మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ 'పెద్ది'. నిన్న అంటే సోమవారం (మార్చి 2) విడుదలైన ఈ సినిమాలోని రెండో పాట 'రై రై రారా' ప్రేక్షకుల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా రామ్ చరణ్ తన స్టైలిష్ డ్యాన్స్ మూవ్స్‌తో అభిమానులను కట్టిపడేశారు. తాజాగా ఈ సాంగ్‌పై మెగాస్టార్ చిరంజీవి తన అభిప్రాయాన్ని పంచుకుంటూ చిత్ర బృందంపై ప్రశంసల జల్లు కురిపించాడు.
నిన్ను చూస్తే గర్వంగా ఉంది: చిరంజీవి

పెద్ది మూవీ నుంచి సెకండ్ సింగిల్ రై రై రారా అనే సాంగ్ వచ్చిన సంగతి తెలుసు కదా. గతంలో వచ్చిన చికిరి చికిరిలాగే ఈ పాట కూడా వచ్చీ రాగానే ఇంటర్నెట్ ను ఊపేస్తోంది. చరణ్ తండ్రి, మెగాస్టార్ చిరంజీవి కూడా తన సోషల్ మీడియా వేదికగా దీనిపై స్పందించాడు.
"'పెద్ది' సినిమాలోని 'రై రై రారా' సాంగ్ వెండితెరపై నిప్పులు చెరుగుతోంది. ఎనర్జీ, ఎమోషన్, సినిమాటిక్ బ్రిలియన్స్‌కు ఇది ఒక అద్భుతమైన కలయిక. రామ్ చరణ్ తెరపై చూపిస్తున్న ఆ గ్రేస్, ఎలక్ట్రిఫైయింగ్ స్పీడ్ చూస్తుంటే ఒక తండ్రిగా నాకు చాలా గర్వంగా ఉంది. చరణ్ కదిలే తీరును చూడటం ఒక కన్నుల పండుగలా ఉంది" అని పేర్కొన్నాడు.
అంతేకాకుండా ఈ సినిమాకు అద్భుతమైన విజువల్స్ అందించిన రత్నవేలును, అర్థవంతమైన సాహిత్యం అందించిన అనంత శ్రీరామ్‌ను అతడు ప్రత్యేకంగా అభినందించాడు. ఏఆర్ రెహమాన్ అందించిన మ్యాజికల్ కంపోజిషన్, జానీ మాస్టర్ పవర్ ప్యాక్డ్ కొరియోగ్రఫీ సినిమాకు పెద్ద ప్లస్ అవుతాయని చిరు ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఏప్రిల్ 30న పాన్ ఇండియా రిలీజ్
వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమా ఏప్రిల్ 30న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
{{/usCountry}}వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమా ఏప్రిల్ 30న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
{{/usCountry}}