Rahul Ramakrishna: టాలీవుడ్ విలక్షణ నటుడు రాహుల్ రామకృష్ణ సోషల్ మీడియా వేదికగా సినిమా ఇండస్ట్రీ తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వరుసగా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్న తరుణంలో.. ఆయన చేసిన ఈ ట్వీట్లు ఇప్పుడు చిత్ర పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదని బాధపడే ముందు మనం అందిస్తున్న కంటెంట్ ఎంత నాసిరకంగా ఉందో ఆలోచించుకోవాలని ఆయన మేకర్స్‌కు చురకలు అంటించారు.
ప్రేక్షకుల కష్టాలను గుర్తించండి

నేటి కాలంలో ఒక సామాన్యుడు థియేటర్‌కు వచ్చి సినిమా చూడటం అనేది చిన్న విషయం కాదని రాహుల్ రామకృష్ణ గుర్తుచేశారు.
"మండిపోయే ఎండలు, ట్రాఫిక్ సమస్యలు, పార్కింగ్ ఇబ్బందులు, పెట్రోల్ ధరలు.. వీటన్నింటినీ తట్టుకుని ఒక ప్రేక్షకుడు థియేటర్‌కు వస్తున్నాడు. అక్కడ కూడా భారీ ధరలు ఉండే స్నాక్స్, ట్యాక్సుల భారం మోయాల్సి వస్తోంది. ఇంతా చేసి థియేటర్‌లో కూర్చున్న ప్రేక్షకుడిని మీ సినిమా అలరించలేకపోతే, వారు ఇంట్లో నుండి బయటకు రావాలని కోరుకునే హక్కు మీకు లేదు" అని రాహుల్ స్పష్టం చేశారు.
థియేటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయంటే, అది మనం చేసే పనిలో ఎంత దారుణంగా విఫలమవుతున్నామో చెప్పడానికి ఒక నిజాయితీతో కూడిన తీర్పు అని ఆయన అభివర్ణించారు.
ప్రేక్షకులను తక్కువ అంచనా వేయకండి
సినిమా అంటే ఏదో ఒక రహస్యమైన కళ అని, అది మాకు మాత్రమే తెలుసనే అహంకారాన్ని వీడాలని రాహుల్ సూచించారు.
"ప్రేక్షకులకు సినిమా తీసే పద్ధతులు తెలియవని, వారు అమాయకులని అనుకోవడం పెద్ద పొరపాటు. డిజిటలైజేషన్ పెరిగిన తర్వాత ప్రతి ఒక్కరి చేతిలో కెమెరా ఉంది. సామాన్యులకు కూడా మేకింగ్ టెక్నిక్స్, కెమెరా యాంగిల్స్ గురించి పూర్తి అవగాహన వచ్చేసింది. చెత్త సినిమాలను గుర్తుపట్టలేనంత అమాయకులు ఎవరూ ఇక్కడ లేరు" అని ఆయన పేర్కొన్నారు.
పరిశ్రమలో పాత పద్ధతులు మారాలి
తాను ఈ వ్యాఖ్యలు చేయడానికి గల కారణాన్ని కూడా రాహుల్ వివరించారు. ఈ సీజన్లో వరుసగా సినిమాలు థియేటర్లలో విఫలమవ్వడం తనను ఆలోచింపజేసిందని ఆయన చెప్పారు.
{{/usCountry}}తాను ఈ వ్యాఖ్యలు చేయడానికి గల కారణాన్ని కూడా రాహుల్ వివరించారు. ఈ సీజన్లో వరుసగా సినిమాలు థియేటర్లలో విఫలమవ్వడం తనను ఆలోచింపజేసిందని ఆయన చెప్పారు.
{{/usCountry}}"పాతబడిపోయిన కథలు, కాలం చెల్లిన పద్ధతులు, ఇండస్ట్రీలో ఉండే కొందరి అహంకారం.. ఇవన్నీ చూస్తుంటే అసహనం కలుగుతోంది. అందుకే నా మనసులోని ఆవేదనను ఇలా ట్విట్టర్ ద్వారా పంచుకుంటున్నాను," అని రాహుల్ రామకృష్ణ వెల్లడించారు.
కేవలం కంటెంట్ బాగుంటేనే జనం థియేటర్లకు వస్తారని, లేదంటే ఓటీటీల కాలంలో థియేటర్ల మనుగడ కష్టమని ఆయన హెచ్చరించారు. నటుడిగా తన బాధ్యతను గుర్తిస్తూనే, వ్యవస్థలోని లోపాలను ఎండగట్టిన రాహుల్ తీరును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
రాహుల్ రామకృష్ణ ఎందుకు ట్వీట్ చేశారు?
వరుసగా సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవ్వడం, పరిశ్రమలో కొనసాగుతున్న పాత పద్ధతుల పట్ల తనకున్న అసంతృప్తిని వ్యక్తం చేయడానికి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రేక్షకుల గురించి రాహుల్ రామకృష్ణ ఏమన్నారు?
ప్రేక్షకులు అమాయకులు కాదని, వారికి సినిమా మేకింగ్ టెక్నిక్స్ అన్నీ తెలుసని.. కాబట్టి నాణ్యమైన కంటెంట్ లేకపోతే వారు థియేటర్లకు రారని ఆయన చెప్పారు.
థియేటర్లు ఖాళీగా ఉండటాన్ని రాహుల్ రామకృష్ణ ఎలా చూస్తున్నారు?
థియేటర్లు ఖాళీగా ఉండటం అనేది చిత్ర నిర్మాతలు, దర్శకులు తమ పనిలో విఫలమయ్యారని చెప్పడానికి ఒక నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు.