...
...
Next Story

చొక్కా లేకుండా జిమ్‌లో కండలతో రామ్ చరణ్-నెక్ట్స్ ఛాలెంజ్‌కు రెడీ అంటూ పోస్ట్-ఇంట‌ర్నెట్‌ను షేక్ చేస్తున్న ఫొటో

ఒంటిపై చొక్కా లేకుండా, జిమ్ లో కండలతో ఉన్న రామ్ చరణ్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెక్ట్స్ ఛాలెంజ్ కు రెడీ అంటూ చరణ్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.

Published on: Jan 17, 2026, 18:57:53 IST
Advertisement

పెద్ది సినిమాతో థియేటర్లను షేక్ చేయబోతున్నాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. బుచ్చిబాబు సాన డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రూరల్ క్రికెటర్ గా చెర్రీ యాక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా గ్లింప్స్, సాంగ్ అదిరిపోయాయి. ఇక సినిమా నెక్ట్స్ షెడ్యూల్ కోసం రెడీ అంటూ చరణ్ ఈ రోజు ఇన్ స్టాలో పెట్టిన పోస్టు తెగ వైరల్ గా మారింది.

రామ్ చరణ్ ఫొటో

రామ్ చరణ్ (x/PeddiMovieOffl)
రామ్ చరణ్ (x/PeddiMovieOffl)

పెద్ది సినిమా కోసం బాగా కష్టపడుతున్నాడు రామ్ చరణ్. తెగ కండలు పెంచేస్తున్నాడు. గ్రామీణ క్రికెటర్ గా ఈ సినిమాలో నటిస్తున్నాడు చెర్రీ. శనివారం (జనవరి 17) రామ్ చరణ్ ఇన్ స్టాలో పెట్టిన రెండు ఫొటోలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఒంటిపై చొక్కా లేకుండా జిమ్ లో చిరుత లాంటి చూపుతో ఉన్న ఈ ఫొటోలు చూసి ఫ్యాన్స్ పుల్ ఖుష్ అవుతున్నారు.

ఛాలెంజ్ కు రెడీ

‘‘ఫైర్డ్ అప్. నిశ్శబ్దంలో పని. తర్వాతి ఛాలెంజ్ కు రెడీ. పెద్ది మూవీ’’ అని రామ్ చరణ్ ఇవాళ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు. క్షణాల్లోనే ఈ ఫొటోలు తెగ వైరల్ గా మారాయి. ఎక్స్ లో పెద్ది సినిమా అఫీషియల్ అకౌంట్, నిర్మాతల అకౌంట్లలోనూ ఈ ఫొటోలు పంచుకున్నారు. దీంతో ఎక్కడ చూసినా చెర్రీ కండల ఫొటోలే దర్శనమిస్తున్నాయి.

పెద్ది సినిమా గురించి

గేమ్ ఛేంజర్ లాంటి ఫ్లాప్ తర్వాత చేస్తున్న పెద్ది సినిమాపై రామ్ చరణ్ భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఈ చిత్రం నుంచి రిలీజైన గ్లింప్స్, చికిరి సాంగ్ కు అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. దీంతో మూవీపై హైప్ మరింత పెరిగిపోయింది. పెద్ది సినిమాకు ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సినిమా థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఈ ఓటీటీలోకి రానుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks