...
...
Next Story

50 ఏళ్ల సినిమా ప్రస్థానం-రజనీకాంత్, బాలకృష్ణలకు ఘన సన్మానం-ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఈవెంట్

రజనీకాంత్, నందమూరి బాలకృష్ణలకు సినిమా రంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతిష్టాత్మక ఇఫ్ఫీలో ఘనంగా సన్మానించనున్నారు.

Published on: Nov 16, 2025, 21:45:39 IST
Advertisement

సినీ దిగ్గజాలు రజనీకాంత్, నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కనుంది. ఈ ఇద్దరు లెజండ్లను రాబోయే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI-ఇఫ్ఫీ) ముగింపు వేడుకల్లో సన్మానించనున్నారు. సినిమా రంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఘన సత్కారం చేయబోతున్నారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సమక్షంలో సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ విలేకరులకు ఈ సమాచారం అందించారు.

50 ఏళ్ల సినిమా కెరీర్

రజనీకాంత్, బాలకృష్ణకు సన్మానం
రజనీకాంత్, బాలకృష్ణకు సన్మానం

"భారతీయ సినిమా సంస్కృతిపై వారి నిరంతర ప్రభావాన్ని తెలిపే ఈ మైలురాయిని పురస్కరించుకుని రజనీకాంత్, నందమూరి బాలకృష్ణలకు సన్మానం చేస్తాం. సినిమా రంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు ఈ సత్కారం’’ అని మురుగన్ తెలిపారు. "వారి అద్భుతమైన నటన, విస్తృతమైన ప్రజాదరణ, దశాబ్దాలుగా భారతీయ కథనాలకు రూపాన్నిచ్చిన వారి కృషికి గుర్తింపుగా ముగింపు వేడుకల్లో వారిని సన్మానిస్తారు" అని ఆయన తెలిపారు.

ఇఫ్ఫీ వేడుకలు

ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలు ఈ సారి గోవాలో నవంబర్ 20న ప్రారంభమై, నవంబర్ 28న ముగుస్తాయి. ముగింపు వేడుక డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో జరుగుతుంది. ఈ ఉత్సవం సుందరమైన డి.బి. బందోద్కర్ రోడ్డు వెంట జరిగే గాలా ఫ్లోట్ పరేడ్‌తో ప్రారంభమవుతుంది.

ప్రతి సంవత్సరం ఇఫ్ఫీ కొత్త అంశాలతో మెరుగుపడుతుందని మురుగన్ తెలిపారు. సాంప్రదాయ ప్రారంభోత్సవ పద్ధతికి బదులుగా ఈసారి పనాజీలో జరిగే గాలా ఫ్లోట్ పరేడ్‌తో ఉత్సవం ప్రారంభమవుతుందని ఆయన అన్నారు. మంత్రి కామెంట్ల ప్రకారం భారతదేశపు గొప్ప సినిమా సంస్కృతిని ప్రదర్శించే వివిధ రాష్ట్రాలు, ప్రభుత్వ విభాగాల నుండి మొత్తం 12 టేబ్లోలు ఈ పరేడ్‌లో పాల్గొంటాయి.

270 సినిమాలు

తమిళ సినిమా రంగంలో అత్యంత నిలకడైన, విజయవంతమైన కమర్షియల్ స్టార్‌గా పేరొందిన రజనీకాంత్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఆయన 1975లో విడుదలైన 'అపూర్వ రాగంగళ్' చిత్రంతో అరంగేట్రం చేశారు. మొదట్లో ప్రతికూల పాత్రలలో నటించిన ఆయన తరువాత అద్భుతమైన అభిమాన సైన్యం, భారీ వసూళ్లను సాధించే హీరోగా ఎదిగారు.

తెలుగు నటుడు బాలకృష్ణ 100కు పైగా చిత్రాలలో నటించారు. 'సమరసింహారెడ్డి', 'సింహా', 'ఆదిత్య 369', 'ముద్దుల మావయ్య', ‘లెజెండ్’, ‘అఖండ’ వంటి భారీ విజయాలు సాధించారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీ పార్టీ ఎమ్మెల్యే కూడా.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe