దిగ్గజ నటుడు కమల్ హాసన్ రాజ్యసభలో తన తొలి స్పీచ్ అదరగొట్టారు. రాజ్యసభ ఎంపీగా ఆయన సభలో ప్రసంగించారు. తన స్పీచ్ లో భాగంగా కల్కి 2898 ఏడీలో తన క్యారెక్టర్ చెప్పిన డైలాగ్ ను కమల్ హాసన్ సభలో చెప్పడం వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.
రాజ్యసభలో కల్కి డైలాగ్

నటుడు, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ రాజ్యసభలో తన తొలి ప్రసంగం చేశారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కల్కి 2898 ఏడీ' సినిమాలోని తన పాత్ర సుప్రీం యాస్కిన్ చెప్పిన ప్రసిద్ధ డైలాగ్‌ను ప్రస్తావిస్తూ కమల్ హాసన్ తన అభిప్రాయాన్ని బలంగా వినిపించారు. ఈ తెలుగు సినిమా డైలాగ్‌ను పార్లమెంట్‌లో ఆయన చెప్పిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కమల్ హాసన్ స్పీచ్
"ప్రజాస్వామ్య శక్తితో మనం ముందుకు సాగడానికి సహకరించండి. లేదా ఈ ప్రజాస్వామ్య గణతంత్ర మార్గం నుండి తప్పుకోండి’’ అని ఇంగ్లీష్ లో స్పీచ్ కొనసాగించారు కమల్ హాసన్. ఆ తర్వాత తెలుగులో.. ‘‘జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి. నేను ఏమి చెబుతున్నానో తెలుగు వారికి అర్థం అవుతుంది’’ అని పేర్కొన్నారు.
"ఈ ప్రజాస్వామ్య రథం తేడాలను దాటుకుంటూ ముందుకు సాగాలి. కానీ ప్రజలను తొక్కుకుంటూ కాదు. అందుకు మేం అనుమతించం’’ అని రాజ్యసభలో కమల్ అన్నారు.
కల్కి డైలాగ్ అర్థం ఏమిటి?
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మూవీ కల్కి 2898 ఏడీ. ఇందులో సుప్రీం యాస్కిన్ క్యారెక్టర్ ప్లే చేశారు కమల్ హాసన్. ఈ సినిమా ప్రీ క్లైమాక్స్ లో ‘‘జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి" అనే డైలాగ్ చెప్తారు యాస్కిన్ క్యారెక్టర్ లో ఉన్న కమల్ హాసన్. అయితే ఈ డైలాగ్ మహాకవి శ్రీశ్రీ కవిత నుంచి తీసుకున్నారు. అణిచివేత, అక్రమాలకు వ్యతిరేకంగా, విప్లవం రాబోతుందనే అర్థంలో శ్రీశ్రీ ఈ లైన్లు రాశారని అంటారు.
{{/usCountry}}ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మూవీ కల్కి 2898 ఏడీ. ఇందులో సుప్రీం యాస్కిన్ క్యారెక్టర్ ప్లే చేశారు కమల్ హాసన్. ఈ సినిమా ప్రీ క్లైమాక్స్ లో ‘‘జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి" అనే డైలాగ్ చెప్తారు యాస్కిన్ క్యారెక్టర్ లో ఉన్న కమల్ హాసన్. అయితే ఈ డైలాగ్ మహాకవి శ్రీశ్రీ కవిత నుంచి తీసుకున్నారు. అణిచివేత, అక్రమాలకు వ్యతిరేకంగా, విప్లవం రాబోతుందనే అర్థంలో శ్రీశ్రీ ఈ లైన్లు రాశారని అంటారు.
{{/usCountry}}కల్కి సీక్వెల్ లో సాయి పల్లవి
కల్కి 2898 ఏడీ మూవీకి సీక్వెల్ రాబోతుందని తెలిసిందే. దీని కోసం మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే ఫస్ట్ పార్ట్ లో కీ రోల్ చేసిన దీపికా పదుకొణేను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. దీంతో సీక్వెల్ లో దీపికా ప్లేస్ లో సాయి పల్లవిని తీసుకునేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.