...
...
Next Story

Rakul Preet Singh: ఏడాదిన్నర తర్వాత మళ్లీ జిమ్‌లో వాలిన హాట్ బ్యూటీ.. రకుల్ ప్రీత్ సింగ్ వర్కౌట్ వీడియో వైరల్

Rakul Preet Singh: సోషల్ మీడియాలో తాజాగా హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. చాలా కాలం తర్వాత ఈ బ్యూటీ మళ్లీ జిమ్ లోకి అడుగుపెట్టింది. ఆమె వర్కౌట్ వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

Published on: Sep 6, 2026, 16:54:49 IST
Advertisement

Rakul Preet Singh: ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అత్యంత ఫిట్‌గా ఉండే హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఒకరు. ఆమె తన ఫిట్‌నెస్ ప్రయాణంలో ఎదురైన అతిపెద్ద సవాలుపై సోషల్ మీడియా వేదికగా స్పందించింది. దాదాపు ఏడాదిన్నర సుదీర్ఘ విరామం తర్వాత ఆమె మళ్లీ స్ట్రెంత్ ట్రైనింగ్ (Strength Training) వర్కౌట్లు చేస్తోంది.

రకుల్ ప్రీత్ సింగ్ వైరల్ వీడియో

ఏడాదిన్నర తర్వాత మళ్లీ జిమ్‌లో వాలిన హాట్ బ్యూటీ.. రకుల్ ప్రీత్ సింగ్ వర్కౌట్ వీడియో వైరల్
ఏడాదిన్నర తర్వాత మళ్లీ జిమ్‌లో వాలిన హాట్ బ్యూటీ.. రకుల్ ప్రీత్ సింగ్ వర్కౌట్ వీడియో వైరల్

గతంలో ఎదురైన తీవ్రమైన నడుము గాయం నుంచి కోలుకున్న తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెల్లగా శరీరాన్ని పాత రొటీన్‌కు అలవాటు చేయడం ఎంత కష్టమో వివరిస్తూ ఒక వీడియోను ఆమె షేర్ చేసింది. నడుముకు ప్రొటెక్టివ్ బ్యాక్ సపోర్ట్ బెల్ట్ వేసుకొని ఆమె చేసిన వర్కౌట్ సెషన్ తీవ్రంగా ట్రెండ్ అవుతోంది.

కొత్త ఉద్యోగంలా ఉంది

ఫిట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే రకుల్ ప్రీత్ సింగ్.. ఇటీవల పంచుకున్న వర్కౌట్ వీడియోతో తన అభిమానులను ఆశ్చర్యపరిచింది. తీవ్రమైన నడుము నొప్పి నుంచి కోలుకున్న అనంతరం మళ్లీ బరువులు ఎత్తుతోంది.

"మన సొంత శరీరానికే పాత విద్యలను మళ్లీ నేర్పించడం ఒక కొత్త ఉద్యోగంలో చేరినట్లు అనిపిస్తుందని ఎవరికి తెలుసు? కొన్ని రోజులు శరీరం మనం చెప్పేది వింటుంది, కొన్ని రోజులు బేరాలు ఆడుతుంది, మరికొన్ని రోజులు అసలైన బాస్ ఎవరో గుర్తుచేస్తుంది. ఏదేమైనా.. మనం జిమ్‌లో అడుగుపెట్టాలి, కష్టపడాలి, రేపటి కోసం మళ్లీ సిద్ధమవ్వాలి" అని రకుల్ ప్రీత్ పేర్కొంది.

వర్కౌట్ ఇలా

నడుముపై పడే ఒత్తిడిని నివారించడానికి ప్రొటెక్టివ్ మెడిసినల్ వేస్ట్ బెల్ట్ ధరించి బార్‌బెల్ స్క్వాట్స్, లెగ్ ఎక్స్‌టెన్షన్ మెషిన్ వ్యాయామాలు పూర్తి చేసింది. గతంలో 20 కేజీల కెటిల్‌బెల్ స్వింగ్స్ చేసిన రకుల్, మళ్లీ ఆ స్థాయికి చేరుకోవడానికి ప్రస్తుతం తేలికపాటి బరువులతో ప్రాక్టీస్ చేస్తుంది.

ఏడాదిన్నర బ్రేక్

వర్కౌట్ వీడియోలో రకుల్ నడుముకు బెల్ట్ ధరించడంపై స్పందిస్తూ.. "ఏడాదిన్నర విరామం తర్వాత నేను మళ్లీ నా పాత పొజిషన్‌కు చేరుకోవడానికి ఈ రక్షణ అవసరం. ఎందుకంటే శరీరం గతంలో చేసిన వ్యాయామాలను మళ్లీ కొత్తగా నేర్చుకోవాల్సి వస్తోంది" అని వెల్లడించింది.

గతంలో డెడ్‌లిఫ్ట్‌లో ఏకంగా 65 కేజీల బరువును ఎత్తి అందరినీ ఆశ్చర్యపరిచింది రకుల్. గాయం కారణంగా కోలుకోవడానికి సుదీర్ఘ సమయం పట్టిందని, వైద్యుల సలహా మేరకే సేఫ్టీ గేర్‌తో మళ్లీ వర్కవుట్స్ ప్రారంభించినట్లు పేర్కొంది.

రకుల్ మోటివేషన్

సెలబ్రిటీ అనగానే కేవలం గ్లామర్ మాత్రమే కాదు, దానికి వెనుక ఎంతో క్రమశిక్షణ, నొప్పులను భరించే సహనం ఉంటాయని రకుల్ రీ-ఎంట్రీ వర్కవుట్ నిరూపిస్తోంది. గాయం అని భయపడి కూర్చోకుండా, తగిన ప్రొటెక్షన్ బెల్ట్‌లు ధరించి క్రమంగా కోలుకోవడం ద్వారా తన అభిమానులలో హెల్తీ ఫిట్‌నెస్ మోటివేషన్‌ను రకుల్ ప్రీత్ సింగ్ నింపుతోంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks