Ram Charan: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లోని ఆయన నివాసం వద్ద పండగ వాతావరణం నెలకొంది. తమ అభిమాన నటుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి వేలాదిమంది అభిమానులు మెగాస్టార్ ఇంటికి తరలివచ్చారు.
రామ్ చరణ్ సర్ ప్రైజ్

ఇవాళ (ఆగస్టు 22) మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే. ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చిరంజీవి కోసం ఆయన ఇంటికి భారీగా అభిమానులు తరలివచ్చారు. వాళ్లకు రామ్ చరణ్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఫ్యాన్స్ ను చరణ్ కలిశారు.
ఫ్యాన్స్ ను కలిసి
ఈ క్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్వయంగా తన నివాసం బయటకు వచ్చి అభిమానులను పలకరించారు. గేటు వద్ద వేచి ఉన్న జనసందోహాన్ని చూసి ఆయన చేతులు జోడించి అభివాదం చేశారు. రామ్ చరణ్ బయటకు రాగానే అభిమానులు 'మెగాస్టార్', 'జై చరణ్' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
అభిమానులు హ్యాపీ
ప్రతి సంవత్సరం చిరంజీవి పుట్టినరోజు నాడు అభిమానులు భారీ సంఖ్యలో వచ్చి శుభాకాంక్షలు తెలపడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా అభిమానులు చూపించిన ప్రేమానురాగాలకు రామ్ చరణ్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. చరణ్ స్వయంగా బయటకు వచ్చి అభివాదం చేయడంతో అభిమానుల ఉత్సాహం రెట్టింపైంది.
చిరంజీవి దేవుడు
చిరంజీవి ఇంటికి గబ్బర్ సింగ్ నటులు కూడా వచ్చారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ చేయిని పట్టుకుని ఆ నటులు ఎమోషనల్ అయ్యారు. వాళ్లలో ఒకరైన రమేష్ తీవ్రమైన అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆ రమేష్ కు సడెన్ గా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అతని ట్రీట్మెంట్ కోసం చిరంజీవి రూ.3 లక్షలు సాయం చేశారు.
{{/usCountry}}చిరంజీవి ఇంటికి గబ్బర్ సింగ్ నటులు కూడా వచ్చారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ చేయిని పట్టుకుని ఆ నటులు ఎమోషనల్ అయ్యారు. వాళ్లలో ఒకరైన రమేష్ తీవ్రమైన అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆ రమేష్ కు సడెన్ గా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అతని ట్రీట్మెంట్ కోసం చిరంజీవి రూ.3 లక్షలు సాయం చేశారు.
{{/usCountry}}నాగబాబు ఏమో రూ.2 లక్షలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో చిరంజీవి దేవుడు అంటూ గబ్బర్ సింగ్ నటులు రామ్ చరణ్ చేతిని పట్టుకొని ఎమోషనల్ అయ్యారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
మెగాస్టార్ బర్త్ డే
చిరంజీవి 71వ బర్త్ డే సందర్బంగా ఫ్యాన్స్, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అందరూ విషెస్ చెప్తున్నారు. టాలీవుడు స్టార్లు కూడా మెగాస్టార్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. బర్త్ డే సందర్బంగా చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్న మూవీ టైటిల్ రివీల్ చేశారు. ఈ సినిమాకు ‘కాకా’ అనే టైటిల్ పెట్టారు.