...
...
Next Story

చిరంజీవి కొడుకుగా ఉండ‌టం అడ్వాంటేజా? రామ్ చ‌ర‌ణ్ ఇంట్రెస్టింగ్ ఆన్స‌ర్‌-పెద్ది క్యారెక్ట‌ర్‌పై రియాక్షన్ వైరల్

రామ్ చరణ్.. తనదైన యాక్టింగ్ స్టైల్ తో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన నటుడు. చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి మెగా పవర్ స్టార్ గా దూసుకెళ్తున్నారు. చిరంజీవి కొడుకుగా ఉన్న అడ్వాంటేజీ గురించి ప్రశ్నించినప్పుడు చరణ్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ చెప్పాడు.

Published on: Jan 17, 2026, 19:51:45 IST
Advertisement

2022లో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు రామ్ చరణ్. ఇప్పుడు బుచ్చిబాబు సాన డైరెక్షన్ లో చరణ్ ‘పెద్ది’ అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా 'కార్స్ విత్ స్టార్స్' అనే ఆటోమొబైల్ షోలో చిరంజీవి కొడుకు అడ్వాంటేజీ గురించి అడిగిన ప్రశ్నకు ఇంట్రెస్టింగ్ ఆన్సరిచ్చాడు చరణ్.

రామ్ చరణ్ కామెంట్లు

రామ్ చరణ్
రామ్ చరణ్

రామ్ చరణ్ తన సినీ కెరీర్ లోని వైఫల్యాలు, విజయాలను ఎదుర్కోవడంపై ముచ్చటించాడు. తన తండ్రి చిరంజీవి, బాబాయి పవన్ కళ్యాణ్ వంటి అగ్ర నటులున్న కుటుంబ నేపథ్యం తనకు ఒక అడ్వాంటేజ్ అని కూడా ఆయన తెలిపాడు. చిరంజీవి కొడుకుగా ఒక ప్రముఖ కుటుంబ నేపథ్యం నుంచి రావడాన్ని ఎలా చూస్తారని అడిగినప్పుడు, రామ్ చరణ్ దానిని ఒక గొప్ప అడ్వాంటేజ్ అని అభివర్ణించారు.

నిజాయితీగా చెప్పాలంటే

"అలాంటి కుటుంబం నుండి అటువంటి అంతర్దృష్టి, అనుభవం కలిగి ఉండటం ఒక అందమైన అడ్వాంటేజ్. కొత్తగా నటన పాఠశాల నుండి ప్రారంభించే వారికంటే మీరు ప్రతిదీ కొంచెం వేగంగా నేర్చుకుంటారు. నిజాయితీగా చెప్పాలంటే, నేను దానిని ఒక అడ్వాంటేజ్ గానే చూశాను" అని రామ్ చరణ్ అన్నారు. అది భారంగా లేదా అని అడిగినప్పుడు, ఆయన నవ్వి.. "నాకు కష్టంగా అనిపించలేదు. ప్రేక్షకులకు అంగీకరించడం కష్టంగా అనిపించింది" అని బదులిచ్చారు.

మరీ సీరియస్ కాదు

తాను సాధించిన కీర్తిని ఎలా స్వీకరిస్తారని అడిగినప్పుడు, రామ్ చరణ్.. "నిజాయితీగా చెప్పాలంటే నన్ను నేను మరీ సీరియస్ గా తీసుకోను. ఉదయం 8 నుండి సాయంత్రం 6 వరకు నేను నా పనిని చాలా ఆసక్తితో చేస్తా. ఆ తర్వాత నన్ను నేను మర్చిపోతా. నా విజయాల గురించి నేను ఎక్కువగా ఆలోచించను" అని చరణ్ చెప్పారు. అయితే, వైఫల్యాల గురించి అడిగినప్పుడు.. "వైఫల్యాలు కష్టమైనవి. అవి మిమ్మల్ని ఒక మెట్టు వెనక్కి నెడతాయి" అని బదులిచ్చారు.

అదే ఇంట్రెస్టింగ్

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks