Ram Charan: డైరెక్టర్ బుచ్చి బాబు సానా కాంబినేషన్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' (Peddi) బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను నమోదు చేసిన విషయం తెలిసిందే. 1990ల నాటి గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్ చరణ్ మాస్ అండ్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఇప్పుడు హిందీలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్కు రెడీ అవుతోంది.

సోనీ మాక్స్ (Sony MAX) ఛానెల్లో అక్టోబర్ 24 రాత్రి 8 గంటలకు హిందీలో ప్రసారం కానున్న సందర్భంగా, రామ్ చరణ్ ఈ సినిమా షూటింగ్ విశేషాలను, తనకు బాగా కనెక్ట్ అయిన సీన్ల గురించి మీడియాతో పంచుకున్నారు.
కష్టమే కానీ అసాధ్యం కాదు.. ఆ ఎమోషనల్ సీన్ గురించి చరణ్ మాటల్లో..
పెద్ది సినిమాలోని కీలక సన్నివేశాల గురించి రామ్ చరణ్ మాట్లాడుతూ.. "సినిమాలో కేవలం ఒకటి రెండు సీన్లు అని చెప్పలేను. క్రికెట్ మ్యాచ్లు, మల్టిపుల్ రెజ్లింగ్ ఫైట్స్ చాలా ఉన్నాయి. ముఖ్యంగా హీరోని కేవలం ఒక్క రూపాయికి వేలం వేసే క్రికెట్ వేలం సీన్ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఆ తర్వాత హీరో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొని గుర్తింపు తెచ్చుకుంటాడు అనేది ఆడియన్స్ను కట్టిపడేస్తుంది" అని తెలిపారు.
ఇక సినిమాలో అత్యంత భావోద్వేగభరితంగా సాగే హాస్పిటల్ సీన్ గురించి చెబుతూ.. హీరో ఇకపై ఎప్పటికీ రెజ్లింగ్ చేయలేడని తెలుసుకునే ఆ ఎమోషనల్ మూమెంట్ తనకు చాలా దగ్గరైందని అన్నారు. "ఆ సమయానికి నటీనటులందరూ పాత్రల్లో పూర్తిగా లీనమైపోయారు. దర్శకుడు బుచ్చి బాబు ఆ సీన్ కోసం చాలా రోజులు హోంవర్క్ చేసి ప్లాన్ చేశారు. కానీ అందరి అద్భుతమైన కోఆపరేషన్ వల్ల మేం కేవలం 8 గంటల్లోనే ఆ మొత్తం సీన్ను పూర్తి చేశాం. నా హృదయానికి అత్యంత దగ్గరగా ఉండే సీన్ అది" అని చరణ్ ఎమోషనల్ అయ్యారు.
బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు.. ఓటీటీలోనూ దూకుడు
సాక్నిల్క్ ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం.. 'పెద్ది' సినిమా ఇండియాలో రూ. 244.64 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 341.90 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించింది. ఒక స్పోర్ట్స్ మ్యాన్ తన ఊరికి చట్టబద్ధమైన గుర్తింపు కోసం ప్రభుత్వంతో పోరాడే ఈ కథాంశం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
{{/usCountry}}సాక్నిల్క్ ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం.. 'పెద్ది' సినిమా ఇండియాలో రూ. 244.64 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 341.90 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించింది. ఒక స్పోర్ట్స్ మ్యాన్ తన ఊరికి చట్టబద్ధమైన గుర్తింపు కోసం ప్రభుత్వంతో పోరాడే ఈ కథాంశం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
{{/usCountry}}ప్రస్తుతం ఈ చిత్రం నెట్ఫ్లిక్స్ (Netflix)లో సక్సెస్ఫుల్గా స్ట్రీమింగ్ అవుతుండగా, తెలుగు టెలివిజన్ ప్రీమియర్ పూర్తయింది. ఇప్పుడు అక్టోబర్ 24న సోనీ మాక్స్ వేదికగా హిందీలో ప్రసారం కానుండటంతో హిందీ బెల్ట్ ఆడియన్స్ కూడా ఈ మాస్ ఎంటర్టైనర్ను వీక్షించడానికి సిద్ధమవుతున్నారు.