...
...
Next Story

Raghav Juyal: ఏం ఎనర్జీ సామి.. ది ప్యారడైజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అదరగొట్టిన రాఘవ్ జుయల్.. తన స్టైల్ స్లో మోషన్ డ్యాన్స్!

Raghav Juyal: ది ప్యారడైజ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే హీరో నాని గురించో లేదా గెస్ట్ ల గురించో మాట్లాడుకుంటారు. కానీ ఈ ఈవెంట్లో రాఘవ్ జుయల్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాడు. తన డ్యాన్స్ తో, స్పీచ్ తో ఈ యంగ్ విలన్ అదరగొట్టాడు. తన స్టైల్ స్లో మోషన్ డ్యాన్స్ తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాడు.

Published on: Sep 22, 2026, 08:27:05 IST
Advertisement

Raghav Juyal: ది ప్యారడైజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం (సెప్టెంబర్ 22) రాత్రి గ్రాండ్ గా జరిగింది. అయితే ఈ ఈవెంట్లో రాఘవ్ జుయల్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. ది ప్యారడైజ్ మూవీలో విలన్ రోల్ ప్లే చేసిన అతను.. ఈ ఈవెంట్లో స్టేజీపై డ్యాన్స్ తో అదరగొట్టాడు.

రాఘవ్ జుయల్ స్లో మోషన్ డ్యాన్స్

ఏం ఎనర్జీ సామి.. ది ప్యారడైజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అదరగొట్టిన రాఘవ్ జుయల్.. తన స్టైల్ స్లో మోషన్ డ్యాన్స్!
ఏం ఎనర్జీ సామి.. ది ప్యారడైజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అదరగొట్టిన రాఘవ్ జుయల్.. తన స్టైల్ స్లో మోషన్ డ్యాన్స్!

రాఘవ్ జుయల్ స్టైలే వేరు. డ్యాన్స్ అయినా, షూటింగ్ అయినా, హోస్టింగ్ అయినా.. తను ఎక్కడ ఉంటే అక్కడ వేరే లెవల్ ఎనర్జీ క్రియేట్ చేస్తాడు. ఇప్పుడు ది ప్యారడైజ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ రాఘవ్ అదే చేశాడు. తన స్టైల్ స్టో మోషన్ డ్యాన్స్ తో కేకలు పెట్టించాడు.

వైరల్ వీడియోలు

రాఘవ్ జుయల్ డ్యాన్స్ చేస్తూనే స్టేజీ పైకి వచ్చాడు. ‘ఆయా షేర్’ సాంగ్ కు తన స్టైల్లో డ్యాన్స్ చేశాడు. ఇక అతని స్లో మోషన్ స్టెప్పులు అయితే వేరే లెవల్. ఆ తర్వాత యాంకర్ సుమతో కలిసి ‘ఏషనాగుల కట్ట మీద’ పాటకు కూడా డ్యాన్స్ చేశాడు రాఘవ్. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

రాఘవ్ జుయల్ ఎవరు?

రాఘవ్ జుయల్ పేరు తొలిసారిగా 2009లో వచ్చిన ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్’ ఫస్ట్ సీజన్ తో వెలుగులోకి వచ్చింది. ఎలాంటి ట్రైనింగ్ లేకపోయినా కూడా ‘క్రాక్ రోజ్’ అనే కొత్త డ్యాన్స్ ఫామ్ తో రాఘవ్ సంచలనం క్రియేట్ చేశాడు.

క్రాకడైల్ (మొసలి) లాంటి పవర్ ఫుల్ డ్యాన్స్ మూవ్స్ తో పాటు క్రాక్ రోచ్ (బొద్దింక)లా స్లో మోషన్ కలిపి ఈ పేరు పెట్టాడు రాఘవ్ జుయల్.

బాలీవుడ్ లో స్టార్

రాఘవ్ జుయల్ బాలీవుడ్ లో ఓ స్టార్. డ్యాన్స్ తో, యాక్టింగ్ తో, యాంకరింగ్ తో అతను ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నాడు. 2014లో సోనాలి కేబుల్ అనే సినిమాతో డెబ్యూ చేశాడు రాఘవ్. 2020లో వచ్చిన అభయ్ అనే వెబ్ సిరీస్ తో రాఘవ్ తొలిసారి విలన్ గా మారాడు.

ఆ తర్వాత కిల్, యుధ్ర, భాయ్ తేరా స్టార్ మేరా లాంటి సినిమాల్లో తన నటనతో అదరగొట్టాడు. ఇప్పుడు ది ప్యారడైజ్ తో తెలుగులో అడుగుపెట్టాడు. మరోవైపు షారుక్ ఖాన్ మూవీ ‘కింగ్’లోనూ రాఘవ్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks