...
...
Next Story

Raakaasa BO: మళ్లీ మళ్లీ రాకాసను చూస్తున్న ఆడియెన్స్- నిహారిక కొణిదెల హారర్ కామెడీ ఫాంటసీ మూవీ 10 రోజుల కలెక్షన్స్ ఇవే!

Raakaasa 10 Days Worldwide Box Office Collections: నిహారిక కొణిదెల నిర్మించిన లేటెస్ట్ హారర్ కామెడీ ఫాంటసీ మూవీ రాకాస. సంగీత్ శోభన్, నయన్ సారిక హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను ఆడియెన్స్ మళ్లీ మళ్లీ చూస్తున్నారని మేకర్స్ తెలిపారు. ఈ క్రమంలో రాకాస 10 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతో చూద్దాం.

Published on: Apr 13, 2026, 19:35:14 IST
Advertisement

Raakaasa Worldwide Box Office Collections: టాలీవుడ్ యంగ్ హీరో సంగీత్ శోభన్, హీరోయిన్ నయన్ సారిక జంటగా నటించిన లేటెస్ట్ మూవీ రాకాస. నిహారిక కొణిదెల నిర్మించిన హారర్ కామెడీ ఫాంటసీ మూవీ రాకాసకు మానస శర్మ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది.

రాకాస కలెక్షన్స్

మళ్లీ మళ్లీ రాకాసను చూస్తున్న ఆడియెన్స్- నిహారిక కొణిదెల హారర్ కామెడీ ఫాంటసీ మూవీ 10 రోజుల కలెక్షన్స్ ఇవే!
మళ్లీ మళ్లీ రాకాసను చూస్తున్న ఆడియెన్స్- నిహారిక కొణిదెల హారర్ కామెడీ ఫాంటసీ మూవీ 10 రోజుల కలెక్షన్స్ ఇవే!

విడుద‌లైన‌ 10 రోజుల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా రాకాస రూ.22.60 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించిన‌ ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఇంకా త‌న స‌త్తాను చాటుతోంది. రిలీజైన రోజు నుంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమాకు ఇంకా ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ కొన‌సాగుతుండ‌టం విశేషం. ఇది చూస్తుంటే ఈ స‌క్సెస్ జోరు మరింత‌గా కొన‌సాగుతుంద‌నే సంకేతాల‌ను సూచిస్తోంది.

ఈ విజ‌యానికి ప్రధాన కారణం థియేటర్లలో ప్రేక్షకుల నుంచి వ‌స్తోన్న స్పంద‌న‌. రాకాస‌ సినిమాను ప్రేక్ష‌కులు వారి కుటుంబంతో క‌లిసి వ‌చ్చి వీక్షించి స‌ర‌దాగా న‌వ్వుకుని ఆస్వాదిస్తున్నారు. ఈ రెస్పాన్స్ ప్రతి షోలో కనిపిస్తోంది. ఈ రెస్పాన్స్ కొన‌సాగుతుండ‌టంతో సినిమాకు ఓ థియేట‌ర్స్‌లో స్థిరమైన రన్ కొనసాగుతోంది.

మళ్లీ మళ్లీ థియేటర్లలోకి ఆడియెన్స్

సాధార‌ణంగా ఓ సినిమాకు రిపీటెడ్ ఆడియెన్స్ రావ‌టం అనేది ఈరోజుల్లో అరుదుగా మారింది. అలాంటిది రాకాస సినిమాకు ఇలాంటి రెస్పాన్స్ వ‌చ్చి ప్రేక్షకులు మళ్లీ మళ్లీ థియేటర్లకు వస్తున్నారని మేకర్స్ తెలిపారు. ప్రేక్ష‌కులు వారి కుటుంబాల‌తో, మరోసారి ఇతరులతో కలిసి చూసేందుకు ఆస‌క్తిగా థియేట‌ర్స్‌కు వస్తున్నారు. ఇది సినిమాకు స‌హ‌జంగా పెరుగుతోన్న స్పంద‌న‌న‌ను తెలియ‌జేస్తోంది.

ఇందులో చిన్న పిల్ల‌ల‌కు కావ‌ల్సిన స‌ర‌దా, ఊహాశక్తిని రేకెత్తించే సన్నివేశాలు ఉండ‌టంతో వారు ఆక‌ర్షితుల‌వుతున్నారు. అలాగే మిగిలిన ఆడియెన్స్‌కు కావాల్సిన కామెడీ, పాత్ర‌ల ఆధారంగా న‌డిచే ఆస‌క్తిక‌ర‌మైన స‌న్నివేశాలు అన్నీ క‌ల‌గ‌లిసి ఉండ‌టంతో ప్రేక్ష‌కుల‌కు ఇదొక మంచి ఎంపిక‌గా మారుతోంది.

వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్

చ‌క్క‌టి అర్థ‌వంత‌మైన కామెడీతో రాకాస మూవీ అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తోంది. సంగీత్‌, గెట‌ప్ శీను ట్రాక్ ప్రేక్ష‌కుల‌కు చాలా బాగా క‌నెక్ట్ అయ్యింది. దీంతో పాటు వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్‌, న‌ట‌న‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌స్తోంది. దీంతో ప్రేక్ష‌కులు ఈ స‌మ్మ‌ర్‌లో కుటుంబంతో కలిసి ఈ సినిమాను చూడ‌టానికి ప్రాధాన్య‌త‌ను ఇస్తున్నారు.

రాకాస సినిమా స్థిరమైన రన్‌ను కొనసాగిస్తోన్న త‌రుణంలో మేక‌ర్స్ ఏప్రిల్ 10 నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.100 ఫ్లాట్ టికెట్ ధరను ప్రవేశపెట్టారు. దీంతో సినిమా ప్రస్తుతం పొందుతున్న ప్రేక్షకుల ఆద‌ర‌ణ మ‌రింత పెరిగింది.

టికెట్ ధ‌ర ప్రేక్ష‌కుల అందుబాటులోకి రావ‌టం ఎంతో కీల‌క‌మ‌ని చెప్పొచ్చు. ముఖ్యంగా బీ, సీ సెంటర్లలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఇప్పటికీ ఎక్కువ వసూళ్లను సాధిస్తున్నాయి. ఇప్పటికే సినిమాతో కనెక్ట్ అయిన కుటుంబాలు మళ్లీ మళ్లీ రావడానికి కూడా ఇది ప్రోత్సాహకంగా ఉంది.

మానస శర్మ టేకింగ్

జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి నిహారిక కొణిదెల సినిమాను రూపొందించిన తీరు, డైరెక్ట‌ర్ మానస శర్మ టేకింగ్ స‌హా ఇత‌ర న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ పని తీరుని అంద‌రూ అప్రిషియేట్ చేస్తున్నారు. అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను సినిమా మెప్పిస్తూ ముందుకు సాగుతుండ‌టంతో ఈ సినిమాను ప్రేక్ష‌కుల‌కు మంచి ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చే సినిమాగా అభినందిస్తున్నారు.

అంద‌రినీ మెప్ప్పిస్తూ రాకాస సినిమా రన్ కొనసాగుతుంది. దీంతో థియేట‌ర్స్‌కు ఆడియెన్స్ రావ‌టానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీనికి తోడు డిఫ‌రెట్ ప్ర‌మోష‌న‌ల్ స్ట్రాట‌జీ, మౌత్ టాక్ కూడా తోడు కావ‌టం మంచి ప‌రిణామం. ప్రస్తుతం ఉన్న ఈ వేగం అలాగే కొనసాగుతూ, టికెట్ ధరలు కూడా అందుబాటులోకి రావడంతో, ఈ సినిమా వేసవి కాలం మొత్తం మంచి రన్ కొనసాగించే స్థితిలో ఉంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe