Rajinikanth: మాట్లాడితే తప్పు.. మాట్లాడకపోతే ఇంకో తప్పు.. నెటిజన్ల తీరుపై విసిగిపోయిన రజనీకాంత్..

Rajinikanth: రజనీకాంత్ తనపై వస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించారు. మాట్లాడితే తప్పు.. మాట్లాకపోతే తప్పు అనేలా నెటిజన్లు విమర్శలు గుప్పిస్తుండటంపై తీవ్రంగా స్పందించారు. తన ధర్మన్ మూవీ లాంచ్ ఈవెంట్ లో రజనీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Published on: Jun 24, 2026, 16:30:54 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ తన లేటెస్ట్ సినిమా ప్రెస్ మీట్‌లో సోషల్ మీడియా ట్రోలర్స్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చెన్నైలో బుధవారం (జూన్ 24) జరిగిన తన 173వ సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్‌లో రజనీకాంత్ పాల్గొన్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు 'ధర్మన్' (Dharman) అనే పవర్ ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు.

Rajinikanth: మాట్లాడితే తప్పు.. మాట్లాడకపోతే ఇంకో తప్పు.. నెటిజన్ల తీరుపై విసిగిపోయిన రజనీకాంత్..
Rajinikanth: మాట్లాడితే తప్పు.. మాట్లాడకపోతే ఇంకో తప్పు.. నెటిజన్ల తీరుపై విసిగిపోయిన రజనీకాంత్..

లోకనాయకుడు కమల్ హాసన్ తన సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (RKFI)పై ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ వేడుకలో రజనీకాంత్ స్పీచ్ ఇస్తూ.. ఈ మధ్య కాలంలో తాను ఏం మాట్లాడినా అది పెద్ద వివాదంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

మాట్లాడాలంటే భయమేస్తోంది

"ఎవరైనా నన్ను స్టేజీపైకి వచ్చి మాట్లాడమని పిలిస్తేనే ఈ మధ్య భయమేస్తోంది. నేను మాట్లాడితే అది మీకు లేదా నాకు పెద్ద సమస్యను క్రియేట్ చేస్తోంది. అలాగని నేను సైలెంట్‌గా ఉంటే.. ఎందుకు మాట్లాడటం లేదు, నోట్లో కొడుకుమ్మే (తమిళ సాంప్రదాయ స్వీట్) పట్టుకు కూర్చున్నాడా అని వెటకారాలు చేస్తున్నారు" అంటూ రజనీకాంత్ ఘాటుగా రిప్లై ఇచ్చారు.

తాను ఏం చేసినా విమర్శించే వాళ్లు విమర్శిస్తూనే ఉంటారని సూపర్ స్టార్ క్లారిటీ ఇచ్చారు. ఇన్నేళ్ల తన పబ్లిక్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్‌తో ఒక విషయం అర్థమైందని, మనల్ని ఇష్టపడని వాళ్లు మనం ఏం చేసినా మెచ్చుకోరని, అలాగే మనల్ని ఇష్టపడే వాళ్లు మనం ఏం చేసినా బ్లైండ్‌గా సపోర్ట్ చేస్తారనుకోవడం కూడా అమాయకత్వమేనని, అందుకే చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలని చెప్పుకొచ్చారు.

విజయ్ సీఎం సక్సెస్‌పై క్లారిటీ.. అసూయ రూమర్లకు చెక్

గత మే నెలలో రజనీకాంత్ తన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టి తమిళనాడు సీఎం సి. జోసెఫ్ విజయ్ రాజకీయ విజయంపై మాట్లాడినప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేగింది. విజయ్ సీఎం కావడం రజనీకాంత్‌కు ఇష్టం లేదంటూ కొందరు ప్రచారం చేశారు. దీనిపై కూడా రజనీకాంత్ ఈ ఈవెంట్‌లో మరోసారి ఓపెన్‌గా మాట్లాడారు.

తాను ఎవరి గురించైనా అనవసరంగా మాట్లాడే చీప్ క్యారెక్టర్ కాదని రజనీకాంత్ స్పష్టం చేశారు. విజయ్ అంత పెద్ద విజయం సాధించి ముఖ్యమంత్రి అవ్వడం తనకు ఎంతో షాకింగ్ అండ్ హ్యాపీగా అనిపించిందన్నారు. తాను అసలు రాజకీయాల్లోనే లేనప్పుడు విజయ్‌ను చూసి ఎందుకు కుళ్లుకుంటానని ప్రశ్నించారు.

ఒకవేళ కమల్ హాసన్ సీఎం అయితే తాను కాస్త జెలస్ ఫీలవుతానేమో అంటూ సరదాగా నవ్వేశారు. విజయ్‌కు తనకు మధ్య 25 ఏళ్ల జనరేషన్ గ్యాప్ ఉందని, ఇద్దరికీ అస్సలు పోలికే లేదని చెప్పారు. 52 ఏళ్ల చిన్న వయసులోనే విజయ్.. లెజెండ్స్ అయిన ఎంజీఆర్, ఎన్టీఆర్ కంటే పెద్ద సక్సెస్ సాధించాడని కొనియాడారు.

విజయ్ బర్త్‌డేకు విష్ చేయలేదా? అసలు సీక్రెట్ ఇదీ

ఇక జూన్ 22న విజయ్ బర్త్‌డే జరిగినప్పుడు రజనీకాంత్ సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టకపోవడంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి రజనీకాంత్ స్పందిస్తూ.. తాను పబ్లిక్‌గా పోస్ట్ పెట్టకపోయినా, పర్సనల్‌గా విజయ్‌కు ఫోన్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశానని, తామిద్దరం ఫోన్ లో మాట్లాడుకున్నామని రూమర్లకు చెక్ పెట్టారు.

నలుగురు డైరెక్టర్లు మారిన 'ధర్మన్' కథ

ఈ సందర్భంగా 'ధర్మన్' సినిమా వెనుక జరిగిన ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీని రజనీకాంత్ రివీల్ చేశారు. ఈ ప్రాజెక్ట్ కోసం మొదట కేఎస్ రవికుమార్, ఆ తర్వాత సుందర్ సి, ఆ తర్వాత 'డాన్' ఫేమ్ సిబి చక్రవర్తిలను డైరెక్టర్లుగా అనుకున్నారట. సిబి చెప్పిన న్యూక్లియర్ సైంటిస్ట్ కథ చాలా బాగున్నప్పటికీ, అది రష్యా, ఆఫ్ఘనిస్తాన్ బ్యాక్‌డ్రాప్‌లో షూట్ చేయాల్సి ఉండటం వల్ల చాలా టైమ్ పడుతుందని ఆ ప్రాజెక్ట్‌ను హోల్డ్‌లో పెట్టారు.

చివరకు 'ఓ మై కడవులే', 'డ్రాగన్' సినిమాల డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు చెప్పిన మెడికల్ యాక్షన్ థ్రిల్లర్ స్క్రిప్ట్ నచ్చడంతో ఈ సినిమాను ఫైనల్ చేశారు. ఇందులో రజనీకాంత్ 'డాక్టర్ స్వాగ్' అనే పవర్‌ఫుల్ అండ్ డెడ్లీ డాక్టర్ క్యారెక్టర్‌లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో సిమ్రాన్, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. జూన్ 25 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More