చిరుత కోసం కాదు-రామ్‌చరణ్ ఫస్ట్ టైమ్ కెమెరా ముందు యాక్టింగ్-శ్రియాతో రొమాంటిక్ సీన్-ఇబ్బంది పడ్డ హీరో-వీడియో వైరల్
రామ్ చరణ్ 2007లో 'చిరుత' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అతను అంతకంటే ముందు కెెమెరా ముందు తొలిసారి యాక్టింగ్ చేసిన వీడియో ఒకటి బయటకొచ్చింది. శ్రియా శరణ్ తో కలిసి రొమాంటిక్ సీన్ చేశాడు. ఇందులో చెర్రీ ఇబ్బంది పడ్డాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.
2007లో వచ్చిన 'చిరుత' సినిమాతో తెరంగేట్రం చేశాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. అయితే ఈ మూవీ కోసం కాకుండా ఫస్ట్ టైమ్ కెమెరా ముందు యాక్టింగ్ చేసిన చెర్రీ వీడియో ఒకటి వైరల్ గా మారింది. శ్రియా శరణ్ తో అతను ఓ రొమాంటిక్ సీన్ చేశాడు. ఇందులో చరణ్ చాలా ఇబ్బందికరంగా కనిపించాడు. అతని లుక్ చూస్తే ఇప్పటి చరణ్ అంటే ఎవరూ నమ్మలేరు.

చరణ్ యాక్టింగ్ వీడియో
రామ్ చరణ్, శ్రియా శరణ్ కు సంబంధించిన వీడియోను ఓ యాక్టింగ్ ఇన్ట్సిట్యూట్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. అతను మొదటిసారి కెమెరాను ఎదుర్కొన్నప్పుడు ఇబ్బందికరంగా, అసౌకర్యంగా ఉన్నట్లు వీడియోలో కనిపించింది. వీడియోలో అతను అప్పటికే స్టార్ గా ఉన్న శ్రియా శరణ్ తో కలిసి నటించాడు.
ఈ వీడియోలో రామ్ చరణ్, శ్రియ హిందీలో రొమాంటిక్ సన్నివేశంలో నటించారు. శ్రియ కొంత కంఫర్ట్ గా కనిపించినప్పటికీ, రామ్ తన డైలాగ్ చెప్పేటప్పుడు, తన సన్నివేశాలను నటిస్తున్నప్పుడు సిగ్గుపడతాడు. అసౌకర్యంగా కనిపించాడు. ఈ సన్నివేశానికి సంబంధించిన రెండు వేర్వేరు వీడియోలను తమ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది యాక్టింగ్ ఇన్ట్సిట్యూట్.
రామ్ చరణ్ ఇబ్బందిగా
యాక్టింగ్ కోచ్ కిషోర్ నమిత్ కపూర్ ఈ వీడియో గురించి మాట్లాడారు. దాని షూటింగ్ సమయంలో రామ్ ఇబ్బందికరంగా ఉన్నాడని, శ్రియ ఇంకా ఎలా నటించాలో నేర్చుకుంటోందని అంగీకరించారు. "మేము రామ్ చరణ్, శ్రియా శరణ్ లతో కలిసి ఒక సన్నివేశాన్ని చిత్రీకరించాము. కెమెరా ముందు ఇది అతని మొదటి సన్నివేశం. నిజానికి అతను చాలా ఇబ్బందిపడ్డాడు "అని అతను చెప్పాడు.
"శ్రియ అప్పటికే దక్షిణాదిలో భారీ స్టార్. ఆమె అప్పటికే సినిమాల్లో నటించింది. కానీ ఆమె శిక్షణ తీసుకున్న తరువాత మరింత బెటర్ గా మారిందని నమ్ముతాను. నేను దర్శకుడిని అయితే ఆమె బాగా నటించిందని అంగీకరించను. కానీ నేను కోచ్ కాబట్టి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చా’’ అని నమిత్ తెలిపాడు. 2001 లో ఇష్టం మూవీతో శ్రియా డెబ్యూ చేసిన సంగతి తెలిసిందే.
ఫ్యాన్స్ రియాక్షన్
ఈ వీడియోలో రామ్, శ్రియ కలిసి నటించడమే కాకుండా, అతను ఎంత డిఫరెంట్ గా, యంగ్ గా కనిపించాడో అని అభిమానులు ఆశ్చర్యపోయారు. "ఏం చేస్తున్నామో? (అతను ఎందుకు అలా కనిపిస్తాడు?)" ఒక ఇన్ స్టాగ్రామ్ యూజర్ వ్యాఖ్యానించారు. ఒక అభిమాని ఏమో "అతని రూపం గురించి ఎవరు వ్యాఖ్యానిస్తున్నారో, నేను వాళ్ల హైస్కూల్ ఫొటోలను చూడాలనుకుంటున్నాను" అని రాశాడు. మరికొందరు అతను ఇప్పుడు అత్యంత డిమాండ్ ఉన్న స్టార్ అని ఎత్తి చూపారు. మరొక అభిమాని అతన్ని 'గ్రేస్ గాడ్' అని పిలిచాడు. కొందరు శ్రియాను 'యాక్టింగ్ క్వీన్', 'ఏజ్ లెస్' అని పిలిచారు.
పెద్ది సినిమాతో
కియారా అద్వానీతో కలిసి నటించిన గేమ్ ఛేంజర్ మూవీనే రామ్ చరణ్ లాస్ట్ సినిమా. దీనికి శంకర్ డైరెక్టర్. ప్రస్తుతం బుచ్చిబాబు సనా దర్శకత్వంలో పెద్ది చిత్రంలో నటిస్తున్నాడు చరణ్. శ్రియ ఇటీవలే కార్తీక్ ఘట్టంనేని దర్శకత్వం వహించిన మిరాయ్ లో మెరిసింది. అయితే రామ్, శ్రియ ఇప్పటివరకూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోలేదు. ఆర్ఆర్ఆర్ ఫ్లాష్ బ్యాక్ లో మాత్రం చరణ్ కు తల్లిగా శ్రియా నటించింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


