Ram Charan: లండన్‌లో పెద్ది సక్సెస్ హంగామా.. రామ్ చరణ్‌కు ఫ్యాన్స్ బ్రహ్మరథం.. ఫొటోలు, వీడియోలు వైరల్
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం ‘పెద్ది’ (Peddi) బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులతో దూసుకుపోతోంది. ఈ చిత్రం లండన్ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న చరణ్‌కు అక్కడ వందలాది మంది అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంతర్జాతీయ క్రేజ్ మరోసారి గ్లోబల్ వేదికపై వైరల్ గా మారింది. లండన్ లో చరణ్ క్రేజ్ ఆకాశాన్ని తాకింది. ‘పెద్ది’ థియేటర్లలో భారీ విజయాన్ని అందుకోవడంతో, లండన్‌లో నిర్వహించిన ప్రత్యేక సక్సెస్ వేడుకల్లో రామ్ చరణ్ స్వయంగా పాల్గొన్నాడు. అక్కడ చరణ్‌ను చూసేందుకు వందలాది మంది ఓవర్సీస్ అభిమానులు లండన్ వీధుల్లోకి తరలిరావడంతో మెగా నినాదాలతో బ్రిటన్ హోరెత్తింది.

వైరల్ ఫొటోలు
పెద్ది సక్సెస్ సెలబ్రేషన్స్ కోసం రామ్ చరణ్ యూకేకు వెళ్లాడు. హౌన్ స్లోలోని సినీ వరల్డ్ లో అక్కడి ఫ్యాన్స్ తో కలిసి మూవీ చూశాడు. ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్ అక్కడికి పోటెత్తారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
రామ్ చరణ్ క్రేజ్
ఒక ప్రముఖ ఓవర్సీస్ ఫ్యాన్ పేజీ ఈ వేడుక విజువల్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ ఇలా పేర్కొంది.
"లండన్‌లో రామ్ చరణ్‌కు లభించిన భారీ జనసందోహం ‘పెద్ది’ బ్లాక్‌బస్టర్ విజయానికి అద్దం పడుతోంది. అభిమానుల ఎనర్జీ, కేరింతలు, చూపించిన అపారమైన ప్రేమ చరణ్ అంతర్జాతీయ మార్కెట్‌ను, ఈ సినిమా సృష్టించిన అద్భుత ప్రభావాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పాయి" అని ఆ పేజీ రాసుకొచ్చింది.
ఎమోషనల్ బాండింగ్
రామ్ చరణ్‌కు లండన్ నగరితో ఒక ప్రత్యేకమైన ఎమోషనల్ అనుబంధం ఉంది. గత ఏడాది లండన్‌లోని ప్రపంచ ప్రసిద్ధ ‘మేడమ్ టుస్సాడ్స్’ మ్యూజియంలో చరణ్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. భార్య ఉపాసన, కుమార్తె క్లిన్ కారా, తల్లిదండ్రులు మెగాస్టార్ చిరంజీవి, సురేఖల సమక్షంలో జరిగిన ఆ అపురూప వేడుక జ్ఞాపకాలు తాజాగా ఉండగానే, ఇప్పుడు ‘పెద్ది’ సక్సెస్ వేడుకలు అదే లండన్‌లో జరగడం విశేషం.
పెద్ది బ్రేక్ ఈవెన్ మ్యాజిక్!
శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘గేమ్ చేంజర్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో మెగా ఫ్యాన్స్‌లో ఉన్న చిన్న అసంతృప్తిని ‘పెద్ది’ చిత్రం పూర్తిగా తుడిచేసింది. బుచ్చిబాబు సాన ఎంచుకున్న రస్టిక్ విలేజ్ అడ్వెంచర్ చరణ్ మాస్ ఇమేజ్‌కు పర్ఫెక్ట్‌గా సరిపోయింది.
ఈ ఎమోషనల్ రూరల్ స్పోర్ట్స్ డ్రామా కేవలం 22 రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఏరియాల్లో బ్రేక్-ఈవెన్ మార్కును దాటి క్లియర్ ప్రాఫిట్ జోన్‌కు చేరుకుంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, విజయనగరం యాసలో రామ్ చరణ్ చేసిన ట్రాన్స్‌ఫార్మేషన్ రిపీట్ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పిస్తోంది. ట్రేడ్ వర్గాల నివేదిక ప్రకారం, వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం ఇప్పటికే దాదాపు రూ.487 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి రూ.500 కోట్ల క్లబ్‌కు అత్యంత చేరువలో నిలిచింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


