గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ ‘పెద్ది’ షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో ఆడిపాడేందుకు ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్‌తో చర్చలు జరుగుతున్నాయన్న క్రేజ్ బజ్ ఇప్పుడు ఇండస్ట్రీలో నెలకొంది. ధనుష్ తో పెళ్లి పుకార్ల నేపథ్యంలో మృణాల్ ఇలా ఐటెమ్ సాంగ్ అంటూ వార్తల్లో నిలవడం విశేషం.
మృణాల్ ఠాకూర్ ఎంట్రీ..

ఈమధ్యే మృణాల్ ఠాకూర్.. స్టార్ హీరో ధనుష్‌తో ప్రేమలో ఉందంటూ వచ్చిన పుకార్ల కారణంగా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. వీరిద్దరూ ఫిబ్రవరి 14న పెళ్లి చేసుకోబోతున్నారని కూడా కొన్ని రిపోర్టులు వెల్లడించాయి. అయితే మృణాల్ టీమ్ ఈ పుకార్లను ఖండించింది. ఆమె ప్రస్తుతం తాను ఒప్పుకున్న సినిమాలపైనే పూర్తి దృష్టి సారించిందని వారు స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించిన మృణాల్ ఠాకూర్.. రామ్ చరణ్ లాంటి హీరో సరసన ఓ స్పెషల్ సాంగ్ చేయబోతుందన్న వార్త కచ్చితంగా ఆసక్తి రేపేదే. అయితే దీనిపై మూవీ టీమ్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఇటు మృణాల్ కూడా దీనిపై స్పందించలేదు. అయితే ఇదే నిజమైతే మాత్రం చరణ్, మృణాల్ కాంబినేషన్ సిల్వర్ స్క్రీన్ పై ప్రత్యేకంగా కనిపించడం ఖాయం.
పెద్ది వాయిదా పడిందా?
నేషనల్ అవార్డు విన్నర్ అయిన బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్న ‘పెద్ది’ మూవీ ఇప్పటికే దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. మొదట ఈ సినిమాను ఈ ఏడాది మార్చి 27న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా వాయిదా పడవచ్చని జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఒకవేళ ‘పెద్ది’ సినిమా మార్చి 27 తేదీ నుంచి తప్పుకుంటే.. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదలయ్యే అవకాశం ఉంది. నాని సినిమా ‘ది ప్యారడైజ్’ కూడా అదే సమయంలో విడుదల కావాల్సి ఉంది. కానీ అది కూడా పోటీ నుంచి తప్పుకోవచ్చని సమాచారం.
{{/usCountry}}ఒకవేళ ‘పెద్ది’ సినిమా మార్చి 27 తేదీ నుంచి తప్పుకుంటే.. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదలయ్యే అవకాశం ఉంది. నాని సినిమా ‘ది ప్యారడైజ్’ కూడా అదే సమయంలో విడుదల కావాల్సి ఉంది. కానీ అది కూడా పోటీ నుంచి తప్పుకోవచ్చని సమాచారం.
{{/usCountry}}దీనికి ప్రధాన కారణం మార్చి 19న విడుదల కానున్న ‘ధురంధర్ 2’ మూవీ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ప్రభంజనం సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు. అందుకే తమ పాన్ ఇండియా సినిమాను ఆ సినిమాతో పోటీకి దింపకూడదని ‘పెద్ది’ నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
త్వరలో కొత్త పాట..
పెద్ది సినిమా నుంచి ఇప్పటికే ‘చికిరి చికిరి’ అనే పాట విడుదలై యూట్యూబ్ లో సంచలనాలు క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలో రెండో పాటను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ముంబైలో తనకు తగినంత పని దొరకడం లేదని రెహమాన్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో.. మంచి మ్యూజిక్ అందించాలనే ఒత్తిడి అతనిపై ఉంది.