Radhika Apte: బ్రా లేకుండా నటించాలంటూ నరకం చూపించారు.. షర్ట్ బటన్స్ విప్పమన్నారు.. రాధికా ఆప్టే సంచలన వ్యాఖ్యలు!
Radhika Apte: రాధికా ఆప్టే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయటపెట్టింది. ఓ సినిమా షూటింగ్ సమయంలో బ్రా లేకుండా కేవలం షర్ట్ వేసుకుని, బటన్స్ విప్పేసి యాక్షన్ సీన్ చేయాలంటూ టార్చర్ చేశారని పేర్కొంది. ఆమె చేసిన షాకింగ్ కామెంట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
Radhika Apte: రాధికా ఆప్టే ఎప్పుడూ తన మనసులోని మాటను చాలా బోల్డ్ గా చెబుతూ ఉంటుంది. ఇటీవల తన తాజా వెబ్ సిరీస్ 'అక్కా' ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆమె, గతంలో ఓ సినిమా సెట్ లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. రాధికా షాకింగ్ కామెంట్లు చేసింది.

బ్రా లేకుండా
"ఓ సినిమా షూటింగ్ లో యాక్షన్ సీన్ తీయడానికి రెండు రోజుల ముందు డైరెక్టర్, అతని టీమ్ నా దగ్గరకు వచ్చారు. బ్రా లేకుండా కేవలం షర్ట్ మాత్రమే వేసుకుని, బటన్స్ తీసేసి ఆ ఫైట్ సీన్ చేయగలరా? అని నా మొహం మీదే అడిగేశారు" అని రాధికా ఆప్టే సంచలన విషయాన్ని వెల్లడించింది.
అసలు ఫిజిక్స్ కి లాజిక్ ఉందా?
వాళ్ల డిమాండ్ విన్న వెంటనే రాధికా ఆప్టే షాక్ అయ్యిందట. "అసలు బ్రా లేకుండా షర్ట్ బటన్స్ విప్పేసి యాక్షన్ సీన్ చేస్తే.. కదలికల వల్ల షర్ట్ పక్కకు జరిగిపోతుంది కదా? కనీస లాజిక్, బేసిక్ ఫిజిక్స్ ఆలోచించరా? అని నేను ఎదురు ప్రశ్నించాను. దానికి వాళ్లు.. అయితే కేవలం బ్రా, అండర్ వేర్ తోనే ఆ ఫైట్ సీన్ చేయొచ్చు కదా అని అడిగారు. అసలు నా చేత ఏం చేయించాలని అనుకుంటున్నారు? అని కోప్పడ్డా’’ అని రాధికా చెప్పుకొచ్చింది.
రెండు వారాల పాటు నరకం
సినిమా కథ చెప్పినప్పుడు, ఒప్పందం చేసుకున్నప్పుడు ఇలాంటి విషయాలు ఏమీ చెప్పలేదని రాధికా ఆప్టే ఆగ్రహం వ్యక్తం చేసింది. "న్యూడిటీ లేదా ఎక్స్పోజింగ్ అవసరమైతే కథ చెప్పేటప్పుడే స్పష్టంగా చెప్పాలి.
కానీ తీరా సీన్ తీసే టైంకి వచ్చి ఇలా బేరసారాలు ఆడటం ఏంటి? ఎంతవరకు చూపిస్తారు? అది చూపిస్తారా? ఇది చూపిస్తారా? అంటూ దాదాపు రెండు వారాల పాటు నన్ను అదే పనిగా టార్చర్ చేశారు. ఆ సమయంలో నేను తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాను" అని తన ఆవేదనను బయటపెట్టింది.
ఇంటిమసీ కోఆర్డినేటర్లను పీకేస్తున్నారు
సినిమాల్లో రొమాంటిక్ లేదా బోల్డ్ సీన్స్ చేసేటప్పుడు నటీనటులకు ఇబ్బంది కలగకుండా చూసేందుకు సెట్స్ లో 'ఇంటిమసీ కోఆర్డినేటర్లు' ఉంటారు. అయితే వాళ్ల పరిస్థితి కూడా దారుణంగా మారిందని రాధికా ఆప్టే బాంబ్ పేల్చింది.
"నిర్మాతలు చెప్పినట్లే వాళ్లు కూడా వినాలి. ఒకవేళ హీరోయిన్లకు మద్దతుగా ఇంటిమసీ కోఆర్డినేటర్లు మాట్లాడితే.. నిర్మాతలు వాళ్లను ఏకంగా పనిలో నుంచే పీకేస్తున్నారు. ఇండస్ట్రీలో అందరూ చెడ్డవాళ్లు అని నేను అనను కానీ, పది మందిలో ఒకరిద్దరు చేసే ఇలాంటి దిగజారుడు పనుల వల్లే సెట్లలో నరకం చూడాల్సి వస్తోంది" అని రాధికా కుండబద్దలు కొట్టింది.
'అక్క' సిరీస్ లో కీర్తి సురేష్ తో ఢీ
ప్రస్తుతం రాధికా ఆప్టే 'అక్క' అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్టోబర్ 30న ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ లో ఈ సిరీస్ విడుదలైంది. 1980ల నాటి పీరియాడిక్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ లో మహానటి కీర్తి సురేష్ తో కలిసి రాధికా ఆప్టే నటించింది. మహిళల ఆధిపత్యం నడిచే ఓ ఊరి నేపథ్యంలో సాగే ఈ కథలో కీర్తి సురేష్ ప్రొటాగోనిస్ట్ పాత్ర చేస్తుంటే.. రాధికా ఆప్టే ఆమెను ఢీకొట్టే పవర్ ఫుల్ విలన్ (అంటాగోనిస్ట్) పాత్రలో అదరగొట్టింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


