Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ లీడ్ రోల్స్ లో నటించిన పెద్ది మూవీ ట్రైలర్ సోమవారం (మే 18) రిలీజైన విషయం తెలిసిందే. ఇందులో ఓ క్రికెటర్, రెజ్లర్, రన్నర్ పాత్రల్లో కనిపించిన చరణ్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
ఇది బుచ్చి ఇచ్చిన గిఫ్ట్

పెద్ది ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రామ్ చరణ్ మాట్లాడుతుండగా.. అతని చేతికి తగిలిన గాయం గురించి అభిమానులు అడిగారు. దీనికి చరణ్ స్పందిస్తూ.. “నా చేయి బాగానే ఉంది. ఇది బుచ్చిబాబు ఇచ్చిన చిన్న గిఫ్ట్. చివరి 25, 30 రోజులుగా కుస్తీ షూటింగ్ చేస్తున్నాం. పెహల్వాన్ లు షూటింగ్ సమయంలో చాలా గట్టిగా చేయి పట్టుకున్నారు. దీంతో కాస్త గాయమైంది. ఇది పెద్ది ఇచ్చిన ఓ మరుపురాని జ్ఙాపకం” అని చరణ్ అనడం విశేషం.
సల్మాన్, ఆమిర్‌లకు థ్యాంక్స్
ఇక పెద్ది సినిమా కోసం తాను చేసిన బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ గురించి కూడా చరణ్ స్పందించాడు. ఈ సందర్భంగా సుల్తాన్, దంగల్ వంటి రెజ్లింగ్ నేపథ్యంలో సాగే సినిమాలను ఇచ్చిన సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ లకు అతడు థ్యాంక్స్ చెప్పాడు. ఇలాంటి సినిమాలు చేసేందుకు తమలాంటి వాళ్లకు వాళ్లే ఓ దారి చూపించారని అతడు అనడం విశేషం. అయితే ఇది అంత సులువుగా జరగలేదని, చాలా కష్టపడాల్సి వచ్చిందని, చాలా గాయాలు కూడా అయ్యాయని చరణ్ తెలిపాడు.
తన గుర్తింపు కోసం చేసే ప్రయాణం
ఇక పెద్ది మూవీ స్టోరీ గురించి కూడా చరణ్ రివీల్ చేశాడు. తాను రెండేళ్లుగా పడిన కష్టమంతా బుచ్చిబాబు రాసిన కథ ముందు చిన్నదే అని అన్నాడు. ఈ సినిమా పెద్ది అనే వ్యక్తి తన గుర్తింపు కోసం సాగించే ప్రయాణం చుట్టూ తిరుగుతుందని తెలిపాడు. ప్రతి ఒక్కరికీ ఓ గుర్తింపు ఉండాలని కోరుకుంటారని, పెద్ది కూడా అలాంటివాడే అని, ఈ సినిమాలో అతడు ఎందుకు ఓ క్రాస్ ఓవర్ అథ్లెట్ గా మారాడో చూడొచ్చని రామ్ చరణ్ అన్నాడు.
ఇంత శ్రద్ధ ఉన్న వ్యక్తిని చూడలేదు
{{/usCountry}}ఇక పెద్ది మూవీ స్టోరీ గురించి కూడా చరణ్ రివీల్ చేశాడు. తాను రెండేళ్లుగా పడిన కష్టమంతా బుచ్చిబాబు రాసిన కథ ముందు చిన్నదే అని అన్నాడు. ఈ సినిమా పెద్ది అనే వ్యక్తి తన గుర్తింపు కోసం సాగించే ప్రయాణం చుట్టూ తిరుగుతుందని తెలిపాడు. ప్రతి ఒక్కరికీ ఓ గుర్తింపు ఉండాలని కోరుకుంటారని, పెద్ది కూడా అలాంటివాడే అని, ఈ సినిమాలో అతడు ఎందుకు ఓ క్రాస్ ఓవర్ అథ్లెట్ గా మారాడో చూడొచ్చని రామ్ చరణ్ అన్నాడు.
ఇంత శ్రద్ధ ఉన్న వ్యక్తిని చూడలేదు
{{/usCountry}}పెద్ది మూవీలో హీరోయిన్ గా చేసిన జాన్వీ కపూర్ పైనా చరణ్ ప్రశంసల వర్షం కురిపించాడు. తన జీవితంలో ఇంత శ్రద్ధ ఉన్న వ్యక్తిని చూడలేదని, ముంబైలో ఉంటూనే మూవీలో ప్రతి సీన్ ను పక్కాగా రిహార్స్ చేసేదని చరణ్ చెప్పాడు. చివరి రోజు ఓ పాట షూటింగ్ చేశామని, అందులో తనకంటే జాన్వీయే బాగా చేసిందని అనడం విశేషం.
పెద్ది ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో జరిగిన విషయం తెలిసిందే. ఈ మూవీ జూన్ 4న రిలీజ్ కానుండగా.. మే 23న మధ్యప్రదేశ్ లో మరో మెగా ఈవెంట్ ప్లాన్ చేశారు.