ఓటీటీలోకి తెలుగు లేటెస్ట్ రూరల్ లవ్ స్టోరీ వచ్చేసింది. థియేటర్లలో అదరగొట్టిన రాజు వెడ్స్ రాంబాయి మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో చూడని సీన్లతో అంటే ఎక్స్ టెండెడ్ కట్ తో ఇవాళ (డిసెంబర్ 18) ఓటీటీలోకి అడుగుపెట్టింది రాజు వెడ్స్ రాంబాయి. ఇదో విలేజ్ లవ్ స్టోరీ.
రాజు వెడ్స్ రాంబాయి ఓటీటీ

చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా కంటెంట్ బాగున్న మూవీస్ ను ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. ఇలా చిన్న సినిమాగా రిలీజై ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న మూవీ రాజు వెడ్స్ రాంబాయి. థియేటర్లలో సత్తాచాటిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. గురువారం నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
అదనపు సీన్లు
రాజు వెడ్స్ రాంబాయి సినిమాను ఓటీటీలో చూసేందుకు మరో ప్రత్యేకత ఉంది. అదే ఎక్స్ టెండెడ్ కట్. అంటే థియేటర్లో లేని కొన్ని సీన్లను ఇప్పుడు ఈ చిత్రానికి యాడ్ చేశారు. గతంలో లిటిల్ హార్ట్స్ సినిమాను కూడా ఇలా ఎక్స్ టెండెడ్ కట్ తో ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ మూవీకి భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయిని కూడా అలాగే తీసుకొచ్చింది.
విలేజ్ లవ్ స్టోరీ
రాజు వెడ్స్ రాంబాయి మూవీ విలేజ్ రొమాంటిక్ లవ్ స్టోరీగా, రా అండ్ రస్టిక్ గా తెరకెక్కింది. ఇది ఒక నిజ జీవిత కథ. దీనికి సాయిలు కాంపాటి డైరెక్టర్. ఈ సినిమాలో అఖిల్, తేజస్విని రావు, చైతన్య జొన్నలగడ్డ తదితరులు నటించారు. ఈ మూవీ ఖమ్మం, వరంగల్ ప్రాంతాల్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్ల ఆధారంగా రూపొందించారు.
రాజు వెడ్స్ రాంబాయి కథ
ఓ గ్రామంలో ప్రేమను గెలిపించుకోవడానికి లవర్స్ ఏం చేశారు? ఆ తర్వాత జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. ఇది వరంగల్ దగ్గర్లోని ఓ గ్రామంలోని జరిగే కథ. రాజు (అఖిల్ రాజ్) బ్యాండ్ కొడుతుంటాడు. గ్రామంలో పెళ్లయినా, చావైనా రాజ్ బ్యాండ్ మోగాల్సిందే. అదే ఊరికి చెందిన రాంబాయి (తేజస్విని రావ్)ని రాజు ప్రేమిస్తాడు.
ప్రెగ్నెన్సీ చేస్తే
{{/usCountry}}ఓ గ్రామంలో ప్రేమను గెలిపించుకోవడానికి లవర్స్ ఏం చేశారు? ఆ తర్వాత జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. ఇది వరంగల్ దగ్గర్లోని ఓ గ్రామంలోని జరిగే కథ. రాజు (అఖిల్ రాజ్) బ్యాండ్ కొడుతుంటాడు. గ్రామంలో పెళ్లయినా, చావైనా రాజ్ బ్యాండ్ మోగాల్సిందే. అదే ఊరికి చెందిన రాంబాయి (తేజస్విని రావ్)ని రాజు ప్రేమిస్తాడు.
ప్రెగ్నెన్సీ చేస్తే
{{/usCountry}}రాంబాయి కూడా రాజును ఇష్టపడుతుంది. అయితే రాంబాయి తండ్రి వెంకన్న (చైతన్య జొన్నలగడ్డ) మాత్రం తన కూతురి పెళ్లి గవర్నమెంట్ జాబ్ ఉన్నోడితోనే చేయించాలనుకుంటాడు. దీంతో రాంబాయిని పెళ్లి చేసుకోవాలనే రాజు.. ముందే ప్రెగ్నెంట్ చేస్తే చచ్చినట్లు పెళ్లి చేస్తారనుకుంటాడు. రాంబాయి ప్రెగ్నెంట్ అవుతుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? వెంకన్న ఏం చేశాడు? రాజు, రాంబాయిల పెళ్లి జరిగిందా? అన్నది సినిమాలో చూడాల్సిందే.