Radhika Apte Legend: బాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీలలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి రాధికా ఆప్టే ఎప్పుడూ బోల్డ్ వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటుంది. ఇటీవల తన కొత్త వెబ్ సిరీస్ 'అక్క' (Akka) ప్రమోషన్స్ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్, జూమ్ (Zoom) ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తన కెరీర్‌లోనే అత్యంత కష్టమైన, అసంతృప్తిని కలిగించిన పాత్ర గురించి సంచలన నిజాలను బయటపెట్టింది.
ఆ తెలుగు సినిమా అంటూ..

సహ నటి కీర్తి సురేష్‌తో కలిసి పాల్గొన్న ఈ ఇంటర్వ్యూలో "మీ కెరీర్‌లో మీకు బాగా సవాలుగా అనిపించిన పాత్ర ఏది?" అని అడగ్గా, రాధికా ఆప్టే షాకింగ్ కామెంట్స్ చేసింది.
“నేను ఒక తెలుగు సినిమా చేశాను. అందులో నా కంటే వయసులో చాలా పెద్దవారైన నటుడితో రొమాన్స్ చేయాల్సి వచ్చింది. అంతేకాకుండా అందులో మావయ్యను పెళ్లి చేసుకునే సన్నివేశం ఉంటుంది. నిజానికి ఆ సినిమాలో ప్రతి ఒక్క సీన్, ప్రతీ సందర్భం నాకు తీవ్ర అసహ్యం కలిగించింది. ఆ పితృస్వామ్య వాతావరణంలో నటించడం నాకు అత్యంత కష్టమైన విషయంగా మారింది” అని రాధికా చెప్పింది.
పేరు చెప్పకపోయినా గురి చూసి కొట్టిన రాధిక: అది 'లెజెండ్' సినిమానేనా?
రాధికా ఆప్టే నేరుగా సినిమా పేరు గానీ, హీరో పేరు గానీ చెప్పనప్పటికీ ఆమె ఇచ్చిన వివరణ ఆధారంగా అది బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన 'లెజెండ్' (Legend - 2014) చిత్రమేనని స్పష్టమవుతోంది.
'లెజెండ్' విడుదలైన సమయంలో నందమూరి బాలకృష్ణ వయస్సు 54 సంవత్సరాలు కాగా, రాధికా ఆప్టే వయస్సు కేవలం 29 సంవత్సరాలు.
ఇక ఈ సినిమాలో రాధికా పాత్ర తన బావ వరుసయ్యే వ్యక్తిని ప్రేమించే క్రమంలో సాగుతుంది.
{{/usCountry}}ఇక ఈ సినిమాలో రాధికా పాత్ర తన బావ వరుసయ్యే వ్యక్తిని ప్రేమించే క్రమంలో సాగుతుంది.
{{/usCountry}}ఇంటర్వ్యూలో రాధిక మాట్లాడుతూ.. “సినిమా మధ్యలోనే నా పాత్ర చనిపోతుంది. హీరో నన్ను భుజాలపై వేసుకుని విసిరేసి యాక్షన్ సీక్వెన్స్ చేస్తాడు. అసలు నేను ఎప్పుడు చనిపోతానా అని ఎదురుచూశాను” అని నవ్వుతూనే తన చేదు అనుభవాన్ని పంచుకుంది.
ఈ వ్యాఖ్యలు విన్న కీర్తి సురేష్ మొదట ఆశ్చర్యపోయినా, ఆ తర్వాత సౌత్ సినిమాల్లో మావయ్యను లేదా బావను పెళ్లి చేసుకోవడం అనే సాంప్రదాయం సాధారణమేనని హోస్ట్‌కు వివరించే ప్రయత్నం చేసింది.
సౌత్ ఇండస్ట్రీలో పక్షపాతం, కలరిజంపై ఘాటు వ్యాఖ్యలు
సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీపై రాధికా ఆప్టే విమర్శలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో 'గలాటా' (Galatta) ఇంటర్వ్యూలోనూ ఆమె సౌత్ ఇండస్ట్రీలో ఉన్న కలరిజం (Colorism), పురుషాధిక్యతపై సంచలన కామెంట్స్ చేసింది.
“సౌత్ సినిమాల్లో నార్త్ ఇండియన్ హీరోయిన్లను ఎందుకు ఎక్కువగా తీసుకుంటారో తెలుసా? కేవలం తెల్లటి చర్మం ఉందనే ఒకే ఒక్క కారణంతో! ఇది నిజంగా అసహ్యకరమైన విషయం. కేవలం నా పాత్రకు అత్యంత ప్రాధాన్యత ఉండి, నన్నే ఎంచుకోవడానికి బలమైన కారణం ఉంటే తప్ప నేను మళ్లీ సౌత్ సినిమాల్లో నటించను” అని ఆమె తేల్చి చెప్పింది.
రాధికా ఆప్టే తెలుగు సినీ ప్రయాణం
తెలుగులో రాధికా ఆప్టే చాలా తక్కువ సినిమాల్లోనే నటించింది.
2010లో వచ్చిన రక్త చరిత్ర (2010) మొదటిది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది.
ఇక 2012లో వచ్చిన ధోనీ రెండోది. ప్రకాష్ రాజ్ దర్శకత్వంలో తమిళం, తెలుగులో రూపొందిన చిత్రంలో నటించింది.
ఆ తర్వాత 2014లో లెజెండ్ మూవీలో నటించింది. నందమూరి బాలకృష్ణతో కలిసి చేసిన మొదటి సినిమా.
మరుసటి ఏడాది లయన్ మూవీలోనూ కనిపించింది. సత్యదేవ్ దర్శకత్వంలో బాలకృష్ణ సరసన నటించిన 'లయన్' ఆమె చివరి తెలుగు చిత్రం.
2015 తర్వాత ఆమె మరే తెలుగు చిత్రంలోనూ నటించలేదు. ప్రస్తుతం ఆమె నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ‘లస్ట్ స్టోరీస్ 3’, ‘అక్క’ వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంది.