...
...
Next Story

Rakul Preet Singh: రామాయణంలో శూర్పణకను సమాజం తప్పుగా అర్థం చేసుకుంది.. రకుల్ ప్రీత్ సింగ్ కామెంట్స్

Rakul Preet Singh About Surpanakha Role Ramayana: 'రామాయణం'లో శూర్పణఖగా కనిపించనున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఈ విలక్షణమైన పాత్రను ఎంచుకోవడానికి గల కారణాలను, అందులోని విభిన్న కోణాలను ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరంగా వెల్లడించారు. శూర్పణఖను సమాజం తప్పుగా అర్థం చేసుకుందన్నారు.

Published on: Oct 30, 2026, 10:40:16 IST
Advertisement

Rakul Preet Singh About Surpanakha Role Ramayana: భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం 'రామాయణం' ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల విడుదలైన రామాయణ పార్ట్ 1 ట్రైలర్ సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది.

శూర్పణక పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్

రామాయణంలో శూర్పణకను సమాజం తప్పుగా అర్థం చేసుకుంది.. రకుల్ ప్రీత్ సింగ్ కామెంట్స్
రామాయణంలో శూర్పణకను సమాజం తప్పుగా అర్థం చేసుకుంది.. రకుల్ ప్రీత్ సింగ్ కామెంట్స్

శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణాసురుడిగా రాకింగ్ స్టార్ యశ్ లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే, ఈ రామాయణం ట్రైలర్‌లో అందరినీ ఆశ్చర్యపరిచిన మరో ఇంట్రెస్టింగ్ విషయం శూర్పణఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ కనిపించడం. పీటీఐ (PTI) వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో శూర్పణఖ పాత్ర గురించి రకుల్ ప్రీత్ సింగ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ఆ పాత్ర ఒప్పుకోవడానికి కారణమిదే!

"మన భారతీయ సంస్కృతిని, మన చరిత్రలోని సత్యాన్ని ప్రపంచ స్థాయి సినిమా ద్వారా అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లడం ఈ సినిమా ప్రత్యేకత. రెండోది, శూర్పణఖ.. సమాజం తప్పుగా అర్థం చేసుకున్న ఒక సంక్లిష్టమైన పాత్ర. రామాయణంలో మహా యుద్ధానికి మూలకారణం ఆమే. విభిన్న కోణాలున్న (షేడ్స్) ఇటువంటి పాత్రలో నటించడం నటిగా నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది" అని రకుల్ తెలిపారు.

అభిమాని లేఖకు భావోద్వేగ స్పందన

గతంలో ఒక అభిమాని రాసిన లేఖను సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' (ట్విట్టర్)లో పంచుకుంటూ రకుల్ ప్రీత్ సింగ్ స్పందించారు. శూర్పణఖ కథ అనగానే చరిత్ర ఆమెను ఒకే ఒక్క ఘటనతో గుర్తుపెట్టుకుందని, కానీ ఆమె జీవితంలో లోతైన నేపథ్యం ఉందన్నారు. "ప్రేక్షకులు శూర్పణఖ పాత్రను విశాల దృక్పథంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా" అని ఆ లేఖలో రకుల్ ప్రీత్ సింగ్ పేర్కొన్నారు.

రూ. 4,000 కోట్ల భారీ బడ్జెట్ అద్భుతం

రామాయణ మొదటి భాగం 2026 నవంబర్ 5న దీపావళి కానుకగా థియేటర్లలోకి రానుంది. రెండో భాగం 2027 దీపావళికి విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ పౌరాణిక దృశ్యకావ్యం ఇండియన్ సినిమా స్టాండర్డ్స్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. 'రామాయణం' సినిమాలో శూర్పణఖ పాత్రలో ఎవరు నటిస్తున్నారు?

ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో శూర్పణఖ పాత్రను ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ పోషిస్తున్నారు.

2. రామాయణం సినిమాలో శ్రీరాముడు, సీత, రావణాసురుడి పాత్రల్లో ఎవరు కనిపిస్తారు?

శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణాసురుడిగా కన్నడ నటుడు యశ్ నటిస్తున్నారు.

3. ఈ సినిమా బడ్జెట్ ఎంత, ఎప్పుడు విడుదల కానుంది?

సుమారు రూ. 4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం మొదటి భాగం 2026 నవంబర్ 5న విడుదల కానుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks