బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమాలోని 'రై రై రారా' పాట యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం ఒక ఎత్తయితే, అనంత శ్రీరామ్ రాసిన స్ఫూర్తిదాయకమైన సాహిత్యం మరో ఎత్తు. ఈ పాట సాధిస్తున్న విజయంపై అనంత శ్రీరామ్ మీడియాతో ముచ్చటించారు. అసలు ఈ పాట అర్థమేంటి? ఎందుకు తనకు ఆరు నెలల సమయం పట్టిందన్నది అతడు వివరించాడు.
'రై రై రారా' అనే పదం ఎలా పుట్టిందంటే..

పెద్ది మూవీలోని రై రై రా రా పాటలోని హుక్ లైన్ గురించి అనంత శ్రీరామ్ చెబుతూ.. "ఈ సినిమాలో హీరో ఒక లీడర్‌లా కనిపిస్తారు. పల్లెటూళ్లలో ప్రజలు ఎక్కువగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. బస్సు కండక్టర్ 'రై రై' అనగానే డ్రైవర్ బస్సును ముందుకు పోనిస్తాడు. అంటే.. జీవితంలో కూడా ఎక్కడా ఆగకుండా నిరంతరం ముందుకు సాగిపోవాలి అనే అర్థం వచ్చేలా ఈ పదాన్ని వాడాను. ఒక పెద్ద సినిమాకు ఇంతటి అర్థవంతమైన పాట రాయడం చాలా సంతోషంగా ఉంది" అని వివరించాడు.
రామ్ చరణ్ రియాక్షన్ ఇలా
ఈ పాట విన్నప్పుడు రామ్ చరణ్ స్పందన ఎలా ఉందని అడగ్గా.. "చరణ్ గారు మాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఆయన మరో సీన్ షూటింగ్‌లో ఉన్నప్పుడు ఈ పాటను మొదటిసారి విన్నారు. విన్న వెంటనే నా దగ్గరికి వచ్చి నన్ను గట్టిగా హత్తుకున్నారు. ఆ క్షణం నాకు ఎంతో తృప్తినిచ్చింది" అని అనంత శ్రీరామ్ చెప్పుకొచ్చాడు.
ఆరు నెలల కష్టం
ఈ పాట రాయడానికి దాదాపు ఆరు నెలల సమయం పట్టిందని అనంత శ్రీరామ్ వెల్లడించాడు. "ఇది కేవలం మాస్ సాంగ్ మాత్రమే కాదు, ఒక ఇన్సిపిరేషనల్ ట్రాక్. దర్శకుడు బుచ్చిబాబు గారు సాహిత్యం విషయంలో చాలా పర్టిక్యులర్‌గా ఉంటారు. ప్రతి పదం గురించి మేము ఎన్నో చర్చలు జరిపాము. అందుకే ఈ పాటలోని ప్రతి లైన్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతోంది" అని తెలిపాడు.
అనంత శ్రీరామ్ ఇంకా ఏం చెప్పాడంటే?
{{/usCountry}}ఈ పాట రాయడానికి దాదాపు ఆరు నెలల సమయం పట్టిందని అనంత శ్రీరామ్ వెల్లడించాడు. "ఇది కేవలం మాస్ సాంగ్ మాత్రమే కాదు, ఒక ఇన్సిపిరేషనల్ ట్రాక్. దర్శకుడు బుచ్చిబాబు గారు సాహిత్యం విషయంలో చాలా పర్టిక్యులర్‌గా ఉంటారు. ప్రతి పదం గురించి మేము ఎన్నో చర్చలు జరిపాము. అందుకే ఈ పాటలోని ప్రతి లైన్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతోంది" అని తెలిపాడు.
అనంత శ్రీరామ్ ఇంకా ఏం చెప్పాడంటే?
{{/usCountry}}'పెద్ది' సినిమాలో తాను మొత్తం మూడు పాటలు రాశానని, ఇప్పటికే వచ్చిన 'చికిరి చికిరి', 'రై రై రారా' పాటల కంటే రాబోయే పాటలు ఇంకా స్పెషల్‌గా ఉంటాయని అనంత శ్రీరామ్ ధీమా వ్యక్తం చేశాడు. ప్రస్తుతం అతడు ప్రభాస్ నటిస్తున్న 'స్పిరిట్', 'చెన్నై లవ్ స్టోరీ' సినిమాలకు కూడా పాటలు అందిస్తున్నట్లు తెలిపాడు.
పెద్ది మూవీ నుంచి వచ్చిన రెండు పాటలూ యూట్యూబ్ లో దూసుకెళ్తున్నాయి. చాలా రోజుల తర్వాత రెహమాన్ తన స్టైల్ సాంగ్స్ ఇచ్చాడంటూ అభిమానులు చెబుతున్నారు. ఈ పెద్ది మూవీ ఏప్రిల్ 30న థియేటర్లలోకి రానుంది.