లు’తో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన తర్వాత ఇప్పుడు రాకాసతో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను సాధించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe