Rajinikanth Anirudh Kavya: సూపర్ స్టార్ రజినీకాంత్ స్టైల్ అండ్ స్వాగ్ వేరే లెవల్. 70 ఏళ్లలోనూ కుర్రాడిలా సినిమాల్లో అదరగొడుతున్నారు. తాజాగా రజినీకాంత్ బయట కూడా తన డ్యాన్స్ తో సెన్సేషన్ గా మారారు. తన మేనళ్లుడు అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వెడ్డింగ్ పార్టీలో రజినీకాంత్ డ్యాన్స్ వైరల్ గా మారింది.
రజినీకాంత్ డ్యాన్స్

లవ్ బర్డ్స్ అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ గ్రీస్ లో పెళ్లి చేసుకున్నారు. బుధవారం (నవంబర్ 11) వీళ్ల వెడ్డింగ్ గ్రాండ్ గా జరిగింది. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కు రజినీకాంత్ తన ఫ్యామిలీతో వెళ్లారు. అనిరుధ్, కావ్య పెళ్లిలో ఆయన స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ వెడ్డింగ్ పార్టీలో డ్యాన్స్ కూడా చేశారు.
కపుల్స్ తో కలిసి
అనిరుధ్, కావ్య పెళ్లి పార్టీలో రజినీకాంత్ డ్యాన్స్ చేసిన వీడియోలు వైరల్ గా మారాయి. తన ‘వేట్టయన్’ సినిమాలోని ఛార్ట్ బస్టర్ సాంగ్ ‘మనసిలాయో’కు తలైవా తన స్టైల్ లో స్టెప్పులేశారు. కొత్త దంపతులు అనిరుధ్, కావ్యతో కలిసి చిందులేశారు. ఈ బ్లాక్ బస్టర్ సాంగ్ కు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించిన సంగతి తెలిసిందే.
అనిరుధ్, కావ్య పెళ్లి
మోస్ట్ వాంటెడ్ అండ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ పెళ్లిపై ఎప్పటినుంచో వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ కేవలం ఊహాగానాలే అని వీళ్లు కొట్టిపారేశారు. చివరకు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సమక్షంలో నవంబర్ 11న గ్రీస్ లో అనిరుధ్, కావ్య పెళ్లి జరిగింది. వీళ్ల వెడ్డింగ్ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
అనిరుధ్, రజినీ రిలేషన్
రజినీకాంత్, అనిరుధ్ మధ్య కేవలం హీరో, మ్యూజిక్ డైరెక్టర్ రిలేషన్ మాత్రమే కాదు అంతకుమించిన బంధం ఉంది. రజినీకాంత్ కు అనిరుధ్ మేనళ్లుడి వరుస అవుతాడు. రజినీకాంత్ భార్య సోదరుడి కొడుకే అనిరుధ్. అంటే అనిరుధ్ కు రజినీకాంత్ భార్య సొంత మేనత్త. అందుకే ఈ పెళ్లి గురించి రజినీకాంత్ స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకున్నారని టాక్.
చెన్నైలో రిసెప్షన్
{{/usCountry}}రజినీకాంత్, అనిరుధ్ మధ్య కేవలం హీరో, మ్యూజిక్ డైరెక్టర్ రిలేషన్ మాత్రమే కాదు అంతకుమించిన బంధం ఉంది. రజినీకాంత్ కు అనిరుధ్ మేనళ్లుడి వరుస అవుతాడు. రజినీకాంత్ భార్య సోదరుడి కొడుకే అనిరుధ్. అంటే అనిరుధ్ కు రజినీకాంత్ భార్య సొంత మేనత్త. అందుకే ఈ పెళ్లి గురించి రజినీకాంత్ స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకున్నారని టాక్.
చెన్నైలో రిసెప్షన్
{{/usCountry}}గ్రీస్ లో జరిగిన అనిరుధ్, కావ్య వెడ్డింగ్ కు కొద్ది మందిని మాత్రమే ఇన్వైట్ చేశారు. అయితే సినీ ఇండస్ట్రీ సెలబ్రిటీలతో పాటు ఇతర ప్రముఖుల కోసం నవంబర్ 21న చెన్నైలో ఈ జంట గ్రాండ్ రిసెప్షన్ ఇవ్వబోతుంది. ఈ రిసెప్షన్ కు ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరు కాబోతున్నారని సమాచారం.