Peddi Trailer: మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ మోస్ట్ అవేటెడ్ రోజు వచ్చేసింది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో చరణ్ నటిస్తున్న భారీ చిత్రం 'పెద్ది' ట్రైలర్ రిలీజ్ ఇవాళే (మే 18). ఈ ట్రైలర్ రిలీజ్ లాంఛ్ ఈవెంట్, టైమింగ్ వివరాల గురించి ఇక్కడ చూసేయండి.
పెద్ది ట్రైలర్

క్రేజీ రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది మూవీ ట్రైలర్ కోసం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సినీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముంబైలో సోమవారం గ్రాండ్‌గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని ప్రముఖ 'జియో వరల్డ్ డ్రైవ్' వేదికగా అత్యంత వైభవంగా విడుదల చేయనున్నారు.
టైమ్ ఎప్పుడంటే?
నేటి మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఈ వేడుక లైవ్ కానుంది. ఈ ట్రైలర్‌పై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై విపరీతమైన క్రేజ్ పెంచగా, ఈ ట్రైలర్ సినిమా హైప్‌ను మరింత పెంచుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ముంబై చేరుకున్న రామ్ చరణ్
పెద్ది ట్రైలర్ లాంఛ్ గ్రాండ్ ఈవెంట్ కోసం హీరో రామ్ చరణ్ ఇప్పటికే ముంబై చేరుకున్నారు. చిత్ర కథానాయిక జాన్వీ కపూర్, దర్శకుడు బుచ్చిబాబు సానతో పాటు మిగిలిన చిత్ర యూనిట్ సభ్యులు ఈ లాంచ్ ఈవెంట్ లో పాల్గొనేందుకు ముంబై చేరుకుంటున్నారు. పాన్ ఇండియా మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని చిత్ర బృందం ముంబైలో ఈ భారీ ఈవెంట్‌ను ప్లాన్ చేసింది.
పెద్ది రిలీజ్ డేట్
రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పల్లెటూరి నేపథ్యంలో సాగే పవర్ఫుల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. వృద్ధి సినిమాస్ పతాకంపై ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి అద్భుతమైన మ్యూజిక్ అందించారు. పలు భారతీయ భాషల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'పెద్ది' సినిమా జూన్ 4, 2026 నుంచి థియేటర్లలో ఆడియన్స్ తో కేకలు పెట్టించనుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
{{/usCountry}}రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పల్లెటూరి నేపథ్యంలో సాగే పవర్ఫుల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. వృద్ధి సినిమాస్ పతాకంపై ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి అద్భుతమైన మ్యూజిక్ అందించారు. పలు భారతీయ భాషల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'పెద్ది' సినిమా జూన్ 4, 2026 నుంచి థియేటర్లలో ఆడియన్స్ తో కేకలు పెట్టించనుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
{{/usCountry}}'పెద్ది' సినిమా ట్రైలర్ ఎప్పుడు, ఎక్కడ విడుదలవుతుంది?
జవాబు: 'పెద్ది' సినిమా ట్రైలర్ ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్‌లో మధ్యాహ్నం 3 గంటల తర్వాత గ్రాండ్‌గా విడుదల కానుంది.
ప్రశ్న: 'పెద్ది' సినిమా డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు?
జవాబు: ఈ చిత్రానికి బుచ్చిబాబు సాన దర్శకత్వం వహించగా, మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
ప్రశ్న: రామ్ చరణ్ 'పెద్ది' సినిమా ఎప్పుడు రిలీజ్ కానుంది?
జవాబు: ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా బహుభాషల్లో థియేటర్లలో విడుదల కానుంది.