Ram Charan: మా అమ్మాయి అతనికి కార్బన్ కాపీలా ఉంటుంది: చిరంజీవి షేర్ చేసిన ఫొటోపై ఉపాసన కామెంట్
Ram Charan:
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మార్చి 27న తన 41వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా అతనికి ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యాన్స్, ఫ్రెండ్స్ నుంచి బర్త్‌డే విషెస్ వెల్లువెత్తాయి. అయితే చరణ్ భార్య ఉపాసన కొణిదెల మాత్రం ఫ్యాన్స్‌కు ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చింది. రీసెంట్‌గా పుట్టిన తమ కవల పిల్లల్లో పాప అయిన అన్వీర చూడటానికి అచ్చం ఎలా ఉంటుందో ఆమె రివీల్ చేసింది.

తమ పిల్లల ఫేస్‌లను బయటకు చూపించడానికి ఈ జంట సాధారణంగా ఇష్టపడరు కాబట్టి, ఉపాసన ఇచ్చిన ఈ చిన్న హింట్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా పెద్ది సినిమా నుంచి రిలీజైన గ్లింప్స్‌లో అతడు పహిల్వాన్ లుక్‌లో కనిపించి అందరినీ సర్ప్రైజ్ చేశాడు. క్రికెట్ బ్యాక్‌డ్రాప్ నుంచి ఈ కుస్తీ ఏంటి అని ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతూనే, బహుశా చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడేమో అని గెస్ చేస్తున్నారు.
చిరంజీవి ఎమోషనల్ పోస్ట్.. ఉపాసన రియాక్షన్ ఇదీ..
శుక్రవారం (మార్చి 27) నాడు మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియాలో రామ్ చరణ్ చిన్నప్పటి రేర్ ఫోటోలను షేర్ చేస్తూ కొడుకుకు బర్త్‌డే విషెస్ చెప్పాడు. ఆ ఫోటోలు పోస్ట్ చేస్తూ.. చరణ్ బాబు, చిన్నప్పుడు నా చేయి పట్టుకుని నడిచిన స్థాయి నుంచి ఈరోజు ఎంతోమందికి ఇన్‌స్పిరేషన్‌గా మారిన నీ జర్నీ చూస్తుంటే నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది అని చిరు ఎమోషనల్ అయ్యాడు.
సినిమాలను, పర్సనల్ లైఫ్‌ను నువ్వు బ్యాలెన్స్ చేసే విధానం, ఫ్యామిలీ పట్ల నీకున్న బాధ్యత, దేవుడి మీద నీకున్న భక్తి, నీ క్రమశిక్షణ, విలువలన్నీ చూస్తుంటే నీ మీద నాకున్న ప్రేమ, అభిమానం మరింత పెరుగుతున్నాయి అని చిరు రాసుకొచ్చాడు. దేవుడి ఆశీస్సులు, అభిమానుల ప్రేమ నిన్ను ఎప్పుడూ ఇంకా ఉన్నత శిఖరాలకు చేర్చాలని కోరుకుంటూ, హ్యాపీ బర్త్‌డే డియర్ రామ్ చరణ్ అని చిరంజీవి తన నోట్‌ను ముగించాడు.
ఆ మూడో ఫొటో కార్బన్ కాపీలా..
ఆ ఫోటోల్లో చిన్నప్పటి చరణ్‌కు చిరంజీవి కేక్ తినిపించడం, హత్తుకోవడం, వాళ్లు వెకేషన్స్‌లో ఉన్న మూమెంట్స్ భలే క్యూట్‌గా ఉన్నాయి. అయితే అందులో ఒక ఫోటో ఉపాసన దృష్టిని బాగా ఆకర్షించింది. చిరంజీవి, చరణ్ ఇద్దరూ నవ్వుతూ చేయి పట్టుకుని ఉన్న మూడో ఫోటో కింద ఆమె కామెంట్ చేస్తూ.. అన్వీర అచ్చం ఈ థర్డ్ పిక్‌లో ఉన్నట్లే కార్బన్ కాపీలా ఉంది అని రాసుకొచ్చింది.
తమ చిన్న కూతురు ఎలా ఉంటుందో ఉపాసన ఒక హింట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ కామెంట్ కింద వాళ్లు హార్ట్ ఎమోజీలతో తమ ప్రేమను కురిపిస్తున్నారు. ముగ్గురు పిల్లలను ఎప్పుడెప్పుడు చూస్తామా అని వెయిట్ చేస్తున్నాం అంటూ ఒక అభిమాని కామెంట్ చేశాడు.
రామ్ చరణ్, ఉపాసన కవల పిల్లలు..
రామ్ చరణ్, ఉపాసనలకు 2011లో హైదరాబాద్‌లో ఎంగేజ్‌మెంట్ జరగ్గా, 2012లో వాళ్లు పెళ్లి పీటలెక్కారు. వాళ్ల మొదటి సంతానంగా 2023లో క్లీంకార జన్మించింది. ఆ తర్వాత 2026 జనవరిలో ఉపాసన కవల పిల్లలకు జన్మనిచ్చింది. అందులో ఒక బాబు, ఒక పాప ఉన్నారు. వాళ్ల పేర్లను శివ రామ్ కొణిదెల, అన్వీర దేవి కొణిదెల అని ఫిబ్రవరిలో అనౌన్స్ చేస్తూ చిరంజీవి ఒక పోస్ట్ పెట్టాడు.
ఎంతో ఆనందంతో, దేవుడి దయతో మా ఇద్దరు చిట్టి ఆశీర్వాదాలకు బ్యూటిఫుల్ పేర్లు పెట్టాం అని ఆయన చెప్పాడు. తన అసలు పేరు శివ శంకర వర ప్రసాద్‌లోని శివ, అలాగే రామ్ చరణ్‌లోని రామ్ కలిసొచ్చేలా బాబుకు ఆ పేరు పెట్టామని, కనక దుర్గా దేవి స్ఫూర్తితో పాపకు అన్వీర దేవి అని నామకరణం చేశామని చిరు క్లారిటీ ఇచ్చాడు.
ఇక చరణ్ సినిమాల విషయానికొస్తే.. 2025లో డైరెక్టర్ శంకర్ తో చేసిన గేమ్ చేంజర్ సినిమాతో అతడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఇప్పుడు బుచ్చిబాబు సానా డైరెక్షన్‌లో వస్తున్న స్పోర్ట్స్ డ్రామా పెద్ది సినిమాలో ఆయన నటిస్తున్నాడు. ఇందులో జాన్వీ కపూర్, శివ రాజ్‌కుమార్ లాంటి స్టార్లు కూడా ఉన్నారు. ఈ సినిమా ఏప్రిల్ 30న థియేటర్లలోకి రాబోతోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


