రజనీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్ ను మళ్లీ చూడాలని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే తలైవర్ 173 సినిమాతో అది నిజం కానుంది. అయితే ఈ మూవీకి కమల్ హాసన్ ప్రొడ్యూసర్. రజనీకాంత్ హీరోగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాకు కొత్త డైరెక్టర్ ను ఇవాళ (జనవరి 3) అనౌన్స్ చేశారు. ఎవరూ ఊహించని విధంగా యంగ్ డైరెక్టర్ సిబి చక్రవర్తికి బంపరాఫర్ దక్కింది.
తలైవర్ 173 డైరెక్టర్

రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ కు చెందిన రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ ఓ మూవీ తెరకెక్కించనుంది. మొదట దీనికి సుందర్.సి డైరెక్టర్ గా అనుకున్నారు. కానీ ఆయన తప్పుకొన్నాడు. ఇప్పుడు సస్పెన్స్ కు తెరదించుతూ కొత్త డైరెక్టర్ గా యువ దర్శకుడు సిబి చక్రవర్తి పేరును ప్రకటించారు. 'తలైవర్ 173' అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పొంగల్ 2027 కోసం ప్రేక్షకుల ముందుకు రానుంది.
సిబి చక్రవర్తికి ఛాన్స్
తలైవర్ 173 సినిమాను సిబి చక్రవర్తి డైరెక్ట్ చేయనున్నట్లు శనివారం రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ శనివారం ధృవీకరించింది. ఓ ప్రకటనలో.. "ప్రతి హీరోకు ఒక కుటుంబం ఉంటుంది. ఆరంభికాలమా, తలైవర్ 173, సూపర్ స్టార్ పొంగల్ 2027 అని’’ అని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. కమల్ హాసన్ కూడా ఓ పోస్టులో ఈ విషయాన్ని కన్ఫామ్ చేశాడు.
ఎవరో అనుకుంటే?
సుందర్ సి దర్శకుడిగా తప్పుకోవడంతో తలైవర్ 173 మూవీకి డైరెక్టర్లుగా చాలా మంది పేర్లు వినిపించాయి. నెల్సన్ దిలీప్ కుమార్, లోకేష్ కనగరాజ్ ఇలా స్టార్ డైరెక్టర్ల గురించి చర్చలు వచ్చాయి. కానీ చివరకు అనూహ్యంగా సిబి చక్రవర్తికి ఆ అవకాశం దక్కింది. చక్రవర్తి ఇప్పటివరకూ ఒకే సినిమాను డైరెక్ట్ చేశాడు. శివ కార్తికేయన్ హీరోగా చక్రవర్తి తీసిన డాన్ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. అంతకుముందు అట్లీ దగ్గర శిష్యుడిగా చేశాడు చక్రవర్తి.
కల నెరవేరిందని
{{/usCountry}}సుందర్ సి దర్శకుడిగా తప్పుకోవడంతో తలైవర్ 173 మూవీకి డైరెక్టర్లుగా చాలా మంది పేర్లు వినిపించాయి. నెల్సన్ దిలీప్ కుమార్, లోకేష్ కనగరాజ్ ఇలా స్టార్ డైరెక్టర్ల గురించి చర్చలు వచ్చాయి. కానీ చివరకు అనూహ్యంగా సిబి చక్రవర్తికి ఆ అవకాశం దక్కింది. చక్రవర్తి ఇప్పటివరకూ ఒకే సినిమాను డైరెక్ట్ చేశాడు. శివ కార్తికేయన్ హీరోగా చక్రవర్తి తీసిన డాన్ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. అంతకుముందు అట్లీ దగ్గర శిష్యుడిగా చేశాడు చక్రవర్తి.
కల నెరవేరిందని
{{/usCountry}}"ఒకసారి ఒక చిన్న పట్టణ కుర్రాడి పెద్ద కల తన అభిమాన స్టార్ అయిన "సూపర్ స్టార్"ని కలవడం, అతనితో ఫోటో దిగడం. ఇది సినిమా పట్ల అతని అభిరుచిని పెంచింది. ఆ కల తీరింది. అప్పుడు సూపర్ స్టార్ కు దర్శకత్వం వహించాలనే పెద్ద కల మొదలైంది. అతను అది ఒక రోజు జరుగుతుందని నమ్మడం కొనసాగించాడు. ఈ రోజు ఆ రోజే. కలలు నిజమవుతాయి. అద్భుతాలు జరుగుతాయి’’ అని సిబి చక్రవర్తి సంతోషంలో మునిగిపోయాడు.