...
...
Next Story

ట్రంప్ జూనియర్‌తో రామ్ చరణ్ ముచ్చట్లు.. ఉదయ్‌పూర్ పెళ్లి వేడుకలో స్పెషల్ అట్రాక్షన్‌గా గ్లోబల్ స్టార్

రామ్ చరణ్, ట్రంప్ జూనియర్ ముచ్చట్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉదయ్‌పూర్ లో నేత్రా మంతెన పెళ్లి వేడుకకు హాజరైన ఈ గ్లోబల్ స్టార్ అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలవడం విశేషం.

Published on: Nov 24, 2025, 17:53:25 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

నేత్ర మంతెన, వంశీ గదిరాజు పెళ్లి కొన్ని రోజులుగా ప్రముఖంగా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఉదయ్‌పూర్‌లో జరిగిన ఈ వివాహ వేడుకకు పలువురు అంతర్జాతీయ ప్రముఖులు హాజరయ్యారు. నవంబర్ 23న జరిగిన ఈ పెళ్లికి టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా వెళ్లాడు. అతనితో పాటు జెన్నిఫర్ లోపెజ్, రణ్‌వీర్ సింగ్, జాన్వీ కపూర్ వంటి ప్రముఖులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ వివాహంలో రామ్ చరణ్ పాల్గొన్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి.

రామ్ చరణ్, డోనాల్డ్ ట్రంప్ జూనియర్‌తో సంభాషణ

ట్రంప్ జూనియర్‌తో రామ్ చరణ్ ముచ్చట్లు.. ఉదయ్‌పూర్ పెళ్లి వేడుకలో స్పెషల్ అట్రాక్షన్‌గా గ్లోబల్ స్టార్
ట్రంప్ జూనియర్‌తో రామ్ చరణ్ ముచ్చట్లు.. ఉదయ్‌పూర్ పెళ్లి వేడుకలో స్పెషల్ అట్రాక్షన్‌గా గ్లోబల్ స్టార్

ఈ పెళ్లి వేడుకకు ఎంతో మంది సెలబ్రిటీలు వచ్చినా.. రామ్ చరణ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. చరణ్ పొడవాటి జుట్టు వదిలేసి, డార్క్ సూట్‌లో స్టైలిష్‌గా కనిపించాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ తో రామ్ చరణ్ సంభాషిస్తున్న ఫొటోలు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఒక ఫోటోలో ట్రంప్ జూనియర్, రామ్ చరణ్ భుజంపై చేయి వేసి పోజులిచ్చారు.

పెళ్లి వీడియోలో రామ్ చరణ్ ఐఫా సహ వ్యవస్థాపకుడు ఆండ్రే టిమ్మిన్స్ తో కలిసి నడుస్తూ, ఇతర అతిథులను పలకరిస్తూ కనిపించాడు. మరో ఫోటోలో చరణ్, ఆండ్రే ఇద్దరూ నవ్వుతూ ఫోటోకు పోజులిచ్చారు. అమెరికాకు చెందిన పారిశ్రామికవేత్త రాజు రామలింగ మంతెన కూతురే నేత్ర. వంశీ గదిరాజు ఓ ఎన్‌ఆర్‌ఐ. ఈ వేడుకకు టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ హాజరవ్వడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ, ఆ చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.

వివాహ వేడుక విశేషాలు

నేత్ర మంతెన-వంశీ గదిరాజు వివాహ వేడుకల్లో భాగంగా జరిగిన సంగీత్ వేడుకకు కరణ్ జోహార్, సోఫీ చౌదరి హోస్ట్‌గా వ్యవహరించారు. ఇందులో రణ్‌వీర్ సింగ్, జాన్వీ కపూర్, కృతి సనన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, జెన్నిఫర్ లోపెజ్, వరుణ్ ధావన్, షాహిద్ కపూర్ వంటి బాలీవుడ్ ప్రముఖులు డ్యాన్స్ ప్రదర్శనలు ఇచ్చారు. ఇక రామ్ చరణ్ మాత్రం గెస్టుగా పెళ్లికి వెళ్లాడు.

ప్రస్తుతం అతడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రాబోతున్న 'పెద్ది' సినిమా షూటింగ్‌లో ఉన్నాడు. ఇందులో జాన్వీ కపూర్ అతని సరసన నటిస్తోంది. అలాగే నిఖిల్ సిద్ధార్థ నటించిన 'ది ఇండియా హౌస్' చిత్రానికి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe