పెళ్లి కోసం ముందే ప్రెగ్నెన్సీ-ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి-స్ట్రీమింగ్ డేట్ ఇదే!

రీసెంట్ గా పాటలతో, పల్లెటూరి ప్రేమకథ స్టోరీతో ఎక్కువగా వైరల్ అయిన మూవీ రాజు వెడ్స్ రాంబాయి. ముఖ్యంగా ఇందులోనూ రాంబాయి పాట ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు రెడీ అయింది. 

Published on: Dec 13, 2025, 16:32:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి మరో తెలుగు సినిమా రాబోతుంది. పరువు హత్య కోణంలో డిఫరెంట్ స్టోరీ లైన్ తో తెరకెక్కిన మూవీ ‘రాజు వెడ్స్ రాంబాయి’. ఈ విలేజ్ లవ్ స్టోరీ థియేటర్లలో ఆడియన్స్ మనసును హత్తుకుంది. ఇప్పుడీ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది. ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ పై లేటెస్ట్ బజ్ వైరల్ గా మారింది.

రాజు వెడ్స్ రాంబాయి పోస్టర్ (x/etvwin)
రాజు వెడ్స్ రాంబాయి పోస్టర్ (x/etvwin)

రాజు వెడ్స్ రాంబాయి ఓటీటీ

తెలుగులో వచ్చిన లేటెస్ట్ సినిమా రాజు వెడ్స్ రాంబాయి. ఇప్పుడీ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు రాబోతుంది. ఈ చిత్రం డిసెంబర్ 18న ఓటీటీలో రిలీజ్ కానుంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో ఇది స్ట్రీమింగ్ కానుంది. ఈ తెలుగు మూవీ డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేస్తోంది.

థియేటర్లో ఇలా

రాజు వెడ్స్ రాంబాయి సినిమా నవంబర్ 21న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. క్రమంగా కలెక్షన్లు కూడా పెరిగాయి. ముఖ్యంగా ఈ చిత్రంలోని ‘రాంబాయి నీ మీద నాకు మనసాయెనే’ సాంగ్ తెగ వైరల్ అవుతోంది. ఎక్కడ చూసినా ఈ పాట వినిపిస్తూనే ఉంది. ఈ సాంగ్ తో సినిమాపై ఇంట్రెస్ట్ మరింత ఎక్కువైంది.

రాజు వెడ్స్ రాంబాయి సినిమాకు సాయిలు కంభంపాటి డైరెక్టర్. ఇందులో అఖిల్ రాజ్, తేజస్వి రావు, శివాజీ రాజా, చైతు జొన్నలగడ్డ, అనిత చౌదరి తదితరులు నటించారు.

రాజు వెడ్స్ రాంబాయి స్టోరీ

ఓ గ్రామంలో ప్రేమను గెలిపించుకోవడానికి లవర్స్ ఏం చేశారు? ఆ తర్వాత జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. ఇది వరంగల్ దగ్గర్లోని ఓ గ్రామంలోని జరిగే కథ. రాజు (అఖిల్ రాజ్) బ్యాండ్ కొడుతుంటాడు. గ్రామంలో పెళ్లయినా, చావైనా రాజ్ బ్యాండ్ మోగాల్సిందే. అదే ఊరికి చెందిన రాంబాయి (తేజస్విని రావ్)ని రాజు ప్రేమిస్తాడు.

ప్రెగ్నెన్సీ చేస్తే

రాంబాయి కూడా రాజును ఇష్టపడుతుంది. అయితే రాంబాయి తండ్రి వెంకన్న (చైతన్య జొన్నలగడ్డ) మాత్రం తన కూతురి పెళ్లి గవర్నమెంట్ జాబ్ ఉన్నోడితోనే చేయించాలనుకుంటాడు. దీంతో రాంబాయిని పెళ్లి చేసుకోవాలనే రాజు.. ముందే ప్రెగ్నెంట్ చేస్తే చచ్చినట్లు పెళ్లి చేస్తారనుకుంటాడు. రాంబాయి ప్రెగ్నెంట్ అవుతుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? వెంకన్న ఏం చేశాడు? రాజు, రాంబాయిల పెళ్లి జరిగిందా? అన్నది సినిమాలో చూడాల్సిందే.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More