Jailer 2 Release Date: కన్ఫమ్.. చిరంజీవితో సూపర్ స్టార్ రజనీకాంత్ బాక్సాఫీస్ ఫైట్.. జైలర్ 2 రిలీజ్ డేట్ ఇదే
Jailer 2 Release Date: రజనీకాంత్ నటిస్తున్న జైలర్ 2 రిలీజ్ డేట్ కన్ఫమ్ అయింది. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరతో ఈ మూవీ పోటీ పడనుంది. ఈ జైలర్ 2 అక్టోబర్ 15న థియేటర్లలో రిలీజ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు.
Jailer 2 Release Date: సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) ఆల్-టైమ్ ఇండస్ట్రీ హిట్ సీక్వెల్ 'జైలర్ 2' అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్ హౌస్ ఎన్నో నెలల సస్పెన్స్‌కు ఎండ్ కార్డ్ వేస్తూ ఈ క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది. ఈ ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్ దసరా పండుగ కానుకగా అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.

2023లో వచ్చిన 'జైలర్' ఫస్ట్ పార్ట్ వరల్డ్‌వైడ్‌గా రూ. 604.50 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించింది. నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ఆ కమ్‌బ్యాక్ ఫిల్మ్ రజనీ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచింది. ఇప్పుడు పార్ట్ 2 అనౌన్స్‌మెంట్ రాగానే సోషల్ మీడియాలో "అలప్పర కెలప్పోరమ్" అంటూ ఫ్యాన్స్ హంగామా స్టార్ట్ చేశారు.
మైండ్ బ్లోయింగ్ యాక్షన్ టీజర్.. సస్పెన్స్‌లో స్టోరీ
జైలర్ 2 మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌తో పాటు మేకర్స్ వదిలిన గ్లింప్స్ టీజర్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఇందులో కథను ఎక్కడా రివీల్ చేయకుండా కేవలం రజనీకాంత్ ఐకానిక్ క్యారెక్టర్ 'టైగర్' ముత్తువేల్ పాండియన్ రగ్గడ్ లుక్‌ను మాత్రమే ఎలివేట్ చేశారు.
పూర్తి ఫేస్ చూపించకుండా కేవలం బ్యాక్ ప్రొఫైల్ నడకతోనే థియేటర్లలో పూనకాలు తెప్పించేలా ఈ టీజర్ కట్ చేశారు. ఈసారి ముత్తువేల్ పాండియన్ అంతకంటే ప్రమాదకరమైన మిషన్‌లో ఉన్నట్లు హింట్ ఇచ్చారు.
ఫస్ట్ పార్ట్ సక్సెస్ ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో నెల్సన్ ఈ సీక్వెన్స్‌ను హాలీవుడ్ లెవెల్ లో ప్లాన్ చేశాడు. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, మలయాళ లెజెండ్ మోహన్‌లాల్ ఈ పార్ట్‌లో కూడా తమ పవర్‌ఫుల్ క్యారెక్టర్లతో రజనీకి తోడుగా నిలవనున్నారు.
వీరితో పాటు ఎస్‌జే సూర్య, మిథున్ చక్రవర్తి, యోగి బాబు, రమ్యకృష్ణ లాంటి భారీ తారాగణం ఈ సినిమాలో ఉంది. బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ ఈ మూవీతోనే కోలీవుడ్‌లోకి గ్రాండ్‌గా డెబ్యూ ఇస్తోంది.
షారుఖ్ ఖాన్ మిస్సైన క్యారెక్టర్‌లో హృతిక్ రోషన్
ఈ జైలర్ మూవీ సీక్వెల్‌లో ఉన్న బిగ్గెస్ట్ సర్‌ప్రైజ్ ఏంటంటే బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ (Hrithik Roshan) ఒక పవర్‌ఫుల్ క్యామియో రోల్ ప్లే చేస్తున్నాడు. నిజానికి ఈ ఇంటెన్స్ రోల్ కోసం మొదట కింగ్ షారుఖ్ ఖాన్‌తో డిస్కషన్స్ జరిగాయి. కానీ షారుఖ్ తన అప్‌కమింగ్ మూవీ 'కింగ్' (తన కూతురు సుహానా ఖాన్ డెబ్యూ ఫిల్మ్) షూటింగ్స్, బిజీ షెడ్యూల్స్ వల్ల ఈ ప్రాజెక్ట్‌లోకి రాలేకపోయాడు.
దీంతో ఆ క్రేజీ రోల్ హృతిక్ రోషన్ చేతికి వెళ్ళింది. ఇది కేవలం ఒకటి రెండు నిమిషాలు ఉండే గెస్ట్ అప్పీయరెన్స్ కాదని, కథను మలుపు తిప్పే ఒక స్ట్రాంగ్ ఫ్రెండ్ క్యారెక్టర్ అని ఇన్‌సైడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ముత్తువేల్ పాండియన్ కష్టాల్లో ఉన్నప్పుడు అతనికి హెల్ప్ చేయడానికి వచ్చే ఒక పవర్‌ఫుల్ బ్యాక్‌బోన్ లాంటి పాత్రలో హృతిక్ కనిపించబోతున్నాడు.
అనిరుధ్ మ్యాజిక్.. హుకుం రీలోడెడ్
ఈ ఏడాది స్టార్టింగ్‌లోనే మేజర్ షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయినప్పటికీ, రీసెంట్‌గా చెన్నైలో కొన్ని అడిషనల్ యాక్షన్ సీన్స్, ప్యాచ్ వర్క్ షూట్ చేశారు. సినిమా అవుట్‌పుట్ ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదనే ఉద్దేశంతోనే ఈ ఫైన్ ట్యూనింగ్ చేసినట్లు తెలుస్తోంది. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) మళ్లీ ఈ ప్రాజెక్ట్‌కు మ్యూజిక్ అందిస్తున్నాడు.
ఇప్పటికే బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తున్న 'హుకుం రీలోడెడ్' (Hukum Reloaded) సాంగ్ సోషల్ మీడియా రీల్స్‌ను రూల్ చేస్తోంది. దసరా పండుగ లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ ఉండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజే రూ. 100 కోట్లకు పైగా ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయమని ట్రేడ్ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు.
చిరంజీవితో పోటీ
అయితే రజనీకాంత్ కు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం గట్టి పోటీ ఎదురు కానుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభర మూవీ మరుసటి రోజే అంటే అక్టోబర్ 16న థియేటర్లలో రిలీజ్ కానుంది. తాజాగా గురువారం (జులై 2) ఉదయమే ఈ మూవీ రిలీజ్ డేట్ ను రివీల్ చేశారు. దీంతో మెగాస్టార్, సూపర్ స్టార్ మధ్య బాక్సాఫీస్ ఫైట్ ఆసక్తి రేపుతోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


