...
...
Next Story

Ram Charan Peddi: నా ప్రియమైన పెద్ది.. సెట్స్‌లో మరో 6 రోజులే: బుచ్చిబాబు సానా పోస్ట్ వైరల్

Ram Charan Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘పెద్ది’. ఈ సినిమా లేటెస్ట్ షూటింగ్ షెడ్యూల్‌పై దర్శకుడు బుచ్చిబాబు ఒక ఎమోషనల్ పోస్ట్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

Published on: Apr 21, 2026, 17:48:36 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Ram Charan Peddi: రామ్ చరణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రాజెక్టులలో పెద్ది ఒకటి. 'ఉప్పెన' వంటి సెన్సేషనల్ హిట్‌ను అందించిన బుచ్చిబాబు సానా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే రిలీజ్ వాయిదా పడుతుండటమే అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో పెద్ది సెట్స్ లో మరో ఆరు రోజులే అంటూ బుచ్చిబాబు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

నా ప్రియమైన పెద్ది అంటూ..

Ram Charan Peddi: నా ప్రియమైన పెద్ది.. సెట్స్‌లో మరో 6 రోజులే: బుచ్చిబాబు సానా పోస్ట్ వైరల్
Ram Charan Peddi: నా ప్రియమైన పెద్ది.. సెట్స్‌లో మరో 6 రోజులే: బుచ్చిబాబు సానా పోస్ట్ వైరల్

దర్శకుడు బుచ్చిబాబు సానా తన తాజా ట్వీట్‌లో 'పెద్ది' సినిమా షెడ్యూల్ విశేషాలను వెల్లడించారు. "పెద్ది సెట్స్‌లో చివరి ఆరు రోజులు.. నాకెంతో స్ఫూర్తినిచ్చిన పాత్ర ఇది. నా ప్రియమైన పెద్ది రామ్ చరణ్ సర్" అంటూ ఆయన ఎమోషనల్ అయ్యారు.

దీనికి చరణ్ తో కలిసి తీసుకున్న సెల్ఫీని జత చేశారు. అందులో చెర్రీ సెల్ఫీ తీస్తుండగా.. వెనుక బుచ్చిబాబు నిల్చొన్నాడు. ఇప్పటికే మూవీ రిలీజ్ వాయిదా పడుతున్న నేపథ్యంలో విమర్శలు ఎదుర్కొంటున్న డైరెక్టర్.. ఈ తాజా అప్డేట్ తో ఫ్యాన్స్ ను కాస్త శాంతింపజేసే ప్రయత్నం చేశాడు. ఈ పోస్ట్ ప్రకారం పెద్ది షూటింగ్ మరో ఆరు రోజుల్లో ముగియనుంది.

సాధారణంగా రామ్ చరణ్ తన పాత్రల్లో పరకాయ ప్రవేశం చేస్తారన్న పేరుంది. అయితే ఈ సినిమాలో 'పెద్ది' పాత్రను దర్శకుడు అంత గొప్పగా వర్ణించడం చూస్తుంటే, చరణ్ కెరీర్‌లో ఇది మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

పెద్ది రిలీజ్ డేట్

ఈ మూవీ నుంచి ఇప్పటి వరకూ వచ్చిన కంటెంట్ కు మాత్రం అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ రావడమే మేకర్స్ కు ఊరట కలిగించే విషయం. చరణ్ మాస్ అవతార్, అతడు వేసిన స్టెప్పులు, కుస్తీ వీరుడిగా అతని మేకోవర్ విపరీతంగా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe