ఓటీటీలో తెలుగు రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీ రాజు వెడ్స్ రాంబాయి అదరగొడుతోంది. డిజిటల్ స్ట్రీమింగ్ లో ఈ లేటెస్ట్ హిట్ సినిమా సత్తాచాటుతోంది. తాజాగా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను క్రాస్ చేసింది. ఓటీటీలో వ్యూస్ తో దూసుకెళ్తోంది. మరి మీరు ఈ రొమాంటిక్ మూవీని చూశారా? లేదంటే ఇప్పుడే ఓ లుక్కేయండి.
రాజు వెడ్స్ రాంబాయి ఓటీటీ

తెలుగు రొమాంటిక్ లవ్ స్టోరీ రాజు వెడ్స్ రాంబాయి మూవీ ఓటీటీలో అదుర్స్ అనిపిస్తోంది. ఈ లేటెస్ట్ మూవీ ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. డిసెంబర్ 18 న ఇది ఓటీటీలో రిలీజైంది. రాజు వెడ్స్ రాంబాయి సినిమాకు తెలుగు ఆడియన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. ఇది తాజాగా 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను దాటింది.
ఓటీటీలో ఇలా
రాజు వెడ్స్ రాంబాయి సినిమాను ఓటీటీలో చూసేందుకు మరో ప్రత్యేకత ఉంది. అదే ఎక్స్ టెండెడ్ కట్. అంటే థియేటర్లో లేని కొన్ని సీన్లను ఇప్పుడు ఈ చిత్రానికి యాడ్ చేశారు. గతంలో లిటిల్ హార్ట్స్ సినిమాను కూడా ఇలా ఎక్స్ టెండెడ్ కట్ తో ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ మూవీకి భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయిని కూడా అలాగే తీసుకొచ్చింది.
రియల్ స్టోరీతో
రాజు వెడ్స్ రాంబాయి మూవీ విలేజ్ రొమాంటిక్ లవ్ స్టోరీగా, రా అండ్ రస్టిక్ గా తెరకెక్కింది. ఇది ఒక నిజ జీవిత కథ. దీనికి సాయిలు కాంపాటి డైరెక్టర్. ఈ సినిమాలో అఖిల్, తేజస్విని రావు, చైతన్య జొన్నలగడ్డ తదితరులు నటించారు. ఈ మూవీ ఖమ్మం, వరంగల్ ప్రాంతాల్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్ల ఆధారంగా రూపొందించారు.
రాజు వెడ్స్ రాంబాయి కథ
ఓ గ్రామంలో ప్రేమను గెలిపించుకోవడానికి లవర్స్ ఏం చేశారు? ఆ తర్వాత జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. ఇది వరంగల్ దగ్గర్లోని ఓ గ్రామంలోని జరిగే కథ. రాజు (అఖిల్ రాజ్) బ్యాండ్ కొడుతుంటాడు. గ్రామంలో పెళ్లయినా, చావైనా రాజ్ బ్యాండ్ మోగాల్సిందే. అదే ఊరికి చెందిన రాంబాయి (తేజస్విని రావ్)ని రాజు ప్రేమిస్తాడు.
{{/usCountry}}ఓ గ్రామంలో ప్రేమను గెలిపించుకోవడానికి లవర్స్ ఏం చేశారు? ఆ తర్వాత జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. ఇది వరంగల్ దగ్గర్లోని ఓ గ్రామంలోని జరిగే కథ. రాజు (అఖిల్ రాజ్) బ్యాండ్ కొడుతుంటాడు. గ్రామంలో పెళ్లయినా, చావైనా రాజ్ బ్యాండ్ మోగాల్సిందే. అదే ఊరికి చెందిన రాంబాయి (తేజస్విని రావ్)ని రాజు ప్రేమిస్తాడు.
{{/usCountry}}రాంబాయి కూడా రాజును ఇష్టపడుతుంది. అయితే రాంబాయి తండ్రి వెంకన్న (చైతన్య జొన్నలగడ్డ) మాత్రం తన కూతురి పెళ్లి గవర్నమెంట్ జాబ్ ఉన్నోడితోనే చేయించాలనుకుంటాడు. దీంతో రాంబాయిని పెళ్లి చేసుకోవాలనే రాజు.. ముందే ప్రెగ్నెంట్ చేస్తే చచ్చినట్లు పెళ్లి చేస్తారనుకుంటాడు. రాంబాయి ప్రెగ్నెంట్ అవుతుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? వెంకన్న ఏం చేశాడు? రాజు, రాంబాయిల పెళ్లి జరిగిందా? అన్నది సినిమాలో చూడాల్సిందే.