...
...
Next Story

Dhurandhar 2: నా సిక్స‌ర్ పాకిస్థాన్‌లో ప‌డింది..సచిన్ టెండూల్క‌ర్‌తో ధురంధ‌ర్ 2 న‌టుడు..మ‌జా వ‌చ్చింద‌న్న క్రికెట్ గాడ్

Dhurandhar 2: రణవీర్ సింగ్ నటించిన స్పై థ్రిల్లర్ 'ధురంధర్: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తోంది. ఇందులో నెగెటివ్ రోల్‌లో మెప్పించిన రాకేష్ బేడీకి క్రికెట్ దిగ్గజం సచిన్ ఫోన్ చేసి ప్రశంసించగా, ఆయన ఇచ్చిన సమాధానం ఇప్పుడు వైరల్ అవుతోంది.

Published on: Apr 5, 2026, 17:38:59 IST
Advertisement

ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 'ధురంధర్: ది రివెంజ్' ప్రభంజనం కొనసాగుతోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ హీరోగా నటించిన ఈ స్పై థ్రిల్లర్ థియేటర్లో ఊపేస్తోంది. అయితే, ఈ సినిమాలో రణవీర్ సింగ్‌తో సమానంగా ఒక సీనియర్ నటుడి పాత్రపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆయనే రాకేష్ బేడీ. సాధారణంగా కామెడీ పాత్రలతో మెప్పించే రాకేష్ బేడీ, ఇందులో జమీల్ జమాలి అనే కుటిల రాజకీయనాయకుడి పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు.

సచిన్ ఫిదా

ధురంధర్ 2 నటుడి కామెంట్లు
ధురంధర్ 2 నటుడి కామెంట్లు

ధురంధర్ 2 చిత్రంలో రాకేష్ బేడీ నటనకు ఫిదా అయిన వారిలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కూడా ఉన్నారు. ఇటీవల 'ది లల్లంటాప్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాకేష్ బేడీ ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. సినిమా చూసిన తర్వాత సచిన్ స్వయంగా ఫోన్ చేసి అభినందించారని ఆయన తెలిపారు.

"రాకేష్ జీ, అద్భుతంగా నటించారు.. మీరు సినిమాలో కొట్టిన సిక్స్ మామూలుగా లేదు!" అని సచిన్ తనను మెచ్చుకున్నట్లు రాకేష్ తెలిపారు.

పాకిస్థాన్ లో

దానికి రాకేష్ బేడీ అంతే చమత్కారంగా సమాధానమిస్తూ.. "మీరు క్రికెట్ గ్రౌండ్‌లో చాలా సిక్సర్లు కొట్టారు, కానీ మీ సిక్సర్లు ఇండియాలో పడ్డాయి. నా సిక్స్ మాత్రం ఏకంగా పాకిస్థాన్‌లో పడింది" అని తాను అనడంతో సచిన్ నవ్వేశారని రాకేష్ బేడీ గుర్తు చేసుకున్నారు.

కథలో అసలు ట్విస్ట్ ఇదే!

రాకేష్ బేడీ తన పాత్ర గురించి అంత కాన్ఫిడెంట్‌గా చెప్పడానికి కారణం సినిమాలో ఆయన పాత్ర ఇచ్చే షాకింగ్ ట్విస్ట్. మూడు దశాబ్దాలుగా పాకిస్థాన్‌లోని లియారీలో ఉంటూ, అక్కడి రాజకీయాలను శాసించే కీలక నేతగా ఎదిగిన జమీల్ జమాలి.. చివర్లో తానూ ఒక భారతీయ గూఢచారిని అని రివీల్ చేస్తారు.

ఆ డైలాగ్ లు

గతంలో వచ్చిన మొదటి భాగం 'ధురంధర్' స్లీపర్ హిట్‌గా నిలవగా, ఈ సీక్వెల్ ధురంధర్ 2 మాత్రం బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. దేశీయంగా రూ. 1000 కోట్ల నెట్ వసూళ్లను దాటడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా రూ. 1500 కోట్ల మార్కును అధిగమించింది.

ర‌ణ్‌వీర్ సింగ్, అర్జున్ రాంపాల్ మధ్య వచ్చే పోరాట ఘట్టాలు, ఆర్ మాధవన్, సంజయ్ దత్ వంటి భారీ తారాగణం ఈ సినిమా విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks