Bhagyashree: మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'రాజా శివాజీ' చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. రితేష్ దేశ్‌ముఖ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ప్రతిష్టాత్మక మరాఠీ చిత్రం థియేటర్లలో రికార్డు వసూళ్లు సాధిస్తూ రూ.100 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టింది. ఈ చిత్రంలో శివాజీ మహారాజ్ వీరమాత రాజమాత జిజాబాయి పాత్రను బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ పోషించింది.
సోషల్ మీడియాలో చర్చ

రాజా శివాజీ మూవీలో రితేష్ దేశ్‌ముఖ్‌కు తల్లిగా భాగ్యశ్రీ నటించడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. నిజజీవితంలో రితేష్ కంటే భాగ్యశ్రీ కేవలం పదేళ్లు మాత్రమే పెద్ద అయినప్పటికీ ఆమె తల్లి పాత్రను అంగీకరించడంపై అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
భాగ్యశ్రీ రియాక్షన్
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగ్యశ్రీ ఈ విషయంపై స్పందించింది. "మనం చిన్నప్పటి నుంచి కథలుగా వింటూ పెరిగిన ఒక గొప్ప వీరనారి పాత్రను వెండితెరపై పోషించే అవకాశం వస్తే, దానికి అస్సలు నో చెప్పలేము. పైగా, జిజాబాయి చాలా చిన్న వయసులోనే తల్లి అయ్యారు’’ అని భాగ్యశ్రీ తెలిపింది.
ముఖంలో కాంతి
‘‘ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ సర్ స్వయంగా నాకు ఫోన్ చేసి ఒక మాట చెప్పారు. ‘సారీ అండీ, కెమెరా టెక్నిక్స్‌తో మిమ్మల్ని కాస్త వయసు పైబడిన మహిళగా చూపించాల్సి వచ్చింది. అయినా మీ ముఖంలో ఆ యవ్వన కాంతి అలాగే కనిపిస్తోంది’ అని ఆయన ప్రశంసించారు. లెజెండరీ సినిమాటోగ్రాఫర్ నుంచి వచ్చిన ఈ ప్రశంసను నేను ఎప్పటికీ నా గుండెల్లో దాచుకుంటా" అని భాగ్యశ్రీ వివరించింది.
సంగీ రాచకుటుంబంతో
నిజ జీవితంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ నడిచిన మహారాష్ట్ర నేలతో భాగ్యశ్రీకి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆమె మహారాష్ట్రలోని సాంగ్లీ ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ 'పట్వర్ధన్' రాచకుటుంబానికి చెందినవారే కావడం గమనార్హం. ఆమె తండ్రి విజయ్ సింగ్రావ్ మాధవ్‌రావ్ పట్వర్ధన్ సాంగ్లీ సంస్థానానికి వారసుడు. తన చిన్నతనంలో శివాజీ మహారాజ్ కథలు ఎలా వినేవారో భాగ్యశ్రీ గుర్తుచేసుకుంది.
{{/usCountry}}నిజ జీవితంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ నడిచిన మహారాష్ట్ర నేలతో భాగ్యశ్రీకి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆమె మహారాష్ట్రలోని సాంగ్లీ ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ 'పట్వర్ధన్' రాచకుటుంబానికి చెందినవారే కావడం గమనార్హం. ఆమె తండ్రి విజయ్ సింగ్రావ్ మాధవ్‌రావ్ పట్వర్ధన్ సాంగ్లీ సంస్థానానికి వారసుడు. తన చిన్నతనంలో శివాజీ మహారాజ్ కథలు ఎలా వినేవారో భాగ్యశ్రీ గుర్తుచేసుకుంది.
{{/usCountry}}"మాకు చిన్నప్పుడు గొల్డిలాక్స్, హాన్సెల్ అండ్ గ్రెటెల్ వంటి పాశ్చాత్య కథల కంటే ముందే శివాజీ మహారాజ్ వీరగాథలను పరిచయం చేశారు. సాధారణంగా పిల్లలు బీచ్‌లలో ఇసుక గూళ్లు కట్టుకుంటే, మేము మాత్రం మట్టితో శివాజీ కోటలను తయారు చేస్తూ పెరిగాము" అని ఆమె పాత జ్ఞాపకాలను పంచుకుంది.
'రాజా శివాజీ' చిత్ర విశేషాలు
ఈ చారిత్రాత్మక రాజీ శివాజీ చిత్రానికి రితేష్ దేశ్‌ముఖ్ స్వయంగా సహ రచయితగా, దర్శకుడిగా వ్యవహరించాడు. ముంబై ఫిల్మ్ కంపెనీ, జియో స్టూడియోస్ బ్యానర్లపై జెనీలియా దేశ్‌ముఖ్, జ్యోతి దేశ్‌పాండే ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, మహేష్ మంజ్రేకర్, సచిన్ ఖేడేకర్, ఫర్దీన్ ఖాన్, జితేంద్ర జోషి, అమోల్ గుప్తే, జెనీలియా దేశ్‌ముఖ్ తదితరులు కీలక పాత్రల్లో నటించి మెప్పించారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న: 'రాజా శివాజీ' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంత వసూలు చేసింది?
జవాబు: రితేష్ దేశ్‌ముఖ్ హీరోగా నటించిన 'రాజా శివాజీ' చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించి, రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరింది.
ప్రశ్న: ఈ చిత్రంలో రాజమాత జిజాబాయి పాత్రను ఎవరు పోషించారు?
జవాబు: ఈ చిత్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ తల్లి, వీరమాత రాజమాత జిజాబాయి పాత్రను సీనియర్ నటి భాగ్యశ్రీ పోషించింది.
ప్రశ్న: 'రాజా శివాజీ' చిత్రానికి దర్శకత్వం వహించింది ఎవరు?
జవాబు: ఈ చిత్రానికి ప్రముఖ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ స్వయంగా దర్శకత్వం వహించడంతో పాటు కథను కూడా అందించాడు.