ప్రముఖ తెలుగు నటుడు రాజేంద్ర ప్రసాద్ ఈ మధ్య స్టేజీ ఎక్కితే చాలు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నాడు. అప్పట్లో అలీ, బ్రహ్మానందంలాంటి వాళ్లపై నోరు పారేసుకున్న అతడు.. ఈ మధ్యే కాంతారావు అవార్డు అందుకుంటూ తమిళ దివంగత నటుడు ఎంజీఆర్ పై నోరు జారాడు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఇప్పుడు క్షమాపణ చెబుతూ తమిళంలో మాట్లాడిన ఓ వీడియోను రిలీజ్ చేశాడు.
నోరు జారాను.. క్షమించండి..

రాజేంద్ర ప్రసాద్ ఈ వీడియోలో తమిళ ప్రజలు, నటీనటులకు క్షమాపణ చెప్పాడు. ఎంజీఆర్ పై కావాలని తాను అలా మాట్లాడలేదని, అంత ధైర్యం తాను చేయనని అన్నాడు. కాంతారావు అవార్డు అందుకున్న సమయంలో ఏదో ఫ్లోలో నోరు జారానని, క్షమించాలని చేతులు జోడించి వేడుకున్నాడు. అది కూడా తమిళంలో మాట్లాడటం విశేషం. తాను కూడా తమిళ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ లోనే పాఠాలు నేర్చుకున్నట్లు ఈ సందర్భంగా చెప్పాడు.
అసలు ఏం జరిగిందంటే?
రీసెంట్ గా హైదరాబాద్ లో ‘కళాప్రపుర్ణ కాంతారావు జాతీయ అవార్డు’ ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. కాంతారావును పొగుడుతూనే ఎంజీఆర్ పై నోరు జారాడు.
‘‘ఒకప్పుడు కాంతారావు జానపదా చిత్రాల కోసం జనాలు ఎగబడేవాళ్లు. కాంతారావును చూసి ఎంజీఆర్ కూడా భయపడేవాడు. కాంతారావును చూస్తే ఎంజీఆర్ కు ఉ**’’ అని రాజేంద్ర ప్రసాద్ అన్నాడు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
విశాల్, నాజర్ సీరియస్
ఎంజీఆర్ ను రాజేంద్ర ప్రసాద్ నోటికొచ్చిన మాటలు అనడంపై తమిళనాడు ప్రజలు, కోలీవుడ్ సెలబ్రిటీలు ఫైర్ అయ్యారు. తమిళ హీరో విశాల్ కూడా రాజేంద్ర ప్రసాద్ ను సారీ చెప్పాలని డిమాండ్ చేశాడు.
‘‘తెలుగు ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇటీవల ఓ ఈవెంట్లో చేసిన కామెంట్లు విని షాక్ కు గురయ్యా’’ అని తన పోస్టులో విశాల్ రాసుకొచ్చాడు.
{{/usCountry}}‘‘తెలుగు ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇటీవల ఓ ఈవెంట్లో చేసిన కామెంట్లు విని షాక్ కు గురయ్యా’’ అని తన పోస్టులో విశాల్ రాసుకొచ్చాడు.
{{/usCountry}}‘‘లెజండరీ యాక్టర్, వన్ అండ్ ఓన్లీ ఎంజీఆర్ గురించి మీ స్పీచ్ ను బరువైన హృదయంతో ఖండిస్తున్నా. దివంగత ఎంజీఆర్ కేవలం దిగ్గజ నటుడు మాత్రమే కాదు తమిళనాడులో గొప్ప లీడర్. మరో దిగ్గజ నటుడు కాంతారావును పొగుడుతూ మీరు మాట్లాడటం బాగుంది. కానీ కాంతారావు గురించి పొగుడుతూ ఎంజీఆర్ ను తక్కువ చేయడం సరికాదు’’ అని విశాల్ తన పోస్టులో పేర్కొన్నాడు.
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన మరో నటుడు నాజర్ కూడా రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్ ను ఖండించాడు. తాము తెలుగు నటులను ఎంతో గౌరవిస్తామని, అలాంటిది ఎంజీఆర్ లాంటి వ్యక్తి గురించి అలా మాట్లాడటం సరి కాదని అన్నాడు. విమర్శలు ఎక్కువవుతుండటంతో రాజేంద్ర ప్రసాద్ దిగి వచ్చి క్షమాపణ చెప్పాడు.