...
...
Next Story

Peddi: పెద్ది క్లైమ్యాక్స్‌తో చాలా పెద్ద రిస్క్ చేశాను.. ఆ 45 నిమిషాలే సినిమాకు ప్రాణం.. పెద్ది ఏడిపిస్తాడు: బుచ్చిబాబు

Peddi: పెద్ది మూవీ క్లైమ్యాక్స్ తో తాను చాలా పెద్ద రిస్క్ చేసినట్లు చెప్పాడు డైరెక్టర్ బుచ్చిబాబు సానా. క్లైమ్యాక్స్ కు దారి తీసే 45 నిమిషాలే సినిమాకు ప్రాణం అని వెల్లడించాడు. పెద్ది మూవీ జూన్ 4 రిలీజ్ కానుండగా.. ఈ నెల 18న ట్రైలర్ రిలీజ్ కాబోతోంది.

Published on: May 16, 2026, 08:38:53 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' (Peddi) పై అంచనాలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. మే 18న ఈ సినిమా ట్రైలర్ విడుదల కాబోతుండగా, తాజాగా దర్శకుడు బుచ్చిబాబు సినిమా క్లైమాక్స్‌పై చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోతో ‘రిస్క్’

Peddi: పెద్ది క్లైమ్యాక్స్‌తో చాలా పెద్ద రిస్క్ చేశాను.. ఆ 45 నిమిషాలే సినిమాకు ప్రాణం.. పెద్ది ఏడిపిస్తాడు: బుచ్చిబాబు (x/peddi)
Peddi: పెద్ది క్లైమ్యాక్స్‌తో చాలా పెద్ద రిస్క్ చేశాను.. ఆ 45 నిమిషాలే సినిమాకు ప్రాణం.. పెద్ది ఏడిపిస్తాడు: బుచ్చిబాబు (x/peddi)

తాజాగా తెలుగు 360కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బుచ్చిబాబు సానా మాట్లాడుతూ.. 'పెద్ది' చిత్రంలో ఒక షాకింగ్ ఎలిమెంట్ ఉండబోతోందని, అది క్లైమాక్స్‌ను ఊహించని మలుపు తిప్పుతుందని వెల్లడించారు.

రామ్ చరణ్ లాంటి ఒక గ్లోబల్ స్టార్ హీరోతో అలాంటి ఎమోషనల్ క్లైమాక్స్‌ను ప్లాన్ చేయడం చాలా రిస్కీ మూవ్ (సాహసోపేతమైన నిర్ణయం) అని ఆయన అభిప్రాయపడ్డారు.

బుచ్చిబాబు సానా మాటల్లోనే..

"సినిమాలో ఆ సెగ్మెంట్ వచ్చినప్పటి నుంచి ప్రేక్షకులకు 'పెద్దిగాడు' మనసులో ఉండిపోతాడు. వాడిని మర్చిపోవడం ఎవరికీ సాధ్యం కాదు. ఆ ఎమోషనల్ కనెక్ట్ వల్లే ఆ క్యారెక్టర్ అంత పవర్‌ఫుల్‌గా గుర్తిండిపోతుంది. ప్రేక్షకులు ఆ పాత్రతో ఎంతలా మమేకమవుతారంటే.. వాడు ఏడిస్తే థియేటర్లలో అందరూ ఏడుస్తారు. వాడు గెలిచి పైకి లేస్తే వచ్చే 'హై' మామూలుగా ఉండదు. క్లైమాక్స్‌కు దారితీసే ఆ చివరి 45 నిమిషాల ప్రయాణమే ఈ సినిమాకు గుండెకాయలాంటిది" అని బుచ్చిబాబు స్పష్టం చేశాడు.

కమర్షియల్ మీటర్ లోనే ఆర్గానిక్ టచ్

అయితే ఈ పెద్ది సినిమా ప్యూర్ ఎమోషనల్ డ్రామాలా కాకుండా, ఒక పక్కా కమర్షియల్ మీటర్‌లోనే సాగుతుందని బుచ్చిబాబు స్పష్టం చేశారు. ఎమోషన్స్ అన్నీ చాలా సహజంగా వస్తాయని, ఎక్కడా బలవంతంగా ఇరికించినట్లు ఉండవని చెప్పారు. మరి మే 18న రాబోయే ట్రైలర్‌లో ఈ క్లైమాక్స్ ట్విస్ట్‌కు సంబంధించిన ఏమైనా హింట్స్ ఇస్తారేమో చూడాలి.

చిరంజీవి గారికి నెరేషన్ ఇవ్వకుండా తప్పించుకున్నా

ఈ సినిమా వల్ల చరణ్ తో చాలా ఎమోషనల్ అటాచ్‌మెంట్ పెరిగిందని బుచ్చిబాబు చెప్పారు. షూటింగ్ చివరి రోజు చరణ్ చాలా ఎమోషనల్ అయ్యారని, గట్టిగా హగ్ చేసుకున్నారని, తనను గుర్తు పెట్టుకోవాలని అన్నారని తెలిపారు. చరణ్ తో మరో సినిమా చేస్తానని, అది ఎవరి ఊహకూ అందని జానర్ అని కూడా చెప్పడం విశేషం.

పెద్ది విశేషాలు

బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేసిన పెద్ది మూవీలో జాన్వీ కపూర్ ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు. వెంకట సతీస్ కిలారు తన వృద్ధి సినిమాస్ బ్యానర్లో ఈ సినిమాను నిర్మించాడు. జూన్ 4న ఈ మూవీ రిలీజ్ కానుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. 'పెద్ది' క్లైమాక్స్ గురించి బుచ్చిబాబు సానా ఏం చెప్పారు?

సినిమా క్లైమాక్స్ చాలా షాకింగ్‌గా, భారీ ఎమోషనల్ వెయిట్‌తో ఉంటుందని.. రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోతో అలాంటి ఎండ్ ప్లాన్ చేయడం ఒక పెద్ద రిస్క్ అని చెప్పారు.

2. పెద్ది సినిమాలో చివరి 45 నిమిషాల ప్రాధాన్యత ఏమిటి?

క్లైమాక్స్‌కు లీడ్ చేసే ఆ 45 నిమిషాల ఎపిసోడ్ సినిమాకు అత్యంత కీలకమైనదని, అది ప్రేక్షకులను విపరీతంగా కట్టిపడేస్తుందని దర్శకుడు తెలిపారు.

3. 'పెద్ది' ట్రైలర్ ఎప్పుడు విడుదల కానుంది?

ఈ సినిమా అధికారిక ట్రైలర్ మే 18, 2026న విడుదల కానుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks