...
...
Next Story

Ram Charan Peddi : మెగా పవర్​ స్టార్ రామ్​చరణ్​ నెట్​ వర్త్ ఎంతో తెలుసా? 'పెద్ది'కి 100 కోట్ల రెమ్యూనరేషన్?

Ram Charan net worth : మెగా పవర్​ స్టార్ రామ్​చరణ్ నెట్​ వర్త్​ ఎంతో తెలుసా? ఆయన రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? అసలు ఆయన గ్యారేజ్​లో ఎన్ని లగ్జరీ కార్లు ఉన్నాయో తెలుసా? వీటితో పాటు రామ్​చరణ్​ వ్యాపార సామ్రాజ్యం గురించి సైతం ఆసక్తికర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jun 4, 2026, 06:43:14 IST
Advertisement

‘చిరుత’ చిత్రంతో అడుగుపెట్టి.. నేడు గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన నటుడు.. మెగా పవర్​స్టార్ రామ్​చరణ్ తేజ. దాదాపు రెండు దశాబ్దాల సినీ ప్రయాణంలో మగధీర, ధృవ, రంగస్థలం, ఆర్‌ఆర్‌ఆర్ వంటి ఇండస్ట్రీ హిట్లతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన ‘పెద్ది’ సినిమా ప్రీమియర్ షోలకు బ్లాక్​బాస్టర్​ టాక్​ వచ్చింది. అయితే రామ్​చరణ్ కేవలం నటుడే కాదు.. సమర్థుడైన వ్యాపారవేత్త కూడా! సినిమా పారితోషికం, విలాసవంతమైన కార్లు, ప్రొడక్షన్ హౌస్‌లు, ఇతర ఇన్వెస్ట్‌మెంట్లతో కలిపి రామ్​చరణ్‌కు ఉన్న "మైండ్ బ్లోయింగ్" ఆస్తి వివరాల గురించి ఇక్కడ తెలుసుకోండి..

పెద్ది రామ్​చరణ్ నెట్ వర్త్..

మెగా పవర్​ స్టార్ రామ్​చరణ్..
మెగా పవర్​ స్టార్ రామ్​చరణ్..

టాలీవుడ్‌లో అత్యంత క్రేజ్, మార్కెట్ ఉన్న నటుల్లో రామ్​చరణ్ ఒకరు. ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి తనయుడు.. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నారు.

రామ్​చరణ్ ఆస్తి విలువ సుమారు రూ. 1,300 కోట్ల నుంచి రూ. 1,400 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఆయన సంపాదనలో సింహభాగం సినిమాల ద్వారా వస్తున్నప్పటికీ.. దీర్ఘకాలిక పెట్టుబడులు, విభిన్న వ్యాపార సామ్రాజ్యం కూడా ఈ స్థాయి సంపదకు కారణమయ్యాయి. ఈ భారీ నెట్ వర్త్‌తో భారతదేశంలోనే అత్యంత సంపన్న నటుల్లో ఒకరిగా ఈ పెద్ది హీరో నిలిచారు.

పెద్ది రామ్​చరణ్ రెమ్యునరేషన్!

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటనకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా చరణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆర్‌ఆర్‌ఆర్ సాధించిన సంచలన విజయం తర్వాత చరణ్ తన పారితోషికాన్ని భారీగా పెంచినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఆయన ఒక్కో సినిమాకు రూ. 80 కోట్ల నుంచి రూ. 100 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

కోట్ల విలువైన లగ్జరీ కార్ల కలెక్షన్..

వీటితో పాటు రూ. 1.75 కోట్ల బీఎండబ్ల్యూ 7 సిరీస్, మెర్సిడెస్ మేబ్యాక్ జీఎల్ఎస్ 600, రేంజ్ రోవర్ వోగ్ (రూ. 2.75 కోట్లు), ఆడి క్యూ7 (రూ. 70 లక్షలు), మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ 350డి (రూ. 60 లక్షలు) వంటి కార్లు ఆయన కలెక్షన్‌లో ఉన్నాయి.

యాడ్స్ అండ్ ప్రొడక్షన్ హౌస్ వ్యాపారాలు!

సినిమాలతో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు పెద్ది స్టార్ రామ్​చరణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఒక్కో ప్రకటన కోసం ఆయన రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం.

బిజినెస్ మైండ్ ఉన్న చరణ్ స్వయంగా రెండు నిర్మాణ సంస్థలను స్థాపించారు. 2016లో ప్రారంభించిన 'కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ' బ్యానర్‌పై ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి, ఆచార్య వంటి భారీ చిత్రాలను నిర్మించారు. దీనితో పాటు విక్రమ్ రెడ్డితో కలిసి 'వి మెగా పిక్చర్స్' అనే మరో నిర్మాణ సంస్థను ప్రారంభించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌తో కలిసి వీరు నిర్మిస్తున్న 'ది ఇండియా హౌస్' ఈ బ్యానర్ నుంచి వస్తున్న మొదటి చిత్రం.

పెద్ది ట్విట్టర్ రివ్యూ తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

హైదరాబాద్‌లో లగ్జరీ బంగ్లా

హైదరాబాద్‌లోని అత్యంత విలాసవంతమైన జూబ్లీహిల్స్‌లో రామ్​చరణ్‌కు రూ. 30 కోట్ల విలువైన విలాసవంతమైన బంగ్లా ఉంది. ఆధునిక వసతులు, అద్భుతమైన ఇంటీరియర్స్‌తో ఈ ఇల్లు ఉంటుంది. దీనితో పాటు ఆయనకు కొన్ని ఫార్మ్‌హౌస్‌లు, కమర్షియల్ రియల్ ఎస్టేట్ ల్యాండ్స్ కూడా ఉన్నట్లు సమాచారం.

వ్యాపార పెట్టుబడులు..

రామ్​చరణ్ పెట్టుబడులు కేవలం సినిమాలకే పరిమితం కాలేదు. ఆయనకు క్రీడలు, ఇతర రంగాల్లోనూ బిజినెస్ పోర్ట్‌ఫోలియో ఉంది:

2011లోనే ‘హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్’ పేరిట ఒక పోలో టీమ్‌ను కొనుగోలు చేశారు.

2013లో వంకాయలపాటి ఉమేష్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుని 'టర్బో మేఘా ఎయిర్‌వేస్ ప్రైవేట్ లిమిటెడ్' అనే ప్రాంతీయ విమానయాన సంస్థను ప్రారంభించారు. దీనిని 'ట్రూజెట్' బ్రాండ్ పేరుతో నడిపారు (ఈ సంస్థ కార్యకలాపాలు 2022లో నిలిచిపోయాయి).

ప్రముఖ అడ్వెంచర్ స్పోర్ట్స్ సిరీస్ ‘డెవిల్స్ సర్క్యూట్’ లో కూడా ఆయనకు భాగస్వామ్యం ఉంది.

వీటితో పాటు, ఆయన భార్య ఉపాసన కొణిదెల తాతగారైన ప్రతాప్ చంద్రరెడ్డి స్థాపించిన ప్రసిద్ధ 'అపోలో హాస్పిటల్స్' లో కూడా చరణ్ భారీగా పెట్టుబడులు పెట్టినట్లు నివేదికలు చెబుతున్నాయి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe