...
...
Next Story

Peddi Box Office: ఇండియాలో 200 కోట్లను జస్ట్‌లో మిస్ అయిన పెద్ది కలెక్షన్స్- కారణం ఇదే! జగపతి బాబు ఏమన్నారంటే?

Peddi Box Office Collection Day 8: రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సాన కాంబినేషన్‌లో వచ్చిన రా అండ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్ల మార్క్‌ను జస్ట్‌లో మిస్ అయింది. ఇందుకు గల కారణాలు, పెద్దిపై వచ్చిన ట్రోలింగ్, విమర్శలపై జగపతి బాబు ఏమన్నారో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Jun 12, 2026, 09:45:09 IST
Advertisement

Peddi 8 Days Worldwide Box Office Collection: 'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్‌లో మంచి ఎంట్రీ హిట్ అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు సాన, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' థియేటర్లలో కలెక్షన్ల సంచలనం సృష్టిస్తోంది.

తగ్గుముఖం పట్టిన కలెక్షన్స్

ఇండియాలో 200 కోట్లను జస్ట్‌లో మిస్ అయిన పెద్ది కలెక్షన్స్- కారణం ఇదే! జగపతి బాబు ఏమన్నారంటే?
ఇండియాలో 200 కోట్లను జస్ట్‌లో మిస్ అయిన పెద్ది కలెక్షన్స్- కారణం ఇదే! జగపతి బాబు ఏమన్నారంటే?

భారీ అంచనాల మధ్య జూన్ 4న విడుదలైన పెద్ది చిత్రం మొదటి వారం రోజులు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను రాబట్టింది. అయితే, వీకెండ్‌లో కనిపించిన అసాధారణమైన జోరుతో పోలిస్తే వర్కింగ్ డేస్‌లో కలెక్షన్లు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. అయినప్పటికీ, ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ ఇండియన్ చిత్రంగా నిలిచి 'పెద్ది' సరికొత్త రికార్డు సృష్టించింది.

రూ. 200 కోట్ల క్లబ్‌కు అడుగు దూరంలో..

ప్రముఖ ట్రేడ్ వెబ్‌సైట్ సాక్‌నిల్క్ (Sacnilk) సమాచారం ప్రకారం.. 'పెద్ది' చిత్రానికి జూన్ 11 గురువారం (ఎనిమిదో రోజు) దేశీయంగా రూ. 6.30 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. దీంతో ఈ సినిమా ఎనిమిది రోజుల మొత్తం భారతీయ నెట్ కలెక్షన్లు రూ. 193.55 కోట్లకు చేరుకున్నాయి.

పెద్ది సినిమాకు ఇండస్ట్రీలో ఉన్న భారీ క్రేజ్ దృష్ట్యా మొదటి వారంలోనే రూ. 200 కోట్ల మార్కును అందుకుంటుందని భావించినా, కలెక్షన్లు కొద్దిగా మందగించడంతో తృటిలో ఆ మైలురాయి మిస్ అయింది. రానున్న సెకండ్ వీకెండ్ అడ్వాంటేజ్‌తో ఈ చిత్రం ఈజీగా రూ. 200 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టనుంది.

ప్రస్తుతానికి కోలీవుడ్ హిట్ చిత్రం 'కరుప్పు' రికార్డులను బ్రేక్ చేసి ఈ ఏడాది బిగ్గెస్ట్ సౌత్ ఇండియన్ గ్రాసర్‌గా నిలిచింది పెద్ది. కాగా, వరల్డ్ వైడ్‌గా 8 రోజుల్లో రూ. 345 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మాత్రం రాబట్టింది పెద్ది. ఈ సినిమా ప్రీమియర్ షోల ద్వారానే రూ. 18.50 కోట్ల భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. ఆ తర్వాత మొదటి రోజు రూ. 51 కోట్ల గ్రాండ్ ఓపెనింగ్‌తో బాక్సాఫీస్ ప్రయాణాన్ని ప్రారంభించింది.

శుక్రవారం రూ. 26.90 కోట్లు, శనివారం రూ. 29.10 కోట్లు, ఆదివారం రూ. 32.15 కోట్లతో వారాంతంలో థియేటర్లను హౌస్‌ఫుల్ బోర్డులతో నింపేసింది. సోమవారం వర్కింగ్ డే కావడంతో వసూళ్లలో సాధారణ తగ్గుదల కనిపించింది. సోమవారం రూ. 12.35 కోట్లు రాగా, మంగళవారం రూ. 9.70 కోట్లు, బుధవారం రూ. 7.55 కోట్లు వసూలయ్యాయి.

వివాదాలు.. విమర్శలపై జగపతి బాబు స్ట్రాంగ్ కౌంటర్

ఈ సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్రను మితిమీరిన గ్లామరస్‌గా (హైపర్ సెక్సువలైజేషన్) చూపించారంటూ సామాజిక మాధ్యమాల్లో కొంతకాలంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ వివాదం కలెక్షన్లపై పెద్దగా ప్రభావం చూపకపోయినా, నెగెటివ్ రివ్యూలు మాత్రం గట్టిగానే వచ్చాయి. దీనిపై చిత్రంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ నటుడు జగపతి బాబు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆసక్తికరంగా స్పందించారు.

"సినిమాను ఆదరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. మా సినిమాకు బ్యాడ్ రివ్యూలు రాసిన వారికి మరింత ప్రత్యేకంగా థ్యాంక్స్ చెబుతున్నాను. ఎందుకంటే, మీ నెగెటివిటీ మాకు తెలియకుండానే సినిమా ప్రమోషన్‌కు ఎంతో సహాయపడింది" అని జగపతి బాబు పేర్కొన్నారు.

అస్తిత్వం కోసం పోరాడే ఆట కూలీ

వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట్ సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్, సుకూమార్ రైటింగ్స్ సమర్పకులుగా వ్యవహరించారు. కనీస సౌకర్యాలు, కనీసం ఊరి పేరు కూడా లేని ఒక పల్లెటూరి అస్తిత్వం కోసం పోరాడే 'ఆట కూలీ' కథే ఈ 'పెద్ది'.

ఒక సామాన్య యువకుడు క్రికెట్, కుస్తీ, రన్నింగ్ వంటి క్రీడల ద్వారా తన గ్రామం వాయిస్‌ను ప్రపంచానికి ఎలా వినిపించాడనే పాయింట్‌తో బుచ్చిబాబు ఈ సినిమాను తెరకెక్కించారు. జాన్వీ కపూర్ పాత్రపై విమర్శలు ఉన్నప్పటికీ, రామ్ చరణ్ ఊరమాస్ యాక్టింగ్, కంటెంట్ పవర్‌ వల్లే సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడగలిగింది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks